Sundeep Kishan-Regina Relation: రెజీనాతో నాది 12 ఏళ్ల బంధం.. రిలేషన్‌పై నోరు విప్పిన సందీప్
Sundeep Kishan-Regina Relation: సందీప్ కిషన్-రెజీనాకు సంబంధించిన ఫొటో ఒకటి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా మైఖేల్ మూవీ ప్రమోషన్ల సందర్భంగా ఆ ఫొటోపై సందీప్ స్పందించాడు. రెజీనాతో రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.
Sundeep Kishan-Regina Relation: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా మైఖేల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. పాన్ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినమాకు సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. సినిమాతో పాటు వ్యక్తిగత జీవితం పరంగానూ ఓపెన్‌గా ఉండే సందీప్ కిషన్‌పై ఇటీవల కాలంలో ఓ హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్ర.
ట్రెండింగ్ వార్తలు
రెజీనా బర్త్ డే సందర్భంగా సందీప్ కిషన్ ఓ రొమాంటిక్ ఫొటోను షేర్ చేశాడు. ఫ్రెండ్లీగానే లవ్యూ చెబుతూ పుట్టిన రోజు సుభాకాంక్షలు చెప్పాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని నెటిజన్లు రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో వీరిద్దరూ మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచారు. మైఖేల్ మూవీ ప్రమోషన్లలో భాగంగా సందీప్.. రెజీనాతో రిలేషన్ గురించి స్పందించాడు.
"మాది పన్నెండేళ్ల బంధం. ఇద్దరం కలిసి నాలుగు సినిమాల్లో నటించాం. అలాంటి ఫొటోలు మేము ఎన్నో సార్లు దిగాం. అందులో ఏముంది విశేషం. అయినా ఆ వార్తలు చెన్నై మీడియా రాసింది. వారికి ఈ అంశం కొత్త. కానీ తెలుగు మీడియా అలా రాయదు. ఎందుకంటే మా గురించి రాసి రాసి వాళ్లకి కూడా బోర్ కొట్టేసింది. మా గురించి వాళ్లకు తెలుసు. నాకు ఆమె మంచి ఫ్రెండ్. ముంబయిలో షూటింగ్ కాస్త ఆలస్యమైనా.. ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చినా.. అక్కడ మా సిస్టర్ ఇంట్లోనే ఉంటుంది. అంత్ క్లోజ్‌నెస్ మా మధ్యలో ఉంది." అంటూ సందీప్ కిషన్.. రెజీనాతో రిలేషన్ గురించి కుండబద్దలు కొట్టేశాడు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని ఈ రూమర్లకు చెక్ పెట్టేశాడు.
మైఖేల్ సినిమాతో మంచి హిట్ కొట్టాలని సందీప్ ప్రయత్నించాడు. కానీ ఈ సినిమాకు యావరేజ్ టాక్ మాత్రమే వస్తోంది. మౌత్ టాక్, రివ్యూలు కూడా మిక్స్‌డ్ టాక్‌నే ఇచ్చాయి. మైఖేల్ సినిమాలో సందీప్ సరసన దివ్యాంశ కౌషిక్ హీరోయిన్‌గా చేసింది. ఇందులో విజయ్ సేతుపతి, గౌతమ్ మేనన్, వరుణ్ సందేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు విభిన్న పాత్రల్లో కనిపించారు. కరణ్ సీ ప్రొడక్షన్ల్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై భరత్ చౌదరీ, పుష్కర్ రామ్ మోహన రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రంజిత్ జయకోడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చారు.
టాపిక్