Mazaka Censor Review: మజాకా సెన్సార్ రివ్యూ.. సందీప్ కిషన్ మూవీపై సెన్సార్ సభ్యులు ఏం చెప్పారంటే?-sundeep kishan mazaka completes censor works and received ua certificate from board members review on mazaka movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mazaka Censor Review: మజాకా సెన్సార్ రివ్యూ.. సందీప్ కిషన్ మూవీపై సెన్సార్ సభ్యులు ఏం చెప్పారంటే?

Mazaka Censor Review: మజాకా సెన్సార్ రివ్యూ.. సందీప్ కిషన్ మూవీపై సెన్సార్ సభ్యులు ఏం చెప్పారంటే?

Sanjiv Kumar HT Telugu
Published Feb 19, 2025 11:30 AM IST

Sundeep Kishan Mazaka Movie Censor Review And Report: యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ మజాకాకు సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేస్తూ మజాకాపై రివ్యూ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. ఆ వివరాల్లోకి వెళితే..!

మజాకా సెన్సార్ రివ్యూ.. సందీప్ కిషన్ మూవీపై సెన్సార్ సభ్యులు ఏం చెప్పారంటే?
మజాకా సెన్సార్ రివ్యూ.. సందీప్ కిషన్ మూవీపై సెన్సార్ సభ్యులు ఏం చెప్పారంటే?

Censor Report And Review On Sundeep Kishan Mazaka Movie: పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ కెరీర్‌లో 30వ సినిమాగా వస్తోన్న సినిమా 'మజాకా'. దీంతో ఈ సినిమా హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. రవితేజ ధమాకా డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన మజాకా మూవీ టీజర్, సాంగ్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

సందీప్ కిషన్‌కు జోడీగా

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్‌ల కొలాబరేషన్‌లో మజాకా సినిమాను రాజేష్ దండా నిర్మించారు. సహ నిర్మాతగా బాలాజీ గుత్తా వ్యవహరించారు. ఇక ఈ మూవీలో సందీప్ కిషన్‌కు జోడీగా రీతు వర్మ హీరోయిన్‌గా నటించింది. అంతేకాకుండా మన్మథుడు హీరోయిన్ అన్షు, సీనియర్ నటుడు రావు రమేష్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.

సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్

అయితే, తాజాగా 'మజాకా' సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మజాకా సినిమాకి యూ /ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అంతేకాకుండా మూవీపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సెన్సార్ బోర్డ్ మెంబర్స్. మజాకా మూవీలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉందని రివ్యూ ఇచ్చినట్లు మేకర్స్ తెలిపారు.

వినోదం బాగుందని

మజాకా సినిమాలో హెల్తీ కామెడీ, వినోదం చాలా బాగుందని సెన్సార్ సభ్యులు మూవీ టీమ్‌కి వారి రెస్పాన్స్‌ని తెలియజేశారు. మజాకాపై సెన్సార్ సభ్యుల రివ్యూ పాజిటివ్‌గా ఉండటంతో సినిమా హిట్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మేకర్స్. అలాగే, మజాకా సినిమా నుంచి 'పగిలి' సాంగ్‌ని రిలీజ్ చేశారు. లియోన్ జేమ్స్ ఈ పాటని మాస్ డ్యాన్స్ నెంబర్‌గా కంపోజ్ చేశారు.

మాస్ డ్యాన్స్ మూమెంట్స్

మహాలింగం, సాహితీ చాగంటి, ప్రభ సింగర్స్ పాడిన ఈ సాంగ్‌కు కాసర్ల శ్యామ్, ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన లిరిక్స్ మాస్‌ని మరింత ఎలివేట్ చేశాయి. ఈ సాంగ్‌లో సందీప్ కిషన్ ఎనర్జిటిక్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపొయాయి. సందీప్ కిషన్, రీతు వర్మ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది.

కలర్‌ఫుల్‌గా విజువల్స్

మ్యాసీవ్ అండ్ వైబ్రెంట్ సెట్స్‌లో చిత్రీకరించిన ఈ సాంగ్‌లో విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ గ్రేస్ ఫుల్‌గా ఉంది. ఈ పాట థియేటర్స్‌లో మాస్‌ని మెస్మరైజ్ చేయడం ఖాయం అని మేకర్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే రిలీజైన మజాకా టీజర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్మెంట్‌ని అందించి సినిమాపై అంచనాలని పెంచింది.

మహా శివరాత్రికి రిలీజ్

ఫస్ట్ సింగిల్ బ్యాచులర్స్ ఆంథమ్, సెకండ్ సింగిల్ బేబీ మా చార్ట్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఇక త్రినాధ రావు నక్కినతో సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులలో కొలబారేట్ అయిన రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, మజాకాకు కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్స్ రాస్తున్నారు. ఈ చిత్రానికి నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. పృధ్వీ స్టంట్స్‌ను పర్యవేక్షించారు. ఇక మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల అంటే ఫిబ్రవరి 26న మజాకా సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం