నటి సురేఖవాణి కూతురు సుప్రిత ఓ హారర్ థ్రిల్లర్ మూవీ చేస్తోంది. అమరావతికి ఆహ్వానం పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సుప్రితతో పాటు ఎస్తర్, ధన్యబాలకృష్ణ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. శివ కంఠంనేని హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి జీవీకే దర్శకత్వం వహిస్తున్నాడు.
అమరావతికి ఆహ్వానం లేటెస్ట్ షెడ్యూల్ మధ్య ప్రదేశ్ లో కంప్లీట్ చేశారు. మధ్య ప్రదేశ్‌లోని చింద్వార సమీపంలో ఉన్న తామ్య హిల్స్, పాతాళ్ కోట్, బిజోరి, చిమ్‌తీపూర్ వంటి పలు అందమైన లొకేషన్స్‌లో దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. ఈ షెడ్యూల్ కంటే ముందు ఏపీ, తెలంగాణలో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించినట్లు మేకర్స్ వెల్లడించారు.
హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ - “అమరావతికి ఆహ్వానం టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజెంట్ ట్రెండ్‌కు తగ్గట్లుగా మంచి హారర్ థ్రిల్లర్‌గా మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. వీఎఫ్ఎక్స్‌కి ప్రాధాన్యమున్న సినిమా ఇది. . జె ప్రభాకర్ రెడ్డి విజువల్స్, హనుమాన్ ఫేమ్ సాయిబాబు తలారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయి. పద్మనాబ్ భరద్వాజ్ గారి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హారర్ మూడ్ ని క్యారీ చేశేలా ఉంటాయి” అని అన్నారు.
అమరావతికి ఆహ్వానం మూవీలో హరీష్, అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. ఈ మూవీని కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు.
సుప్రిత ప్రస్తుతం తెలుగులో లేచింది మహిళా లోకం మూవీతో పాటు బిగ్‌బాస్ రన్నరప్ అమర్‌దీప్ చౌదరితో ఓ లవ్‌స్టోరీ మూవీ చేస్తోంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. మరోవైపు ధన్యబాలకృష్ణ ఇటీవలే బాపు మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాపుతో పాటు పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన హత్య సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కీలక పాత్రలో కనిపించింది ధన్య బాలకృష్ణ.
సంబంధిత కథనం