Sumanth Prabhas: ప్యూర్ ఆంధ్ర, భీమవరం వైబ్‌లో రెండో సినిమా.. 'మేము ఫేమస్' హీరో సుమంత్ ప్రభాస్ కామెంట్స్-sumanth prabhas new movie launch ceremony at ramanaidu studios a musical romantic movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sumanth Prabhas: ప్యూర్ ఆంధ్ర, భీమవరం వైబ్‌లో రెండో సినిమా.. 'మేము ఫేమస్' హీరో సుమంత్ ప్రభాస్ కామెంట్స్

Sumanth Prabhas: ప్యూర్ ఆంధ్ర, భీమవరం వైబ్‌లో రెండో సినిమా.. 'మేము ఫేమస్' హీరో సుమంత్ ప్రభాస్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Nov 11, 2024 11:45 AM IST

Sumanth Prabhas New Movie Launch Ceremony: మేము ఫేమస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ప్రభాస్ కొత్త సినిమాతో రానున్నాడు. సుమంత్ ప్రభాస్ కొత్త సినిమా లాంచ్ పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్యూర్ ఆంధ్ర, భీమవరం వైబ్‌తో రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీ అని సుమంత్ ప్రభాస్ చెప్పాడు.

ప్యూర్  ఆంధ్ర, భీమవరం వైబ్‌లో రెండో సినిమా.. 'మేము ఫేమస్' హీరో సుమంత్ ప్రభాస్ కామెంట్స్
ప్యూర్ ఆంధ్ర, భీమవరం వైబ్‌లో రెండో సినిమా.. 'మేము ఫేమస్' హీరో సుమంత్ ప్రభాస్ కామెంట్స్

Sumanth Prabhas New Movie Launch: తొలి మూవీ 'మేం ఫేమస్‌'తో లీడ్ యాక్టర్, దర్శకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా తన రెండో మూవీని అనౌన్స్ చేశారు. ఈ కొత్త మూవీ రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ మేడిన్ వెంచర్. ఎంఆర్ ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

అల్లు అరవింద్‌తో స్క్రిప్ట్

ఆదివారం (నవంబర్ 10) నాడు రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు హీరో శ్రీవిష్ణు క్లాప్‌ కొట్టారు. సురేష్‌బాబు కెమెరా స్విచాన్‌ చేశారు. దర్శకులు శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, మహేష్ బాబు పి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ని అల్లు అరవింద్ మేకర్స్‌కి అందజేశారు.

కనెక్టింగ్‌గా అనిపించలేదని

ఈ వేడుకకు సునీల్ నారంగ్ కూడా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా యంగ్ టీం సక్సెస్ ఫుల్‌గా ముందుకు సాగాలని అతిథులందరూ ఆశీర్వదించారు. మేం ఫేమస్ సక్సెస్ తర్వాత సుమంత్ ప్రభాస్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం రకరకాల కథలు విన్నారని, అయితే, అందులో ఏదీ కనెక్టింగ్‌గా అనిపించలేదని మేకర్స్ తెలిపారు.

86కిపైగా కథలు

ఒకానొక సమయంలో తనే కథను రాసి దర్శకత్వం వహించాలని కూడా సుమంత్ ప్రభాస్ ఆలోచించే సమయంలో సుభాష్ చంద్ర ఇచ్చిన స్క్రిప్ట్‌ పర్ఫెక్ట్ అని భావించి ఈ కథను పట్టాలెక్కిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌కి ఆమోదం తెలిపే ముందు ఈ యంగ్ హీరో దాదాపు 86కి పైగా కథలు విన్నారట. ఇదిలా ఉంటే, ఈ సినిమాతో నిధి ప్రదీప్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ

ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాలో జగపతి బాబు మేజర్ రోల్ పోషిస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రీను అండ్ రోహిత్ కృష్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ యూత్‌ఫుల్ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ, ఇది బిగ్ స్క్రీన్స్‌కు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ తీసుకువస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

భీమవరం ప్రాంతాల్లో

పశ్చిమగోదావరి ప్రాంతంలోని విజువల్ బ్యూటీని ప్రజెంట్ చేసే ఈ చిత్రాన్ని భీమవరం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. మూవీ లాంచింగ్ ఈవెంట్‌లో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. "ఈ ఈవెంట్‌కు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన గెస్ట్‌లందరికీ చాలా థాంక్స్" అని అన్నాడు.

ఏడాదిన్నరగా ఆలోచించాను

"నేను చేసిన ఫస్ట్ సినిమా 'మేం ఫేమస్' నీ అందరూ చాలా గొప్పగా ఆదరించారు. నెక్ట్స్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలని ఏడాదిన్నరగా అలోచించాను. చాలా కథలు విన్నాను. కథలు ఎక్కడో మనసుకు నచ్చలేదు. అలాంటి సమయంలో ఈ సినిమా రైటర్, డైరెక్టర్ సుభాష్ చంద్ర వచ్చి ఈ కథ చెప్పారు. ప్యూర్ ఆంధ్ర, భీమవరం వైబ్‌లో అద్భుతంగా ఉంది" అని సుమంత్ ప్రభాస్ చెప్పారు.

చాలా మంచి కథ

"అభినవ్ అన్న చాలా పాషనెట్ ప్రొడ్యూసర్. చాలా మంచి కథ తీసుకోచ్చారు. ఈ సినిమాని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ సో మచ్" అని హీరో సుమంత్ ప్రభాస్ తెలిపారు.

Whats_app_banner