Maayavan OTT: 2 ఓటీటీల్లో తమిళ బ్లాక్ బస్టర్ క్రైమ్ థ్రిల్లర్.. ఏడేళ్లకు తెలుగులో ప్రాజెక్ట్ జెడ్ రిలీజ్
Maayavan OTT Streaming: యంగ్ హీరో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి నటించి క్రైమ్ థ్రిల్లర్ మూవీ మాయావన్. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో ప్రాజెక్ట్ జెడ్ టైటిల్‌తో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ బ్లాక్ బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ ఆసక్తిగా మారింది.
Project Z Maayavan OTT: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ మాయావన్. ఈ సినిమాకు తమిళంలో పాపులర్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు తెరకెక్కించే సీవీ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించింది. ఇక పాపులర్ హిందీ యాక్టర్ జాకీ ష్రాఫ్ మరో ప్రధాన పాత్ర పోషించారు. 2017లో తమిళంలో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా యావరేజ్‌గా నిలిచిన క్రిటిక్స్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్‌గా పేరు తెచ్చుకుంది.
ఆడియెన్స్ ఆశ్చర్యం
సరికొత్త క్రైమ్ ఎలిమెంట్స్‌తో మాయావన్ సినిమా మంచి హిట్ సాధించింది. అయితే, 2017లో విడుదలైన ఈ తమిళ సినిమా ఇప్పుడు తెలుగులో రానుంది. ఈ సినిమాను ప్రాజెక్ట్ జెడ్ టైటిల్‌తో ఏప్రిల్ 6న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ఈ విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తమిళంలో రిలీజైన ఏడు సంవత్సరాలకు తెలుగులో ఇప్పుడు విడుదల చేయడం ఏంటీ అని సినీ ఆడియెన్స్ ఆశ్చర్యపోతున్నారు.
రెండు ఓటీటీల్లో
2017లో బెస్ట్ థ్రిల్లర్‌గా పేరు తెచ్చుకున్న ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రానుంది. ఈ నేపథ్యంలో తెలుగులో విడుదల కానున్న ప్రాజెక్ట్ జెడ్/మాయావన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఆసక్తి కలిగిస్తోంది. ఎప్పుడో థియేటర్లలో విడుదలైన ఈ మాయావన్ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, వీటిలో ఈ సినిమా హిందీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ వెర్షన్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు తెలుగులో ప్రాజెక్ట్ జెడ్‌తో ఈ సినిమా రానుంది. కాబట్టి, త్వరలోనే తెలుగు వెర్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది.
ఓటీటీ కంటెంట్‌తో
ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా వస్తోంది. అందుకే మాయావన్ డిజిటల్ స్ట్రీమింగ్‌పై ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ సీక్వెల్‌లో కూడా సందీప్ కిషన్ హీరోగా చేస్తుండగా.. సీవీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సీక్వెల్‌కు ఏం టైటిల్ పెడతారన్నది క్లారిటీ లేదు. ఇక ఈ సీక్వెల్ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆకాంక్ష రంజన్ కుమార్ నటించనుంది. ఈ బ్యూటిఫుల్ ఎక్కువగా ఓటీటీ కంటెంట్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.
వెండితెరపై ఎంట్రీ
ధర్మ ప్రొడక్షన్స్ మొదటి ఓటీటీ చిత్రం గిల్టీతో తన నటనను ప్రారంభించిన ఆకాంక్ష రంజన్ కుమార్ ఆ తర్వాత విమర్శకుల ప్రశంసలు పొందిన అంథాలజీ సిరీస్ రే, మోనికా ఓ మై డార్లింగ్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సీక్వెల్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనుంది. అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు, సాహో ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్ కనిపించనున్నాడు. సందీప్ కిషన్, నీల్ ఇద్దరూ ఈ సినిమాలో యాక్షన్-ప్యాక్డ్ పాత్రలను పోషించడానికి కొత్తగా మేకోవర్ అవుతున్నారు. నీల్ తన పాత్ర కోసం తన డిక్షన్‌పై వర్క్ చేస్తున్నారు. అందుకోసం బరువు కూడా తగ్గుతారు.
ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్
కాగా ఈ సీక్వెల్ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రాన్ని అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తోంది. నిర్మాత రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. కిషోర్ గరికిపాటి (జికె) ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.