Big Boss OTT 2 Sunny Leone: బిగ్‍బాస్‍ ఓటీటీలో సన్నీ లియోనీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే..-sunny leone to participate in salman khans big boss ott 2 show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sunny Leone To Participate In Salman Khans Big Boss Ott 2 Show

Big Boss OTT 2 Sunny Leone: బిగ్‍బాస్‍ ఓటీటీలో సన్నీ లియోనీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 16, 2023 04:37 PM IST

Big Boss OTT 2 Sunny Leone: బిగ్ బాస్ ఓటీటీ 2 షోలో నటి సన్నీ లియోనీ కనిపించనుంది. ఈ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఉన్నాడు.

Big Boss OTT 2 Sunny Leone: బిగ్‍బాస్‍ ఓటీటీలో సన్నీ లియోనీ!
Big Boss OTT 2 Sunny Leone: బిగ్‍బాస్‍ ఓటీటీలో సన్నీ లియోనీ!

Big Boss OTT 2 Sunny Leone: బిస్ బాస్‍ను ఇష్టపడే వారి నిరీక్షణ ముగుస్తోంది. బిగ్‍బాస్ ఓటీటీ 2 హిందీ వచ్చేస్తోంది. జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూన్ 17వ తేదీ నుంచి ఈ బిగ్‍బాస్ ఓటీటీ 2 స్ట్రీమింగ్ మొదలుకానుంది. ఓటీటీలో వస్తుండడంతో 24 గంటల పాటు ఈ షో ప్రసారం కానుంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. యాంకర్‌గా వ్యవహరించనున్నాడు. అయితే, తాజాగా బిగ్ బాస్ ఓటీటీ 2 గురించి ఓ కీలకమైన విషయం బయటికి వచ్చింది. ఈ షోలో హాట్ యాక్టర్ సన్నీ లియోనీ కూడా పాల్గొంటోందని తెలుస్తోంది. వివరాలివే..

బిస్‍బాస్ ఓటీటీ 2 షోలో సన్నీ లియోనీ.. కంటెస్టెంట్‍గా కాకుండా గెస్ట్‌గా, ప్యానెలిస్ట్ ఉండనుందని తెలుస్తోంది. అయితే, సల్మాన్‍కు కో-హోస్ట్‌గా సన్నీ ఉంటుందని కూాడా వాదనలు వినిపిస్తున్నాయి. బిగ్‍బాస్ ఓటీటీ 2లో సన్నీ ఎలా పాల్గొంటుందనేది ఇప్పటి స్పష్టం కాకపోయినా.. కనిపించడం మాత్రం పక్కా అయింది.

బిగ్‍బాగ్ ఓటీటీ 2 షోలో పాల్గొంటున్నట్టు హింట్ కూడా ఇచ్చింది సన్నీ. “బిగ్‍బాస్ ఓటీటీలో పాల్గొంటుండడం నాకు మళ్లీ ఇంటికి వచ్చినట్టు అనిపిస్తోంది. బిగ్ బాస్ షోతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నా కెరీర్‌లో బిగ్ బస్ టర్నింగ్ పాయింట్‍గా ఉంది. నేను ఈ షోను ఎప్పటి నుంచో చూస్తున్నా. ఈ సీజన్ మరింత సన్నీగా ఉంటుంది” అని సన్నీ లియోనీ ఓ స్టేట్‍మెంట్ విడుదల చేసింది.

2011లో టీవీలో ప్రసారమైన బిగ్‍బాస్ 5 మెయిన్‍ షోలో సన్నీ లియోనీ పార్టిసిపెంట్‍గా పాల్గొంది. ఈ షోలో ఆమె ప్రదర్శించిన యాక్టింగ్, డ్యాన్స్, ఇతర టాలెంట్‍లు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. చాలా పాపులర్ అయింది. ఇప్పుడు బిగ్‍బాస్ 2 ఓటీటీలో ఆమె పాల్గొంటుండడం ఆమె అభిమానులకు సంతోషకరమైన విషయమే.

బిగ్‍బాస్ ఓటీటీ 2 షోలో పార్పిసిపెంట్లు ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. అవినాశ్ సచ్‍దేవ్, ఆకాంక్ష పూరి, జాద్ హదిద్, ఫలాక్ నాజ్ సహా మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై జూన్ 17న బిగ్‍బాగ్ ఓటీటీ షో స్ట్రీమింగ్ మొదలయ్యాక క్లారిటీ రానుంది. జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ షో 24 గంటలు స్ట్రీమ్ కానుంది. జూన్ 17వ తేదీ రాత్రి 9 గంటల నుంచి జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍పై ఓ షో స్ట్రీమ్ కానుంది.

WhatsApp channel