Oscars 2025: ఆస్కార్ బరిలో సూర్య కంగువ - బెస్ట్ మూవీ కేటగిరీలో మరో రెండు ఇండియన్ మూవీస్!
Oscars 2025: సూర్య కంగువ మూవీ ఆస్కార్ రేసులోకి నిలిచింది. బెస్ట్ పిక్చర్ కోసం కంగువతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోల్ లైఫ్, గర్ల్స్ విల్ బి గర్ల్స్ సినిమాలు నామినేషన్స్‌లో నిలిచాయి. బెస్ట్ పిక్చర్ కోసం వరల్డ్ వైడ్‌గా 207 సినిమాలు నామినేట్ అయ్యాయి.
Oscars 2025: సూర్య హీరోగా నటించిన డిజాస్టర్ మూవీ కంగువ ఆస్కార్ రేసులో నిలిచింది. 2025 ఆస్కార్ అవార్డుల కోసం మొత్తం వరల్డ్ వైడ్‌గా 207 సినిమాలు నామినేషన్స్‌లో నిలిచాయి. ఇందులో మూడు ఇండియన్ సినిమాలు ఉన్నాయి. సూర్య కంగువతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్, గర్ల్స్ విల్ బి గర్ల్స్ సినిమాలు ఎలిజిబుల్ నామినేషన్స్‌లో నిలిచాయి.
ఇండివిడ్యువల్ కేటగిరీలో...
ఇండివిడ్యువల్ కేటగిరీలో బెస్ట్ పిక్చర్స్ కేటగిరీలో ఈ మూడు ఇండియన్ సినిమాలు నామినేషన్స్‌లో నిలిచాయి. ఇండియన్ ఆస్కార్ కమిటీతో సంబంధం లేకుండా అస్కార్ అవార్డుల కోసం మేకర్స్ ఇండివిడ్యువల్‌గా అప్లై చేసుకున్నారు.
ఓటింగ్ ఎప్పుడంటే?
207 సినిమాల నుంచి ఓటింగ్ ప్రకారం టాప్ టెన్ సినిమాలతో కూడిన ఫైనల్ లిస్ట్‌ను ఆస్కార్ కమిటీ ప్రకటిస్తుంది. నామినేషన్స్‌కు సంబంధించిన ఓటింగ్ జనవరి 8న మొదలై జనవరి 12న ముగియబోతున్నట్లు సమాచారం. జనవరి 17న ఫైనల్ లిస్ట్‌ను ప్రకటించబోతున్నారు.
డిజాస్టర్...
ఆస్కార్ కంగువ రేసులో నిలవడం ఆసక్తికరంగా మారింది. భారీ అంచనాల గత ఏడాది నవంబర్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. 2024లో నిర్మాతలకు ఎక్కువ నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు మూడు వందల యాభై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ వంద కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది.
కార్తి గెస్ట్ రోల్...
సూర్య యాక్టింగ్, యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్స్ బాగున్నా...కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కంగువ మూవీకి సిరుత్తై శివ దర్శకత్వం వహించాడు. దిశా పటానీ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో కార్తి గెస్ట్‌రోల్‌లో కనిపించాడు.
కంగువ కథ ఇదే...
ఫ్రాన్సిన్ (సూర్య), కోల్ట్ (యోగిబాబు) గోవాలో బౌంటీ హంటర్స్‌గా పనిచేస్తోంటారు. క్రిమినల్స్‌ను పట్టుకోవడంలో పోలీసులకు సాయం చేస్తూ వచ్చే డబ్బులతో జీవితాన్ని సాగిస్తుంటారు. మరో బౌంటీ హంటర్ ఏంజెలీనాను (దిశా పటానీ) ప్రేమిస్తాడు ఫ్రాన్సిస్. కానీ ఓ గొడవ కారణంగా ఫ్రాన్సిస్‌కు బ్రేకప్ చెబుతుంది ఏంజెలీనా. ఓ రష్యన్ ల్యాబ్ నుంచి జెటా అనే చిన్నారి తప్పించుకొని ఫ్రాన్సిస్ దగ్గరకు వస్తాడు. ల్యాబ్ మనుషుల బారి నుంచి జెటాను ఫ్రాన్సిస్ రక్షిస్తాడు.
ఈ క్రమంలో ఫ్రాన్సిస్‌కు జెటాకు పూర్వజన్మలో సంబంధం ఉందనే నిజం బయటపడుతుంది. అదేమిటి? 1070 కాలంలో విదేశీయుల బారి నుంచి ప్రణవాది తెగను కాపాడిన కంగువ ఎవరు? కంగువతో జెటాకు ఎలాంటి రిలేషన్ ఉంది?
కంగువకు కపాల కోనకు చెందిన రుధిర నేత్రకు(బాబీ డియోల్) మధ్య వైరం ఏర్పడటానికి కారణం ఏమిటి? ప్రణవాది తెగను విదేశీయులను అప్పగించాలని రుధిర నేత్ర ఎందుకు అనుకున్నాడు. పంచద్వీప సమూహంలోని ప్రణవాది, కాపాలతో పాటు మరో మూడు తెగల మధ్య రొమేనియన్లు ఎలాంటి విద్వేషాలు సృష్టించారు? రుద్రాంగ నేత్రుడు (కార్తి) ఎవరు అన్నదే కంగువ మూవీ కథ.
రెట్రో మూవీ…
కంగువ తర్వాత కార్తీక్ సుబ్బరాజుతో రెట్రో మూవీ చేస్తోన్నాడు సూర్య. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఆర్‌జే బాలాజీతో ఓ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.