ఆ డైరెక్టర్‌తో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ సినీ ఎంట్రీ- మహేశ్ బాబు పర్యవేక్షణ- లండన్‌లో నటనపై శిక్షణ!-superstar krishna grandson jayakrishna debut with director ajay bhupathi in mahesh babu observation ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఆ డైరెక్టర్‌తో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ సినీ ఎంట్రీ- మహేశ్ బాబు పర్యవేక్షణ- లండన్‌లో నటనపై శిక్షణ!

ఆ డైరెక్టర్‌తో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ సినీ ఎంట్రీ- మహేశ్ బాబు పర్యవేక్షణ- లండన్‌లో నటనపై శిక్షణ!

Sanjiv Kumar HT Telugu

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో సినీ రంగ ప్రవేశం చేయనున్నాడు. దివంగత, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు, హీరో రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. జయకృష్ణను ఆర్ఎక్స్ 100, మంగళవారం డైరెక్టర్ అజయ్ భూపతి హీరోగా లాంచ్ చేయనున్నాడు.

ఆ డైరెక్టర్‌తో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ సినీ ఎంట్రీ- మహేశ్ బాబు పర్యవేక్షణ- లండన్‌లో నటనపై శిక్షణ!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీనకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో ఊపందుకుంటోంది. దివంగత, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు, హీరో రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు.

రెండు బ్లాక్ బస్టర్స్‌తో

ఈ కొత్త ప్రాజెక్టును దర్శకుడు అజయ్ భూపతి స్వయంగా తెరకెక్కించినున్నారని తాజా సమాచారం. ఆర్ఎక్స్ 100 వంటి బ్లాక్‌బస్టర్‌తో తన ప్రతిభను చాటిన అజయ్ భూపతి ఆ తర్వాత సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ "మంగళవారం" మూవీతో మళ్లీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం "మంగళవారం 2" ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు డైరెక్టర్ అజయ్ భూపతి.

కొత్త హీరోను లాంఛ్

మంగళవారం 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగానే మరో హై-ప్రొఫైల్ లాంఛింగ్ ప్రాజెక్ట్‌కి అజయ్ భూపతి శ్రీకారం చుట్టారు. ఘట్టమనేని కుటుంబం నుంచి కొత్త హీరోను అజయ్ భూపతి లాంచ్ చేయనున్నారు. ఈ సినిమా ద్వారా జయకృష్ణ వెండితెరకు పరిచయమవుతున్నాడు.

రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు

ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ నిర్మాతలు మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ కేటాయించి వైజయంతి ఆర్ట్స్, అనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించనున్నారట. ఈ సినిమాకు సంబంధించిన కథ, నటీనటులు, షూటింగ్ షెడ్యూల్ వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.

లండన్‌లో శిక్షణ

అయినప్పటికీ, సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నారని తెలియడంతో చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జయకృష్ణ ప్రస్తుతం లండన్‌లో ప్రొఫెషనల్ నటనా శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. సోషల్ మీడియాలో ఇటీవల బయటకు వచ్చిన ఫోటోల ద్వారా అతని లుక్‌పై కూడా జనాల్లో ఆసక్తి పెరిగింది.

పర్యవేక్షిస్తున్న మహేష్ బాబు

ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్‌ను జయకృష్ణ బాబాయి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సాంకేతిక ప్రమాణాలపై దృష్టి

జయకృష్ణ లాంఛ్ కోసం అవసరమైన నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలపై మహేశ్ బాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం