Sundaram Master OTT Official: ఓటీటీలోకి సూపర్ హిట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Sundaram Master OTT Release Official: యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమాల్లో కమెడియన్‌గా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వైవా హర్ష హీరోగా చేసిన సినిమా సుందరం మాస్టర్. మంచి కామెడీ పండించిన ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్‌ను సదరు ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటించింది.
Sundaram Master OTT Streaming: యూట్యూబ్‌లో నటులుగా ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ నిరూపించుకున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. యూట్యూబ్ సిరీస్‌ల తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి వివిధ పాత్రలతో అలరిస్తుంటారు. అలాంటి వారిలో వైవా హర్ష (హర్ష చెముడు) ఒకరు. యూట్యూబ్‌లోషార్ట్ ఫిల్మ్స్‌తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హర్ష చెముడు సినిమాల్లో కమెడియన్‌గా, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
అలాంటి వైవా హర్ష హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా సుందరం మాస్టర్. ఈ సినిమాలో హీరోయిన్‌గా దివ్య శ్రీపాద నటించింది. ఈ మె కూడా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక సుందరం మాస్టర్ సినిమాకు కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీతోనే కల్యాణ్ సంతోష్ టాలీవుడ్‌కు డైరెక్టర్‌గా డెబ్యూ ఇచ్చారు. ఈ సినిమాను ఆర్‌టీ టీం వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్స్‌పై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు కలిసి నిర్మించారు.
సుందరం మాస్టర్ సినిమా ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైంది. సినిమా మొత్తం కామెడీ జోనర్‌లో ఉంటూనే మంచి సందేశం ఇచ్చారని రివ్యూలు వచ్చాయి. అలాగే మానవత్వం గురించి యూనిక్ కాన్సెప్ట్‌తో చెప్పారని పలువురు ప్రశంసించారు. అయితే, సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని మరికొందరు నెటిజన్స్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. కానీ, కామెడీ మాత్రం బాగుందని చెప్పారు. మంచి కాన్సెప్ట్‌తో కామెడీ జోనర్‌లో వచ్చిన సుందరం మాస్టర్ మూవీ ఓటీటీలోకి రానుంది.
సుందరం మాస్టర్ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ఆహా మంచి ధరకు సొంతం చేసుకుందని సమాచారం. అయితే, ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఇప్పటికీ అనేక రకాల వార్తలు వచ్చినప్పటికీ తాజాగా ఆహా చేసిన అధికారిక ప్రకటనతో అవన్ని రూమర్స్‌గా తేలిపోయాయి. సుందరం మాస్టర్ సినిమాను మార్చి 28 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా టీమ్ తాజాగా అధికారికంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
మాస్టర్ హోమ్ ట్యూషన్స్ చెప్పడానికి మన ఇంటికి వచ్చేస్తున్నాడు. రెడీగా ఉండండి. క్లాసిక్ బ్లాక్ బస్టర్ సుందరం మాస్టర్ మార్చి 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది అని ట్విట్టర్‌లో ఆహా టీమ్ రాసుకొచ్చింది. దీంతో మరో నాలుగు రోజుల్లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో వీక్షించని ప్రేక్షకులు సందరం మాస్టర్‌ను ఓటీటీలో ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఇదిలా ఉంటే వైవా షార్ట్ ఫిల్మ్‌తో హర్ష చెముడుకు మంచి పేరు వచ్చింది. దాంతో వైవా హర్ష అనే పేరు వచ్చింది. ఇక సుందరం మాస్టర్ సినిమా కథ విషయానికొస్తే.. ఒక మిరియాల మిట్ట అనే గూడెం ఉంటుంది. అది పాడేరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి ప్రజలు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా జీవిస్తూ, అంతా ఒకే కుటుంబంలా కలిసి మెలిసి ఉంటారు. ఎవరినీ రానివ్వని ఆ ఊరికి ఇంగ్లీష్ టీచర్ కావాలని ప్రభుత్వానికి లేఖ రాస్తారు.
అది తెలిసి సుందర్ రావు (వైవా హర్ష)ను ప్రభుత్వం నియమించి పంపిస్తుంది. మిరియాల మిట్టకు వెళ్లిన సుందర్ రావుకు ఎదురైన సంఘటనలు ఏంటీ? పడిన కష్టాలు ఏంటీ? ఎమ్మెల్యే చెప్పిన పని ఏంటీ? మిరియాల మిట్టలో ఉన్న విలువైనది ఏంటీ? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
టాపిక్