Remuneration: భారీ బ్లాక్‍బస్టర్.. తర్వాతి చిత్రానికి రెమ్యూనరేషన్ ఆరు రెట్లు ఎక్కువగా తీసుకున్న స్టార్ హీరో!-sunny deol remuneration for jaat is 6 times more he was took for gadar 2 report ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Remuneration: భారీ బ్లాక్‍బస్టర్.. తర్వాతి చిత్రానికి రెమ్యూనరేషన్ ఆరు రెట్లు ఎక్కువగా తీసుకున్న స్టార్ హీరో!

Remuneration: భారీ బ్లాక్‍బస్టర్.. తర్వాతి చిత్రానికి రెమ్యూనరేషన్ ఆరు రెట్లు ఎక్కువగా తీసుకున్న స్టార్ హీరో!

Sunny Deol Remuneration: జాట్ చిత్రం కోసం బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ రెమ్యూనరేషన్ భారీగా పెంచేశారట. గదర్ 2 చిత్రంతో పోలిస్తే ఏకంగా ఆరు రెట్లు అధికంగా తీసుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇవే..

Remuneration: భారీ బ్లాక్‍బస్టర్.. తర్వాతి చిత్రానికి రెమ్యూనరేషన్ ఆరు రెట్లు ఎక్కువగా తీసుకున్న స్టార్ హీరో!

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ గదర్ 2 సినిమా అంచనాలకు మించి బ్లాక్‍బస్టర్ సాధించింది. 2023 ఆగస్టులో విడుదలైన ఈ సీక్వెల్ పీరియడ్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. ఏకంగా రూ.600కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇంతటి సూపర్ హిట్ తర్వాత తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘జాట్’ సినిమా చేశారు సన్నీ. ఈ చిత్రం ఈ వారమే ఏప్రిల్ 10వ తేదీన విడుదలైంది. కాగా, జాట్ మూవీకి సన్నీ డియోల్ తీసుకున్న రెమ్యునరేషన్ వివరాలు బయటికి వచ్చాయి.

ఆరు రెట్లు అధికం!

జాట్ చిత్రం కోసం సన్నీ డియోల్ రూ.50కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. గదర్ 2 చిత్రానికి ఆయన దాదాపు రూ.8 కోట్లు పుచ్చుకున్నారు. ఈ మూవీ భారీ బ్లాక్‍బస్టర్ అయింది. దీంతో ఆ చిత్రంతో పోలిస్తే పోలిస్తే జాట్ మూవీకి సుమారు ఆరు రెట్లు ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకున్నారు సన్నీ డియోల్.

జాట్ సినిమాలో కీలకపాత్ర పోషించిన రణ్‍దీప్ హుడా.. రూ.5కోట్ల నుంచి రూ.7కోట్ల మధ్య అందుకున్నారని రిపోర్టుల ద్వారా బయటికి వచ్చింది. వినీత్ కుమార్ సింగ్ రూ.కోటి రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఈ చిత్రం కోసం రెజీనా కసాండ్రా సుమారు రూ.80లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.

తెలుగు దర్శకుడు, నిర్మాతలు

జాట్ మూవీని పక్కా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు గోపీచంద్ మలినేని. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెలుగు నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. జీ స్టూడియోస్ కూడా భాగస్వామ్యమైంది. ఈ బాలీవుడ్ మూవీ హిందీలోనే థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతానికి తెలుగు డబ్బింగ్‍లో రాలేదు.

జాట్ 2 రోజుల కలెక్షన్లు

జాట్ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.22 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. అనుకున్న రేంజ్‍లో ఈ చిత్రానికి ఓపెనింగ్ దక్కలేదు. ఈ మూవీకి మిక్స్డ్ టాకే వచ్చింది. అయితే, యాక్షన్ బాగుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పుంజుకుంటుందేమో చూడాలి.

జాట్ మూవీకి తమన్ సంగీతం అందించారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. ఈ చిత్రానికి ఎక్కువ శాతం తెలుగు టెక్నిషియన్లే పని చేశారు. తెలుగు కథనే బాలీవుడ్‍ ఫ్లేవర్‌తో మలినేని తెరకెక్కించారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం