Gadar 2 Collection: గ‌ద‌ర్ 2 క‌లెక్ష‌న్స్ - ప్ర‌భాస్ రేర్ బాలీవుడ్ రికార్డ్ బ‌ద్ద‌లు-sunny deol gadar 2 breaks prabhas baahubali record highest collected movie in 2nd weekend in bollywood history ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gadar 2 Collection: గ‌ద‌ర్ 2 క‌లెక్ష‌న్స్ - ప్ర‌భాస్ రేర్ బాలీవుడ్ రికార్డ్ బ‌ద్ద‌లు

Gadar 2 Collection: గ‌ద‌ర్ 2 క‌లెక్ష‌న్స్ - ప్ర‌భాస్ రేర్ బాలీవుడ్ రికార్డ్ బ‌ద్ద‌లు

HT Telugu Desk HT Telugu

Gadar 2 Collection: బాలీవుడ్ హిస్ట‌రీలో సెకండ్ వీకెండ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా గ‌ద‌ర్ 2 రికార్డును క్రియేట్ చేసింది. సెకండ్ వీకెండ్‌లో ఈ మూవీకి వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే...

స‌న్నీడియోల్

Gadar 2 Collection: గ‌ద‌ర్ 2 మూవీ బాలీవుడ్‌లో బాక్సాఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతూ దుమ్మురేపుతోంది. స‌న్నీడియోల్ హీరోగా నటించిన ఈ మూవీ రెండో వారంలో అద్భుత‌మైన వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. బాలీవుడ్ చ‌రిత్ర‌లో సెకండ్ వీకెండ్ లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన బాలీవుడ్‌ సినిమాగా గ‌ద‌ర్ 2 నిలిచింది.

సెకండ్ వీకెండ్‌లో శుక్ర‌వారం నుంచి ఆదివారం వ‌ర‌కు మూడు రోజుల్లోనే ఈ మూవీ 90 కోట్ల 47 ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇన్నాళ్లు ఈ రికార్డ్ టాలీవుడ్ హీరో ప్ర‌భాస్ పేరిట‌ ఉంది. ప్ర‌భాస్ బాహుబ‌లి మూవీ బాలీవుడ్‌లో సెకండ్ వీకెండ్‌లోనూ 80.75 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి చ‌రిత్ర‌ను సృష్టించింది.

బాహుబ‌లి కంటే ప‌ది కోట్ల క‌లెక్ష‌న్స్ ఎక్కువ‌గా రాబ‌ట్టిన గ‌ద‌ర్ 2 ప్ర‌భాస్ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. సెకండ్ వీకెండ్ హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో ఆమిర్ ఖాన్ దంగ‌ల్ (73.70 కోట్లు), నాలుగో స్థానంలో షారుఖ్ ఖాన్ ప‌ఠాన్ (63.50 కోట్లు) ఉన్నాయి. ఐదో స్థానంలో సంజూ (62.97 కోట్లు) ఉంది.

ఆదివారం 41 కోట్లు...

ఆదివారం రోజు (ఆగ‌స్ట్ 20న‌) గ‌ద‌ర్ 2 మూవీ 41 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది సంచ‌ల‌నం సృష్టించింది. ఆగ‌స్ట్ 11న రిలీజైన ఈ మూవీ ప‌ది రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా 375 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. 2001లో రిలీజైన గ‌ద‌ర్ ఏక్ ప్రేమ్ క‌థ‌కు సీక్వెల్‌గా గ‌ద‌ర్ 2 తెర‌కెక్కింది.

ఈ సినిమాలో స‌న్నీడియోల్‌తో పాటు ఉత్క‌ర్ష్ శ‌ర్మ హీరోలుగా న‌టించారు. అమీషా ప‌టేల్‌, సిమ్ర‌త్ కౌర్ హీరోయిన్లుగా న‌టించారు. గ‌ద‌ర్ 2 కు అనిల్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ సినిమాను నిర్మించాడు. దాదాపు ఎన‌భై కోట్ల బ‌డ్జెట్‌తో ఈ మూవీ రూపొందింది.