Katha Venuka Katha OTT: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న సునీల్ తెలుగు స‌స్పెన్స్‌ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-sunil katha starrer katha venuka katha movie to streaming on etv win ott from march 28th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sunil Katha Starrer Katha Venuka Katha Movie To Streaming On Etv Win Ott From March 28th

Katha Venuka Katha OTT: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న సునీల్ తెలుగు స‌స్పెన్స్‌ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Mar 26, 2024 11:33 AM IST

Katha Venuka Katha OTT Release: సునీల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా కీల‌క పాత్ర‌లో న‌టించిన తెలుగు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ క‌థ వెనుక క‌థ ఓటీటీలోకి రాబోతోంది. మార్చి 28 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

క‌థ వెనుక క‌థ ఓటీటీ
క‌థ వెనుక క‌థ ఓటీటీ

Katha Venuka Katha OTT Release: విశ్వాంత్ దుద్దుంపూడి, సునీల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ క‌థ వెనుక క‌థ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. మార్చి 28 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. క‌థ వెనుక క‌థ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఈటీవీ విన్ ఓటీటీ ఆఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది.

డైరెక్ట‌ర్ వ‌ర్సెస్ పోలీస్ ఆఫీస‌ర్‌..

క‌థ వెనుక క‌థ సినిమాకు కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో సినిమా డైరెక్ట‌ర్ కావాల‌ని క‌ల‌లు క‌నే యువ‌కుడిగా విశ్వాంత్ న‌టించాడు. సునీల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించాడు. డైరెక్ట‌ర్ కావాల‌నే ప్ర‌య‌త్నంలో ఓ యువ‌కుడు (విశ్వాంత్‌) సిటీలో అమ్మాయిలు క‌నిపించ‌క‌పోవ‌టంపై ఓ క‌థ‌ను రెడీ చేసుకుంటాడు. అత‌డి క‌థ‌లో ఉన్న‌ట్లుగానే నిజంగానే సిటీలో అమ్మాయిలు క‌నిపించ‌కుండా పోతుంటారు.

ఆ మిస్స‌యిన అమ్మాయిలంద‌రూ హ‌త్య‌ల‌కు గుర‌వుతుంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయ‌టానికి ఓ పోలీస్ ఆఫీస‌ర్ (సునీల్) వ‌స్తాడు. ఈ మ‌ర్డ‌ర్స్ వెనుక సినిమా డైరెక్ట‌ర్ కావాల‌నే యువ‌కుడు ఉన్నాడ‌ని అనుమానించిన పోలీస్ ఆఫీస‌ర్ అత‌డిని అరెస్ట్ చేస్తాడు? అస‌లు అమ్మాయిలు సిటీలో క‌నిపించ‌కుండా పోవ‌టానికి కార‌ణం ఎవ‌రు? ఆ క్రైమ్ వెనుకున్న గ్యాంగ్ ఏది? వారిని ఆ డైరెక్ట‌ర్‌తో క‌లిసి పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ప‌ట్టుకున్నాడ‌న్న‌దే క‌థ వెనుక క‌థ మూవీ క‌థ‌.

ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి...

క‌థ వెనుక క‌థ మూవీ గ‌త ఏడాది మే 12న థియేట‌ర్ల‌లో రిలీజైంది. దాదాపు ఏడాది త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. క‌థ వెనుక క‌థ సినిమాలో శ్రీజీత ఘోష్ హీరోయిన్‌గా న‌టించింది. శుభ‌శ్రీ, జ‌య‌ప్ర‌కాష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. చిన్న సినిమాగా రిలీజైన క‌థ వెనుక క‌థ ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

కేరింత‌తో అరంగేట్రం...

కేరింత సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు విశ్వాంత్ దుద్దుంపూడి, దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా హీరోగా అత‌డికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత మ‌న‌మంతా, జెర్సీ సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించాడు.

క్రేజీ క్రేజీ ఫీలింగ్‌, తోలు బొమ్మ‌లాట‌, ఓ పిట్ట‌క‌థతో పాటు తెలుగులో ప‌లు చిన్న సినిమాల్లో హీరోగా న‌టించాడు విశ్వాంత్‌. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా తెలుగులో వ‌రుస‌గా అవ‌కాశాల‌ను అందుకుంటున్నాడు విశ్వాంత్‌. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న గేమ్ ఛేంజ‌ర్‌లో విశ్వాంత్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేయ‌బోతున్నాడు.

త‌మిళంలో బిజీ...

గ‌త ఏడాది సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన సునీల్ మ‌ళ్లీ బిజీగా మారాడు. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళంలో సునీల్‌కు ఆఫ‌ర్లు క్యూ క‌డుతోన్నాయి.

త‌మిళంలో ర‌జ‌నీకాంత్ జైల‌ర్, కార్తి జ‌పాన్‌, విశాల్ మార్క్ ఆంటోనీ సినిమాల్లో సునీల్ డిఫ‌రెంట్ రోల్స్ చేశాడు. తెలుగులో గ‌త ఏడాది ప‌ది సినిమాలు చేశాడు. ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పుష్ప 2తో పాటు గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చిందితో పాటు తెలుగులో మ‌రికొన్ని సినిమాలు చేస్తున్నాడు సునీల్‌.

WhatsApp channel

టాపిక్