Telugu News  /  Entertainment  /  Sunny Leone Interview Going Viral Ahead Of Ginna Movie Release
సన్నీ లియోన్
సన్నీ లియోన్

Sunny Leone Interview: అలాంటి కథలంటే నాకు చాలా ఇష్టం: సన్నీ లియోన్

18 October 2022, 20:00 ISTHT Telugu Desk
18 October 2022, 20:00 IST

Sunny Leone Interview: సన్నీ లియోన్ ఫుల్‌ లెంత్‌ రోల్‌ పోషిస్తున్న తొలి టాలీవుడ్‌ మూవీ జిన్నా. ఈ సినిమా అక్టోబర్‌ 21న రిలీజ్‌ కానుండగా.. సన్నీ స్పెషల్‌ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్‌గా మారింది.

Sunny Leone Interview: సన్నీ లియోన్‌.. బాలీవుడ్‌లో ఫుల్‌ క్రేజ్‌ఉన్న హీరోయిన్‌. తెలుగులో కరెంటు తీగ, గరుడ వేగలాంటి సినిమాల్లో గెస్ట్‌ రోల్స్‌లో కనిపించింది. అయితే ఆమె ఇప్పుడు జిన్నా మూవీతో పూర్తిస్థాయి రోల్‌లో కనిపించబోతోంది. ఈ సినిమా వచ్చే శుక్రవారం (అక్టోబర్‌ 21) రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఆమె ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

జిన్నా మూవీ మంచు విష్ణు ఫ్యాన్స్‌లోనూ చాలా ఆసక్తి రేపుతోంది. కోన వెంకట్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ మూవీని ఇషాన్‌ సూర్య డైరెక్ట్‌ చేశాడు. మంచు విష్ణు, సన్నీ లియోన్‌తోపాటు పాయల్ రాజ్‌పుత్‌ కూడా ఈ మూవీలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా సన్నీ లియోన్‌ ప్రత్యేకంగా ఇంటర్వ్యు ఇచ్చింది. అందులోని విశేషాలు చూడండి.

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కథలు ఇష్టం: సన్నీ

<p>జిన్నాలో పూర్తిస్థాయి పాత్రలో నటించిన సన్నీ లియోన్</p>
జిన్నాలో పూర్తిస్థాయి పాత్రలో నటించిన సన్నీ లియోన్

"జిన్నా నేను తెలుగులో పూర్తిస్థాయిలో నటిస్తున్న మూవీ. లాక్‌డౌన్‌ టైమ్‌లో ఈ కథ విన్నాను. మోహన్‌బాబు ప్రొడక్షన్‌ హౌజ్‌లో మంచు విష్ణుతో నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ. ఇలాంటి కథలు నాకు చాలా ఇష్టం. ఇందులో నేను చెవిటి, మూగ అయిన రేణుక పాత్రలో నటించాను. ఈ మూవీలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్‌ ఉంటాయి. ఈ మూవీ షూట్‌ సందర్భంగా విష్ణు, నేను ఫన్నీ, ప్రాంక్‌ వీడియోలు చేశాం. వాటికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక సోషల్‌ మీడియాలో నెగటివ్‌ కామెంట్స్‌ను పట్టించుకోను. పాజిటివ్‌ కామెంట్స్‌ మాత్రమే తీసుకొని ముందుకు వెళ్తాను" అని చెప్పింది.

విష్ణు చాలా ఎనర్జటిక్‌

<p>హిందీతోపాటు దక్షిణాది భాషల సినిమాలతోనూ బిజీ అవుతున్న సన్నీ</p>
హిందీతోపాటు దక్షిణాది భాషల సినిమాలతోనూ బిజీ అవుతున్న సన్నీ

ఇక మంచు విష్ణుపై కూడా ఆమె ప్రశంసలు కురిపించింది. అతడు చాలా ఎనర్జటిక్‌ నటుడు అని, మంచు ఫ్యామిలీ తనకు మంచి ఆతిథ్యం ఇచ్చినట్లు కూడా సన్నీ లియోన్‌ చెప్పింది. తనకు హైదరాబాద్‌ బిర్యానీ అంటే చాలా ఇష్టమని కూడా ఆమె చెప్పడం విశేషం. తెలుగుతోపాటు సౌత్‌ సినిమా ఇండస్ట్రీతో తనకు క్లోజ్‌నెస్‌ పెరిగిందని సన్నీ తెలిపింది.

"తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ సినిమాలు కూడా చేస్తున్నాను. ప్రస్తుతం నా చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ భిన్నమైన ప్రాజెక్ట్‌లే. ఇక అనురాగ్‌ కశ్యప్‌తో డీగ్లామరస్‌ రోల్‌లోనూ నటిస్తున్నాను. మంచి కాన్సెప్ట్‌ ఉన్న జిన్నా మూవీ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది" అని సన్నీ చెప్పింది.