Rajinikanth: రజినీకాంత్ ‘కూలీ’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. ఆ సెంటిమెంట్‌‌‌తో రాబోతున్న సూపర్ స్టార్-super star rajinikanth coolie gears up for a grand release in may 2025 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajinikanth: రజినీకాంత్ ‘కూలీ’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. ఆ సెంటిమెంట్‌‌‌తో రాబోతున్న సూపర్ స్టార్

Rajinikanth: రజినీకాంత్ ‘కూలీ’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. ఆ సెంటిమెంట్‌‌‌తో రాబోతున్న సూపర్ స్టార్

Galeti Rajendra HT Telugu
Nov 13, 2024 02:58 PM IST

Coolie release Date: జైలర్, వెట్టైయాన్ సినిమాలతో రజినీకాంత్ మళ్లీ టాప్ గేర్‌లోకి వచ్చేశారు. నెక్ట్స్ మూవీ లోకేష్ కనగరాజన్‌తో చేయనుండగా.. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి రానుందంటే?

కూలీలో రజినీకాంత్
కూలీలో రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయారు. జైలర్‌తో జోరందుకున్న సూపర్ స్టార్ ఇటీవల వెట్టైయాన్ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చారు. టీజీ జ్ఞానలేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లని రాబట్టింది. ఇదే జోరుతో ప్రస్తుతం రజినీకాంత్ ‘కూలీ’ సినిమాలో నటిస్తున్నారు.

కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరొందిన లోకేశ్ కనగరాజ్ ఈ కూలీ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. ఇటీవల రిలీజైన టైటిల్ టీజర్ సినిమాపై అంచనాల్నిపెంచేసింది. బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే సినిమానే ఈ కూలీ అని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

గోల్డ్ స్మగ్లర్‌గా సూపర్ స్టార్

టైటిల్ టీజర్‌లోనూ ఈ మేరకు బంగారంతో చేసిన ఆయుధాలతో రౌడీని స్టయిల్‌గా బంధిస్తున్నట్లు సూపర్ స్టార్ రజినీకాంత్ కనిపించారు. అతని చుట్టూ బంగారం బిస్కెట్లు, బంగారంతో చేసిన వాచీలుగా గుట్టలుగా కనిపించాయి. చివరికి రౌడీని బంధించిన చైన్ కూడా బంగారంతో చేసి ఉండటం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచేసింది.

కూలీ సినిమాలో రజినీకాంత్ గోల్డ్ స్మగ్లర్‌గా కనిపించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ మూవీలోనే అక్కినేని నాగార్జున, సత్యరాజ్, మంజుమ్మెల్‌ బాయ్స్ ఫేమ్ సౌబిన్‌ షాహిర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కానీ.. హీరోయిన్‌పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే.. ఇటీవల సూపర్ స్టార్‌కి వరుసగా మ్యూజికల్ హిట్స్ ఇస్తున్న అనిరుధ్ రవిచందర్ ఈ కూలీ సినిమాకి మ్యూజిక్ అందించబోతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.

మే డే రిలీజ్

కూలీ సినిమా వచ్చే ఏడాది మార్చికి థియేటర్లలోకి రాబోతుందని తొలుత వార్తలు వచ్చాయి. కానీ.. టైటిల్‌కి తగినట్లుగా కార్మికుల దినోత్సవమైన మే 1 (మే డే) రోజున సెంటిమెంట్‌గా కూలీ సినిమాని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి 2025, మే 1 గురువారం వచ్చింది. అయితే.. ఆరోజు హాలిడే కావడం.. ఆ తర్వాత శుక్రవారం వదిలేస్తే.. మళ్లీ శని, ఆదివారం రూపంలో వీకెండ్ కలిసిరానుంది. దాంతో కలెక్షన్లు కూడా బాగా వస్తాయని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.

Whats_app_banner