ఇది కదా సక్సెస్ అంటే.. ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోపే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్.. సుమంత్ పాఠాలకు ఫ్యాన్స్ ఫిదా-sumanth movie anaganaga ott streaming etv win original movie crossed 50 million streaming minutes ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఇది కదా సక్సెస్ అంటే.. ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోపే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్.. సుమంత్ పాఠాలకు ఫ్యాన్స్ ఫిదా

ఇది కదా సక్సెస్ అంటే.. ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోపే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్.. సుమంత్ పాఠాలకు ఫ్యాన్స్ ఫిదా

Hari Prasad S HT Telugu

సుమంత్ నటించిన మూవీ ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెట్టిన రెండు రోజుల్లోపే ఏకంగా 50 మిలియన్ల్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకోవడం విశేషం. ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

ఇది కదా సక్సెస్ అంటే.. ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోపే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్.. సుమంత్ పాఠాలకు ఫ్యాన్స్ ఫిదా

ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీ అనగనగా ఇప్పుడు ఓటీటీలో దూసుకెళ్తోంది. మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ టీచర్ అంటే ఇలా ఉండాలి అనేలా ఈ సినిమాను రూపొందించారు. గురువారం (మే 15) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

అనగనగా ఓటీటీ రికార్డు

సుమంత్ లీడ్ రోల్లో నటించిన అనగనగా మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే 50 మిలియన్ల అంటే 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది. గురువారం (మే 15) ఓటీటీలోకి వచ్చే ముందు బుధవారం సాయంత్రం ఈ సినిమా ప్రీమియర్ షోలు వేశారు. పలువురు సెలబ్రిటీలతోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ మూవీ చూశారు.

అప్పటి నుంచే పాజిటివ్ రివ్యూలు రావడం మొదలయ్యాయి. దీంతో ఓటీటీలోకి రాగానే ఫ్యాన్స్ ఎగబడి చూసేస్తున్నారు. సుమంత్ చెప్పే పాఠాలు వాళ్లను బాగానే ఆకర్షిస్తున్నట్లు తాజాగా అనగనగా మూవీ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు చూస్తే అర్థమవుతోంది.

అనగనగా మూవీ గురించి..

అనగనగా మూవీని సన్నీ సంజయ్ డైరెక్ట్ చేశాడు. ఇందులో కాజల్ చౌదరి ఫిమేల్ లీడ్ గా నటించింది. సుమంత్ ఇందులో వ్యాస్ అనే ఓ కథల టీచర్ గా నటించాడు. పిల్లలకు కథల ద్వారా పాఠాలు చెప్పి వాళ్లలో క్రియేటివిటీని పెంచాలని ఆరాటపడే టీచర్ అతడు. కానీ ఓ మూస ధోరణికి అలవాటు పడిన మన విద్యావ్యవస్థ అతన్ని పట్టించుకోదు. ఈ సినిమాలో సుమంత్ నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి.

ప్రీమియర్ షోలతోపాటు ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా పాజిటివ్ టాక్ పెరగడంతో క్రమంగా అనగనగాను చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతోంది. సమ్మర్ హాలిడేస్ కావడంతో పిల్లలతో కలిసి ఇంట్లోనే ఈ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు ఇలా రెండు రోజుల్లోపే రికార్డు వ్యూస్ సాధ్యమయ్యాయి. ఈ లో బడ్జెట్ మూవీని ఈటీవీ విన్ ఓటీటీ కూడా బాగానే ప్రమోట్ చేస్తోంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం