హిమాలయాల్లో సూపర్ స్టార్.. ధ్యానం చేస్తూ, సెల్ఫీలు దిగుతూ.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్-super star rajinikanth in himalayas meditating in mahavatar babaji cave photos and video on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  హిమాలయాల్లో సూపర్ స్టార్.. ధ్యానం చేస్తూ, సెల్ఫీలు దిగుతూ.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్

హిమాలయాల్లో సూపర్ స్టార్.. ధ్యానం చేస్తూ, సెల్ఫీలు దిగుతూ.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్

Hari Prasad S HT Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం హిమాలయాల్లో పర్యటిస్తున్న విషయం తెలుసు కదా. తాజాగా అతడు ధ్యానం చేస్తూ, అభిమానులతో సెల్ఫీలు దిగుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హిమాలయాల్లో సూపర్ స్టార్.. ధ్యానం చేస్తూ, సెల్ఫీలు దిగుతూ.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్నో సంవత్సరాలుగా షూటింగ్‌ల నుండి విరామం తీసుకున్నప్పుడల్లా హిమాలయాల్లో సమయం గడుపుతుంటాడు. తాను ఎంత ఆధ్యాత్మికవాదినో, అక్కడికి వెళ్లడం వల్ల తన మనస్సు ఎంత ప్రశాంతమవుతుందో అతడు అనేక ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇప్పుడు అతడు వార్షిక హిమాలయాల పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. వాటిలో అతడు ధ్యానం చేస్తూ, అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటూ కనిపిస్తున్నాడు.

మహా అవతార్ బాబాజీ గుహలో రజనీకాంత్ ధ్యానం

ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఫోటోలలో రజనీకాంత్ ముదురు రంగు జంపర్, తెలుపు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఒక ఫొటోలో అతడు కళ్ళు మూసుకుని, మహా అవతార్ బాబాజీ గుహ లోపల లోతైన ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. మరొక ఫొటలో అతడు చేతిలో కర్ర పట్టుకుని, మెట్లపై కూర్చుని ఫొటోకు పోజిచ్చాడు.

సాంప్రదాయ తెల్లటి దుస్తులు ధరించిన రజనీకాంత్.. శ్రీ బాబాజీ ఆశ్రమ నిర్వహకులతో ముచ్చటిస్తున్న వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. అతని టీమ్ ఈ వీడియోను ఎక్స్ లో పంచుకుంటూ.. "హిమాలయాల ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్ బాబాజీ గుహ సమీపంలో ఉన్న శ్రీ బాబాజీ ఆశ్రమంలో స్వామీజీతో కలిసి పవిత్రమైన మధ్యాహ్న భోజనం చేశారు" అని రాసింది.

మరో వీడియోలో రజనీకాంత్ కారు రోడ్డు పక్కన ఆగినట్లు చూపించారు. వెంటనే అభిమానులు సెల్ఫీలు తీసుకోవడానికి అతన్ని చుట్టుముట్టారు. రజనీ కూడ సంతోషంగా వాళ్లతో మాట్లాడి, సెల్ఫీలకు పోజిచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు.

రజనీకాంత్ రీసెంట్ మూవీస్

రజనీకాంత్ ఇటీవల ఆధ్యాత్మిక విరామం తీసుకున్నాడు. ఇందులో భాగంగా అతడు రిషికేశ్, బద్రీనాథ్ ధామ్‌లను సందర్శించాడు. ఆ తర్వాత మహా అవతార్ బాబాజీ గుహకు వెళ్లాడు. రోడ్డు పక్కన సాధారణ ఆహారం తింటున్న అతని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక సినిమాల విషయానికొస్తే రజనీకాంత్ చివరిగా ఈ సంవత్సరం లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'కూలీ' లో నాగార్జున, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, సత్యరాజ్ లతో కలిసి నటించాడు. అతడు ఇప్పుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో 2023 హిట్ మూవీ సీక్వెల్ అయిన 'జైలర్ 2' కోసం పనిచేస్తున్నాడు. ఈ సినిమాలో తాను కూడా తన పాత్రను పోషిస్తానని శివరాజ్‌కుమార్ ధృవీకరించాడు. రజనీకాంత్ త్వరలో కమల్ హాసన్‌తో కలిసి ఒక ప్రాజెక్ట్‌లో కూడా పనిచేయనున్నాడు. దీనిని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం