Kanguva Release Date: సూర్య కంగువ రిలీజ్ డేట్ ఇదే.. రజనీకాంత్‌తో పోటీకి సై అంటున్న స్టార్
Kanguva Release Date: సూర్య నటిస్తున్న కంగువ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అయితే ఈ తమిళ స్టార్ అక్కడి సూపర్ స్టార్ రజనీకాంత్ తో పోటీ పడుతుండటం విశేషం.

Kanguva Release Date: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న మచ్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ కంగువ రిలీజ్ డేట్ ను మేకర్స్ గురువారం (జూన్ 27) అనౌన్స్ చేశారు. చాలా రోజులుగా పెద్ద హిట్ కోసం చూస్తున్న సూర్యతోపాటు అభిమానులు కూడా ఈ భారీ బడ్జెట్ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ మూవీ రజనీకాంత్ నటిస్తున్న వెట్టైయాన్ తో పోటీ పడుతుండటం విశేషం.
కంగువ రిలీజ్ డేట్ ఇదే
సూర్య నటిస్తున్న కంగువ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని సూర్య తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అనౌన్స్ చేశాడు. "డియర్ ఆల్.. అక్టోబర్ 10న వస్తోంది" అనే సింపుల్ క్యాప్షన్ తో కంగువ రిలీజ్ డేట్ విషయాన్ని అతడు చెప్పాడు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ కానుండటం విశేషం.
ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఓ పెద్ద గుట్టలా పడి ఉన్న శవాలపై సూర్య ఓ కత్తి పట్టుకొని చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకూ మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ బాగానే జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ను సూర్య చాలా రోజుల కిందటే పూర్తి చేసుకున్నాడు.
రజనీకాంత్‌తో పోటీ
అయితే ఈ కంగువ మూవీ రిలీజ్ రోజే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న వెట్టైయాన్ మూవీ రిలీజ్ కానుంది. జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ తేదీని గతంలోనే అనౌన్స్ చేశారు. ఇప్పుడు కంగువను కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నట్లు చెప్పడంతో వెట్టైయాన్ రిలీజ్ వాయిదా పడుతుందన్న వార్తలు వస్తున్నాయి. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం అంటే రెండింటికీ నష్టమే.
దీంతో రజనీకాంత్ వెట్టైయాన్ ఆ తేదీ నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఇక కంగువ మూవీలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది. ఇక బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.
నిజానికి కంగువ మూవీ రిలీజ్ అవుతున్న అక్టోబర్ 10న జూనియర్ ఎన్టీఆర్ దేవర కూడా రిలీజ్ అవుతుందని మొదట్లో ప్రకటించారు. కానీ ఆ సినిమా ఇప్పుడు కాస్త ముందుగా సెప్టెంబర్ 27నే రిలీజ్ కాబోతోంది. దీంతో కంగువ మూవీ ఈ తేదీని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.