ఇది కదా తలైవా అంటే..ఆశ్రమంలో బస..రోడ్డు పక్కన భోజనం..మరోసారి సింప్లిసిటీ చాటుకున్న రజనీకాంత్.. జైలర్ 2 షూటింగ్ లో బ్రేక్-super star rajnikanth simplicity stay at ashram eating food at road side in rishikesh trip in jailer 2 shooting break ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఇది కదా తలైవా అంటే..ఆశ్రమంలో బస..రోడ్డు పక్కన భోజనం..మరోసారి సింప్లిసిటీ చాటుకున్న రజనీకాంత్.. జైలర్ 2 షూటింగ్ లో బ్రేక్

ఇది కదా తలైవా అంటే..ఆశ్రమంలో బస..రోడ్డు పక్కన భోజనం..మరోసారి సింప్లిసిటీ చాటుకున్న రజనీకాంత్.. జైలర్ 2 షూటింగ్ లో బ్రేక్

అభిమానుల తలైవా ఆయన. ఇండియన్ సినిమా సూపర్ స్టార్. ఆయన మూవీ వచ్చిందంటే ప్రపంచమే ఊగిపోతుంది. అలాంటి వ్యక్తి ఓ సామాన్య మనిషిలా రోడ్డు పక్కన భోజనం చేశాడు. ఆశ్రమంలో బస చేశాడు. మరోసారి సింప్లిసిటీ చాటుకున్న ఆయనే రజనీకాంత్.

రజనీకాంత్ (x)

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు కాదు. ఆయన మూవీ రిలీజైందంటే ప్రపంచ బాక్సాఫీస్ షేక్ అవుతుంది. తలైవాగా జనాల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఆయన చిటికె వేస్తే ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్, ఫుడ్ అన్నీ ఉంటాయి. కానీ సామాన్య ప్రజల్లాగే ఉండటాన్ని ఇష్టపడే రజనీకాంత్ మరోసారి సంప్లిసిటీ చాటుకున్నారు.

జైలర్ 2 మూవీ

రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సీక్వెల్ ‘జైలర్ 2’ నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానుంది. అయితే షూటింగ్ ఇంకా చాలా పెండింగ్‌లో ఉండటంతో రజనీకాంత్ రిషికేశ్‌లో వారం రోజుల విరామం తీసుకున్నారు. సినిమాకు పూర్తిగా కట్టుబడి ఉండే రజనీకాంత్ ఈ కాస్త సమయంలోనే పవిత్ర స్థలాలకు వెళ్లారు. రిషికేశ్‌లోని ఆశ్రమంలో ఆయన బస చేశారు.

రోడ్డు పక్కన

బద్రీనాథ్, బాబా గుహ వంటి ప్రదేశాలకు రజనీకాంత్ వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా రోడ్డు పక్కన రజనీకాంత్ నిలబడి భోజనం చేస్తున్న పిక్స్ కూడా ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇదీ తలైవా అంటే, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారని, ఇలా ఉండటం మరే స్టార్ కు సాధ్యం కాదనే కామెంట్లు వస్తున్నాయి.

'జైలర్ 2' గురించి..

'జైలర్ 2'లో రజనీకాంత్‌తో పాటు మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కేరళ, గోవాలోని ప్రాంతాల్లో ఎక్కువ షూటింగ్ జరుగుతోంది. రజనీకాంత్ ఈ విరామంలో హిమాలయాలకు వెళ్లి తన ఆరోగ్యంపై దృష్టి పెట్టారు.

కూలీ ఇలా

రజనీకాంత్ మళ్లీ ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన, తన గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలో విడుదలైన 'కూలీ' చిత్రం రూ.500 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడు ‘జైలర్ 2’ ని రెడీ చేస్తున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘జైలర్ 2’ సినిమా 2023 బ్లాక్‌బస్టర్‌ జైలర్ కు సీక్వెల్. ఇది రజనీకాంత్ కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ చిత్రంగా నిలవనుంది.

రజనీకాంత్, కమల్ కలిసి

రజనీకాంత్, కమల్ హాసన్‌తో కలిసి ఓ ప్రాజెక్ట్‌లో నటించనున్నట్లు తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తాయని ఆయన చెప్పారు. అయితే దర్శకుడు, స్క్రిప్ట్ ఇంకా ఖరారు కాలేదని తెలిపారు.

"రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్‌తో కలిసి సినిమా చేయబోతున్నాం. దర్శకుడు ఇంకా ఎవరన్నది తేలలేదు. కమల్, నేను కలిసి సినిమా చేయాలనుకుంటున్నాం. మంచి కథ, పాత్రలు వస్తే నటిస్తాం" అని 74 ఏళ్ల రజనీకాంత్ చెప్పారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం