Mystery Thriller OTT: మరో ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ -క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ లెవల్
Mystery Thriller OTT: సుమంత్ సింగిల్ క్యారెక్టర్‌తో చేసిన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ అహం రీబూట్ ఇప్పటికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ సోమవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది.
Mystery Thriller OTT: సుమంత్ హీరోగా నటించిన అహం రీబూట్ మూవీ ఇటీవలే ఆహా ఓటీటీలో రిలీజైంది. తాజాగా ఈ మూవీ మరో ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సోమవారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ వరకు సుమంత్ మాత్రమే ఈ సినిమాలో కనిపిస్తాడు.సింగిల్ క్యారెక్టర్‌తో ప్రయోగాత్మకంగా దర్శకుడు ప్రశాంత్ సాంగర్ అట్లూరి అహం రీబూట్ మూవీని తెరకెక్కించాడు.
సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్...
సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అహం రీబూట్ మూవీ థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజైంది. ఇందులో రేడియో జాకీ పాత్రలో సుమంత్ నటించాడు. ఓ రేడియో షో నేపథ్యంలో ఒకే రూమ్‌లో కథ మొత్తం సాగుతుంది. కేవలం గంటన్నర నిడివితో డైరెక్టర్ అహం రీబూట్ మూవీని రూపొందించారు ఆర్జే సాయంతో ఓ కిడ్నాప్ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? ఈ కిడ్నాప్ వెనుక ఉన్న ట్విస్ట్ ఏమిటనే పాయింట్‌తో దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లోఉంటుంది.
ఆర్జే పశ్చాత్తాపం...
నిలయ్ (సుమంత్) ఓ రేడియో జాకీ. ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేరుతెచ్చుకోవాలని కలలు కంటాడు. ఓ యాక్సిడెంట్ అతడి జీవితాన్ని మార్చేస్తుంది. ఫుట్‌బాల్‌కు దూరం అవుతాడు. అదే యాక్సిడెంట్ లో నిలయ్ కారణంగా ఓ అమ్మాయి కూడా చనిపోతుంది. ఆ గిల్టీ ఫీలింగ్ నిలయ్‌ను ఎప్పుడూ వెంటాడుతుంటుంది.
ఆర్జేగా ఓ రేడియో షో చేస్తుంటాడు నిలయ్. నిలయ్ షోకు ఓ అమ్మాయి కాల్ చేస్తుంది. తనను ఎవరో కిడ్నాప్ చేసి చీకటి రూమ్‌లో బంధించారని చెబుతుంది. తొలుత ఫ్రాంక్ కాల్ అని భావించిన నిలయ్ ఆమె మాటలను నమ్మడు. ఆ అమ్మాయితో జరుగుతోన్న కన్వర్జేషన్‌ను లైవ్‌లో పెట్టేస్తాడు. నిలయ్‌తో ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు విన్న పోలీసులు ఆమె నిజంగానే కిడ్నాప్ అయ్యిందని ఫిక్సవుతారు.
ఆ కిడ్నాప్ కేసును నిలయ్ ద్వారా ఛేదించి యువతిని కాపాడాలని పోలీసులు భావిస్తారు. రేడియో స్టేషన్ నుంచి లైవ్‌లో ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు? ఎక్కడ ఉంచారనే సమాచారాన్ని నిలయ్ ఎలా సేకరించాడు? నిజంగానే ఆ అమ్మాయి కిడ్నాప్ అయ్యిందా? నిలయ్‌కు జరిగిన యాక్సిడెంట్‌కు కిడ్నాప్ అయిన అమ్మాయికి ఉన్న సంబంధం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.
డివోషనల్ థ్రిల్లర్...
ప్రస్తుతం సుమంత్...మహేంద్రగిరి వారాహి పేరుతో డివోషనల్ థ్రిల్లర్ మూవీ చేస్తోన్నాడు. ఈ మూవీకి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తోన్నాడు. ఓ వైపు హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలు చేస్తూనే సీతారామం, సార్ సినిమాల్లో సుమంత్ కీలక పాత్రలు చేశాడు.