Ajith stunts: సూపర్ స్టార్ అజిత్ రిస్కీ స్టంట్స్.. కారు బోల్తా పడటంతో.. వైరల్ అవుతున్న వీడియోలు-super star ajith kumar daring stunts in toppling car for vidaa muyarchi movie videos gone viral in social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ajith Stunts: సూపర్ స్టార్ అజిత్ రిస్కీ స్టంట్స్.. కారు బోల్తా పడటంతో.. వైరల్ అవుతున్న వీడియోలు

Ajith stunts: సూపర్ స్టార్ అజిత్ రిస్కీ స్టంట్స్.. కారు బోల్తా పడటంతో.. వైరల్ అవుతున్న వీడియోలు

Hari Prasad S HT Telugu
Apr 04, 2024 03:26 PM IST

Ajith stunts: తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తన నెక్ట్స్ మూవీ విదా ముయర్చి కోసం చేసిన స్టంట్స్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలను లైకా ప్రొడక్షన్స్ గురువారం (ఏప్రిల్ 4) పోస్ట్ చేసింది.

సూపర్ స్టార్ అజిత్ రిస్కీ స్టంట్స్.. కారు బోల్తా పడటంతో.. వైరల్ అవుతున్న వీడియోలు
సూపర్ స్టార్ అజిత్ రిస్కీ స్టంట్స్.. కారు బోల్తా పడటంతో.. వైరల్ అవుతున్న వీడియోలు

Ajith stunts: సినిమాల్లో స్టంట్స్ కోసం కొందరు స్టార్ హీరోలు ఎంత రిస్క్ అయినా చేస్తుంటారు. చాలా మంది డూప్స్ తో పని కానిస్తే కొందరు మాత్రం సొంతంగా రిస్కీ స్టంట్స్ చేస్తుంటారు. తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ అలాంటి స్టంటే చేశాడు. తన నెక్ట్స్ మూవీ విదా ముయర్చి కోసం అజిత్ చేసిన ఈ స్టంట్స్ వీడియోలను మేకర్స్ లైకా ప్రొడక్షన్స్ గురువారం (ఏప్రిల్ 4) రిలీజ్ చేసింది.

అజిత్ డేరింగ్ స్టంట్

విదా ముయర్చి మూవీ కోసం అజిత్ కారు చేజింగ్ సీన్లో డూప్ లేకుండా నటించాడు. ఓ హైవేపై వేగంగా వెళ్తున్న కారు సీన్ అది. అయితే ఆ కారును బోల్తా కొట్టించాల్సిన ఆ సీన్లో అజిత్ చాలా డేరింగా నటించడం గమనార్హం. తానే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. ఈ కారు చేజింగ్ సీన్ కు సంబంధించిన వివిధ యాంగిల్స్ వీడియోలను లైకా ప్రొడక్షన్స్ షేర్ చేసింది.

నిజానికి ఈ వీడియోలు గతేడాది నవంబర్ కు చెందినవి. అప్పుడు జరిగిన షూటింగ్ వీడియోలను లైకా తాజాగా ఎక్స్ లో పోస్ట్ చేసింది. మొత్తంగా మూడు వీడియోలు ఉండగా.. అందులో తొలి వీడియోలో చాలా స్పీడుగా వెళ్తున్న కారులో అజిత్, ఆరవ్ లను చూడొచ్చు. ఆ కారు కాసేపటికే రోడ్డు నుంచి దిగి బోల్తా పడింది. అయితే అందులోనే చిక్కుకుపోయిన ఆ ఇద్దరూ తమను తామను నియంత్రించుకున్నారు.

ఆ తర్వాత మిగతా రెండు వీడియోల్లో ఈ హైస్పీడ్ కారు సీన్ ను డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించారు. కారు బోల్తా పడిన వెంటనే షూటింగ్ సిబ్బంది పరుగెత్తికెళ్లి వాళ్లు ఎలా ఉన్నారో చూశారు. ఈ వీడియోలను లైకా ప్రొడక్షన్స్ షేర్ చేస్తూ.. "ధైర్యానికి హద్దులేమీ ఉండవు. విదా ముయర్చి కోసం అజిత్ కుమార్ చేసిన ఈ సాహసోపేతమైన స్టంట్ సీక్వెన్స్ అతని డెడికేషన్ కు అద్దం పడుతుంది" అని చెప్పింది.

అజిత్ స్టంట్స్.. ఫ్యాన్స్ ఆందోళన

అయితే ఈ భయానక స్టంట్ వీడియోలు చూసి అజిత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అజిత్ అంకితభావాన్ని మెచ్చుకుంటూనే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. విదా ముయర్చి ఎలాగూ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మా కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకోవద్దు తలా అంటూ మరో అభిమాని కామెంట్ చేశారు.

విదా ముచర్చి మూవీలో అజిత్ తోపాటు అర్జున్ సర్జా, త్రిష, రెజీనా నటిస్తున్నారు. ఈ మూవీని మగిళ్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. వచ్చే ఏడాది జనవరిలో వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ మధ్యే అజర్‌బైజాన్ షెడ్యూల్ ను పూర్తి చేశారు. గతేడాది అక్టోబర్ లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.

నిజానికి ఈ విదా ముచర్చి మూవీని విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేయాల్సి ఉన్నా.. తర్వాత అతన్ని మార్చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.