Mazaka: యూట్యూబ్‌లో ప్రైవేట్ సాంగ్స్ నాకు చాలా నచ్చుతున్నాయి, అందుకే ఇలా.. మజాకా డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన కామెంట్స్-sundeep kishan mazaka movie director trinadha rao nakkina comments on youtube private albums and ramulamma song ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mazaka: యూట్యూబ్‌లో ప్రైవేట్ సాంగ్స్ నాకు చాలా నచ్చుతున్నాయి, అందుకే ఇలా.. మజాకా డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన కామెంట్స్

Mazaka: యూట్యూబ్‌లో ప్రైవేట్ సాంగ్స్ నాకు చాలా నచ్చుతున్నాయి, అందుకే ఇలా.. మజాకా డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Mazaka Director Trinadha Rao Nakkina On YouTube Private Songs: సందీప్ కిషన్, రీతు వర్మ జోడీగా తెరకెక్కిన మాస్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ మజాకా. ఈ సినిమాకు త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన యూట్యూబ్ ప్రైవేట్ సాంగ్స్‌పై కామెంట్స్ చేశారు.

యూట్యూబ్‌లో ప్రైవేట్ సాంగ్స్ నాకు చాలా నచ్చుతున్నాయి, అందుకే ఇలా.. మజాకా డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన కామెంట్స్

Mazaka Director Trinadha Rao Nakkina On YouTube Private Songs: యంగ్ హీరో సందీప్ కిషన్, రీతు వర్మ, రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మాస్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం మజాకా. ధమాకా డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు.

ఇవాళ మజాకా రిలీజ్

సందీప్ కిషన్ కెరీర్‌లో 30వ సినిమాగా వస్తోన్న మజాకా సినిమా ఇవాళ (ఫిబ్రవరి 26) మహా శివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 25) ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన. ఈ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పిన ఆయన యూట్యూబ్ ప్రైవేట్ సాంగ్స్‌పై కామెంట్స్ చేశారు.

మజాకా ఎలా ఉండబోతోంది?

-మజాకా వందశాతం హిట్ ఫిల్మ్. ఆ రేంజ్ ఏమిటనేది ఫస్ట్ షో పడ్డాక డిసైడ్ అవుతుంది. ఇప్పటివరకూ సినిమా చూసిన వారంతా సూపర్ ఉంది. హిట్ ఫిల్మ్ అన్నారు.

మీ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాకి పబ్లిసిటీ టైం సరిపోలేదనిపిస్తోంది?

-టైం తక్కువైన మాట నిజమే. నిర్మాతలు వాళ్ల బెస్ట్ ఎఫర్ట్ పెట్టారు. శివరాత్రికి రిలీజ్ చేయాలని అందరం డే అండ్ నైట్ కష్టపడ్డాం. శివరాత్రి ఈ సినిమాకి మంచి డేట్.

ఈ కథ ఎప్పుడు విన్నారు?

-'ధమాకా' సమయంలోనే ప్రసన్న కుమార్ ఈ కథ చెప్పారు. రావు రమేష్‌ని దృష్టిలో పెట్టుకొని చెప్పారు. హీరోగా ఎవరు చేస్తారని అడిగాను. ఈ కథ కొందరి దగ్గరరికి వెళ్లింది. ఫైనల్‌గా రావు రమేష్ గారి కాంబినేషన్‌లోనే వచ్చింది. నిజానికి ఈ కథని సందీప్ కిషన్ ఒప్పుకోవడం చాలా గ్రేట్.

ఈ కథకి బ్రోడాడీ స్ఫూర్తి ఉందా?

-లేదండీ. నేను ఆ సినిమా చూశాను. ఆ కథే వేరు ఇది వేరు.

మజాకా కథ ఏమిటి?

-సింగిల్ లైన్‌లో చెప్పాలంటే.. ఆడదిక్కులేని ఇద్దరు మగాళ్లు ఎప్పటికైన ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవాలనుకునే వారి తపనే ఈ కథ. దిని కోసం వాళ్లు పడే బాధలు, ప్రయత్నాలు ఫుల్ ఫన్ జోన్‌లో ఉంటాయి. చివరి ఇరవై నిముషాలు చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.

రాములమ్మ పాట సెలెక్షన్ మీదేనా?

-అవును. నాకు యూట్యూబ్‌లో ప్రైవేట్ ఆల్బమ్స్ (సాంగ్స్) చాలా నచ్చుతున్నాయి. చాలా చక్కగా చేస్తున్నారు. అలా జనాల్లోకి వెళ్లిన ఓ పాటని మళ్లీ మన స్టయిల్‌లో వినిపిస్తే బావుంటుందనే ఆలోచనతో ఆ పాటని చేశాం. నిజానికి అలా యూట్యూబ్‌లో హిట్ అయిన ఓ నాలుగు పాటలు ఒక సినిమాలో పెట్టాలనే ఆలోచన కూడా ఉంది. మంచి కమర్షియల్ కథ కుదిరితే అలా చేయొచ్చు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం