Ooru Peru Bhairavakona Day 2 Collections: ఊరు పేరు భైరవకోన సినిమా జోరు.. ఫస్ట్ డే కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు
Ooru Peru Bhairavakona Day 2 Collections: ఊరు పేరు భైరవకోన సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రం తొలి రోజు కంటే సెకండ్ ఎక్కువ కలెక్షన్లను దక్కించుకొని జోరు చూపింది.
Ooru Peru Bhairavakona Movie Collections: ఊరు పేరు భైరవకోన సినిమా బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ మంచి అంచనాల మధ్య ఫిబ్రవరి 16న థియేటర్లలో రిలీజైంది. ట్రైలర్‌తోనే క్యూరియాసిటీ కలిగించిన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ దక్కింది. రెండో రోజు కూడా ఊరు పేరు భైరవకోన మూవీ సత్తాచాటింది.
రెండు రోజుల్లో ఎంత?
ఊరు పేరు భైరవకోన సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.13.10 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. మ్యాజికల్ ఎంటర్‌టైనర్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది ఏకే ఎంటర్‍టైన్మెంట్.
తొలి రోజు కంటే ఎక్కువ!
ఊరు పేరు భైరవకోన చిత్రానికి తొలి రోజు రూ.6.03 కోట్ల వసూళ్లు వచ్చాయి. రెండో రోజైన శనివారం ఈ చిత్రం సుమారు రూ.7 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దీంతో తొలి రోజు కంటే సెకండ్ డే ఈ మూవీకి ఎక్కువ వసూళ్లు వచ్చాయి. బుకింగ్ ట్రెండ్‍లను బట్టి చూస్తే ఆదివారమైన మూడో రోజు కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఊరు పేరు భైరవకోన చిత్రానికి రివ్యూలు మిశ్రమంగా వచ్చినా.. టాక్ మాత్రం ఎక్కువగా పాజిటివ్‍గా ఉంది. ఈ చిత్రంలోని ఫ్యాంటసీ, హారర్ ఎలిమెంట్లు, ట్విస్టుల పట్ల ప్రేక్షకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఈ చిత్రానికి పెద్దగా పోటీ లేదు. ఇది కూడా సందీప్ కిషన్ మూవీకి బాగా కలిసి వస్తోంది.
ఊరు పేరు భైరవకోన చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించగా.. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. బసవ లింగం పాత్రను ఈ చిత్రంలో సందీప్ కిషన్ చేయగా.. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కీలకపాత్రలు పోషించారు. వెన్నెల కిశోర్, వైవా హర్ష కామెడీ కూడా ఈ చిత్రంలో పండింది. పి.రవిశంకర్ కీరోల్ చేశారు.
ఊరు పేరు భైరవకోన చిత్రానికి సందీప్ కిషన్‍తో పాటు మూవీ యూనిట్ జోరుగా ప్రమోషన్లను చేసింది. వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు సందీప్, వర్ష. థియేటర్లకు సైతం వెళుతూ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశారు. రిలీజ్‍కు ముందే ప్రీమియర్లను ప్రదర్శించడం కూడా ఈ మూవీకి ప్లస్ అయింది.
ప్రతీ ఏడాది కార్తీక మాసం రాత్రి వేళ మాత్రమే తలుపులు తెరుచుకునే రహస్యమైన ఊరుగా భైరవకోన ఉంటుంది. ఆ ప్రాంతంలోకి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రావడం అసాధ్యంగా ఉంటుంది. అయితే, ఓ దొంగతనం చేసి తప్పించుకునే క్రమంలో బసవ లింగం (సందీప్ కిషన్), జాన్ (వైవా హర్ష), గీత (కావ్య).. భైరవకోనలోకి వెళతారు. మరి వారు బయటికి వచ్చారా? భైరవకోన రహస్యమేంటి? గరుడ పురాణంతో సంబంధం ఏంటి? అనే అంశాలు ఊరు పేరు భైరవకోన చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఫ్యాంటసీ, సస్పెన్స్, హారర్‌తో పాటు ఈ చిత్రంలో కామెడీ కూడా ఉండడం ప్లస్ పాయింట్‍గా ఉంది. అయితే, వీఎఫ్‍ఎక్స్ కాస్త మెరుగ్గా ఉండాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టాపిక్