Comedy OTT: సందీప్‌కిషన్, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటించిన మజాకా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా కన్ఫామ్ అయ్యింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ మార్చి 28న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మజాకా ఓటీటీ రిలీజ్ డేట్‌ను వెల్లడించిన జీ5 ఓటీటీ ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది.
మజాకా మూవీలో రావురమేష్, అన్షు (మన్మథుడు ఫేమ్) కీలక పాత్రల్లో నటించారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. ప్రసన్నకుమార్ బెజవాడ కథను అందించాడు. గత ఏడాది ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ తొమ్మిది కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. లాజిక్‌లతో సంబంధం లేకుండా కామెడీని నమ్ముకొని తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
కృష్ణ(సందీప్‌కిషన్) తల్లి చిన్నతనంలోనే చనిపోతుంది. తండ్రి వెంకటరమణ మరో పెళ్లి చేసుకోకుండా కృష్ణను పెంచి పెద్ద చేస్తాడు. కృష్ణకు పెళ్లి చేయాలని వెంటక రమణ చేసిన ప్రయత్నాలేవి ఫలించవు. మీరా (రీతూ వర్మ) అనే అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు కృష్ణ. మరోవైపు మిడిల్ ఏజ్‌లో వెంకటరమణ యశోద (అన్షు) ను ఇష్టపడతాడు.
మీరాకు కృష్ణ...యశోదకు రమణ తమ ప్రేమను వ్యక్తం చేయాలని అనుకుంటారు. కానీ మీరా,యశోద ఒకే ఇంట్లో వారికి కనిపిస్తారు. వాళ్ల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? వెంకటరమణ, కృష్ణ తమ ప్రేమలో ఎలా విజయం సాధించారు? ఈ తండ్రీకొడుకులతో భార్గవ వర్మకు ఉన్న విరోధం ఏమిటి? అనే అంశాలను కామెడీతో ఈ మూవీలో చూపించాడు డైరెక్టర్. మజాకా మూవీకి లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించాడు. అనిల్ సుంకర, రాజేష్ దండా ఈ సినిమాను నిర్మించారు.
మజాకా తర్వాత దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతోన్న సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్నాడు. ఈ పాన్ ఇండియన్ మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.
సూపర్ సుబ్బు పేరుతో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేస్తోన్నాడు. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ వెబ్‌సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 3లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
సంబంధిత కథనం