Mem Famous Trailer: ఫేమస్ కావడానికి వచ్చేస్తున్నారు.. ఫన్నీగా సాగిన ట్రైలర్-sumanth prabhas mem famous movie trailer launched by hero nani ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sumanth Prabhas Mem Famous Movie Trailer Launched By Hero Nani

Mem Famous Trailer: ఫేమస్ కావడానికి వచ్చేస్తున్నారు.. ఫన్నీగా సాగిన ట్రైలర్

Maragani Govardhan HT Telugu
May 17, 2023 09:24 PM IST

Mem Famous Trailer: సుమంత్ ప్రభాస్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మేమ్ ఫేమస్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు హీరో నాని. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మే 26న సినిమా విడుదల కానుంది.

మేమ్ ఫేమస్ ట్రైలర్ రిలీజ్
మేమ్ ఫేమస్ ట్రైలర్ రిలీజ్

Mem Famous Trailer: ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. ఆసక్తికరమైన టైటిల్, మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి విపరీతంగా అలరిస్తున్నాయి. తాజాగా ఈ వరుసలో మరో మూవీ రానుంది. అదే మేమ్ ఫేమస్. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ, నాని లాంటి స్టార్ హీరోలు కూడా ప్రమోషన్లు చేస్తున్నారు. ఫలితంగా మూవీపై బజ్ ఏర్పడింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం థియేటర్లో ఈ సినిమా థియెట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేయించారు.

సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మంచి ఫన్ అండ్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తూనే తెలుస్తోంది. ముగ్గురు స్నేహితుల మధ్య నడిచే సరదా సంభాషణలు, ఫేమస్ కావడానికి పడే పాట్లు ఆకట్టుకుంటాయి.

కథ విషయానికొస్తే హీరో సుమంత్ ప్రభాస్.. తన స్నేహితులతో కలిసి ఊర్లో అల్లరి చిల్లరగా తిరుగుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. పెద్దగా కలలేమి లేకుండా లైఫ్‌ను బిందాస్‌గా గడుపుతుంటాడు. దీంతో వారి నిర్లక్ష్యపూరిత ధోరణికి, ఆటిట్యూడ్‌ను ప్రతి ఒక్కరూ తిడుతూ ఉంటారు. ఇంతలో హీరో తను ఎలాగైన ఫేమస్ అయి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రితోనే ఛాలెంజ్ చేస్తాడు. మరి అతడు అనుకున్నది సాధించాడా? లేదా? అనేది మిగిలిన కథగా తెలుస్తోంది.

ఛాయ్ బిస్కట్ ఫిల్మ్స్, లహరి ఫీల్మ్స్ పతాకాలపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమంత్ ప్రభాసే ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వం వహించాడు. సృజన అడుసుమిల్లి ఎడిటర్ కాగా.. కల్యాణ్ నాయక్ సంగీతాన్ని సమకూర్చారు. శ్యామ్ దుపాటి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. ఈ సినిమా మే 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

IPL_Entry_Point

టాపిక్