Gadar 2 Telugu Tv Premiere: తెలుగులో టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైన ఆరు వందల కోట్ల బాలీవుడ్ మూవీ - డేట్ ఫిక్స్
Gadar 2 Telugu Tv Premiere: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ గదర్ 2 తెలుగు వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 18న ఆదివారం జీ తెలుగులో ఈ మూవీ టెలికాస్ట్ కాబోతోంది.
Gadar 2 Telugu Tv Premiere: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ గదర్ 2 తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టీవీ ప్రీమియర్ ద్వారా ఈ హిందీ మూవీ బుల్లితెర టాలీవుడ్ ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేసేందుకు సిద్ధమైంది. గదర్ 2 తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 18న ఆదివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి జీతెలుగులో ఈ మూవీ టెలికాస్ట్ కానుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్‌ను జీ తెలుగు అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది.
టాప్‌పైవ్ మూవీస్‌లో ఒకటిగా...
సన్నీడియోల్ హీరోగా నటించిన గదర్ 2 మూవీ థియేటర్లలో 691 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. గత ఏడాది ఇండియా వైడ్‌గా అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ ఫైవ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. బాలీవుడ్ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ దక్కించుకున్న ఎనిమిదో మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. 2001లోరిలీజైన గదర్ ఏక్ ప్రేమ్‌కథకు సీక్వెల్‌గా గదర్ 2 తెరకెక్కింది. ఫస్ట్ పార్ట్‌లోనూ సన్నీడియోల్, అమీషాపటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. సీక్వెల్‌లోనూ వీరిద్దరు జంటగా మెరిశారు.గదర్ 2 సినిమాలో సన్నీడియోల్‌తో పాటు ఉత్కర్ష్‌శర్మ, సిమ్రత్ కౌర్ యువజంటగా కనిపించారు.
పదింతల లాభాలు...
గదర్ 2 మూవీ కేవలం అరవై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. నిర్మాతలకు ఈ మూవీ పదింతల లాభాలను తెచ్చిపెట్టింది. తొలిరోజే ఈ సినిమా 40 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఫస్ట్ వీకెండ్‌లో 134 కోట్ల కలెక్షన్స్‌తో లాభాల్లోకి అడుగుపెట్టింది. తొలుత ఈ సీక్వెల్‌లో నటించడానికి సన్నీడియోల్ అంగీకరించనట్లు దర్శకుడు అనిల్ శర్మ తెలిపాడు. కథ నచ్చడంతో పాటు సీక్వెల్ పట్ల ఆడియెన్స్‌లో ఉన్న క్యూరియాసిటీ గమించిన తారా సింగ్ పాత్రను మరోసారి చేయడానికి సన్నీడియోల్ అంగీకరించినట్లు గదర్ 2 ప్రమోషన్స్‌లో అనిల్ శర్మ తెలిపాడు. గదర్ 2 కు కొనసాగింపుగా మూడో పార్ట్‌ను కూడా తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నట్లు అనిల్ శర్మ చెప్పాడు.
గదర్ 2 కథ ఇదే...
1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఇండియన్ ఆర్మీకి సహాయం చేస్తాడు తారా సింగ్ (సన్నీడియోల్). ఈ యుద్ధంలో అనుకోకుండా పాకిస్థాన్ సైన్యానికి బంధీగా చిక్కుతాడు తారా సింగ్. పాకిస్థాన్ జైలులో ఉన్న తారా సింగ్‌ను ఎలాగైనా ఇండియా తీసుకురావాలని అతడి కొడుకు చరణ్‌జీత్‌సింగ్ (ఉత్కర్ష్ శర్మ) ఫిక్సవుతాడు. దొంగ పాస్‌పోర్ట్‌తో పాకిస్థాన్ వెళతాడు. తండ్రిని చరణ్‌జీత్ జైలు నుంచి విడిపించాడా? పాకిస్థాన్‌లో తారాసింగ్, చరణ్‌జీత్ సింగ్‌లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నదే ఈ సినిమా కథ. గదర్ 2 మూవీలో సన్నీడియోల్ యాక్టింగ్‌తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను
ఆకట్టుకున్నాయి. గదర్ 2 మూవీకి డైరెక్టర్ అనిల్ శర్మ ఓ నిర్మాతగా వ్యవహరించాడు. ఇందులో హీరోగా నటించిన ఉత్కర్ష్ శర్మ అతడి కొడుకే. గదర్ 2 మూవీ హిందీ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5 దక్కించుకున్నది. తెలుగు వెర్షన్ మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో తెలుగు వెర్షన్ ఓటీటీ ఆడియెన్స్‌కు అందుబాటులో ఉంది.