OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి సుమంత్ అన‌గ‌న‌గా మూవీ - స్ట్రీమింగ్ ఎందులో...ఎప్పుడంటే?-sumanth telugu movie anganga directly streaming on etv win ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: డైరెక్ట్‌గా ఓటీటీలోకి సుమంత్ అన‌గ‌న‌గా మూవీ - స్ట్రీమింగ్ ఎందులో...ఎప్పుడంటే?

OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి సుమంత్ అన‌గ‌న‌గా మూవీ - స్ట్రీమింగ్ ఎందులో...ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Sep 06, 2024 06:37 AM IST

OTT: సుమంత్ కొత్త మూవీ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. అన‌గ‌న‌గా పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాకు స‌న్నీ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో సుమంత్ టీచ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

ఓటీటీ
ఓటీటీ

OTT: స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా క‌థాంశాల ప‌రంగా ప్ర‌యోగాలు చేస్తుంటాడు టాలీవుడ్ హీరో సుమంత్‌. తాజాగా అత‌డు ప్ర‌ధాన పాత్ర‌లో అన‌గ‌న‌గా పేరుతో ఓ మూవీ తెర‌కెక్కుతోంది. ఎమోష‌న‌ల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

అన‌గ‌న‌గా మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా గ్లింప్స్‌ను గురువారం ఈటీవీ విన్ రిలీజ్ చేసింది.

స్కూల్ బ్యాక్‌డ్రాప్‌లో...

ఓ స్కూల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ సాగ‌నున్న‌ట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. పిల్ల‌లు అంద‌రూ రెడీయా...ఇవాళ మీరు విన‌బోయే క‌థ ఏంటంటే...అన‌గ‌న‌గా అంటూ సుమంత్ వాయిస్ గ్లింప్స్‌లో వినిపిస్తోంది. ఇందులో సుమంత్ టీచ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. వ్యాస్ సార్ అంటూ ఓ బోర్డ్‌పై అత‌డి పేరు క‌నిపిస్తోంది. గ్లింప్స్‌లోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హార్ట్ ట‌చింగ్‌గా ఉంది. చిన్న‌ప్పుడు మ‌నం చాలా క‌థ‌లు వినేవాళ్లం క‌దా...ఇప్పుడు ఆ క‌థ‌లు మ‌రోసారి విందామా అంటూ గ్లింప్స్‌తో పాటు ఉన్న క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది.

కాజ‌ల్ చౌద‌రి...

అన‌గ‌న‌గా మూవీకి స‌న్నీ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ మూవీతోనే అత‌డు ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. అక్టోబ‌ర్‌లో అన‌గ‌న‌గా మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో కాజ‌ల్ చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. మిస్ యూనివ‌ర్స్ బీహార్ 2024గా కాజ‌ల్ చౌద‌రి ఇటీవ‌లే ఎంపికైంది. సుమంత్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తొలి అడుగు వేయ‌బోతున్న‌ది. అన‌గ‌న‌గా మూవీలో సుమంత్‌, కాజ‌ల్ చౌద‌రితో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ విహార్ష్ మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

23 ఏళ్ల కెరీర్‌లో...

సుమంత్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి 23 ఏళ్లు పైనే అయ్యింది. సుదీర్ఘ కెరీర్‌లో 30 లోపే సినిమాలు చేశాడు. కెరీర్ ఆరంభంలో గోదావ‌రి, గోల్కొండ హైస్కూల్‌, స‌త్యం వంటి సినిమాల‌తో స‌క్సెస్‌ల‌ను అందుకున్నాడు సుమంత్‌. ఆ త‌ర్వాత చాలా ఏళ్ల‌కు మ‌ళ్లీ రావాతో స‌ర్‌ప్రైజ్ హిట్టు కొట్టాడు. గ‌త‌ కొన్నాళ్లుగా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన సినిమాల‌కు ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు సుమంత్‌.

మ‌హేంద్ర‌గిరి వారాహి...

ప్ర‌స్తుతం సుమంత్ మ‌హేంద్ర‌గిరి వారాహి పేరుతో ఓ డివోష‌న‌ల్‌ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోన్నాడు. సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో బ్ర‌హ్మానందం ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. గ‌తంలో ఇదే ద‌ర్శ‌కుడితో సుబ్ర‌మ‌ణ్య‌పురం అనే సినిమా చేశాడు సుమంత్‌. హీరోగానే కాకుండా స్టార్ హీరోల స‌నిమాల్లో కీల‌క పాత్ర‌లు చేస్తోన్నాడు సుమంత్‌. దుల్క‌ర్ స‌ల్మాన్ సీతారామం, ధ‌నుష్ సార్ సినిమాల్లో విభిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించాడు.

టాపిక్