టాలీవుడ్ హీరో సుమంత్ ప్రధాన పాత్ర పోషించిన ‘అనగనగా’ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ హృదయాన్ని హత్తుకునేలా సాగి ఆకట్టుకుంది. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. తండ్రీకొడుకుల ఎమోషన్, విద్యావ్యవస్థ ఎలా ఉందనే విషయాలతో ఈ మూవీ వస్తోంది. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు అనగనగా వస్తోంది.
అనగనగా చిత్రం రేపు (మే 14) ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ అర్ధరాత్రి స్ట్రీమింగ్ మొదలవుతుంది. అంటే ఈటీవి విన్‍లో ఈ చిత్రం మరికొన్ని గంటల్లోనే అడుగుపెట్టనుంది.
అనగనగా చిత్రానికి సన్నీ కుమార్ దర్శకత్వం వహించారు. బడా కార్పొరేట్ స్కూళ్లలో విద్యావ్యవస్థ ఎలా ఉంటుందనే విషయం ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటుంది. కొడుకు చదువుపై ఆందోళన పడే తల్లిదండ్రుల చుట్టూ స్టోరీ సాగుతుంది. ఉపాధ్యాయుడిగా సుమంత్ చేశారు. ఈ సినిమాలో సుమంత్‍కు జోడీగా కాజల్ చౌదరి నటించారు. కొడుకు పాత్రలో మాస్టర్ విహర్ష్ నటించారు.
అనగనగా సినిమాను కొందరికి ప్రీమియర్లను ప్రదర్శించింది ఈటీవీ విన్ సంస్థ. ఈ ప్రీమియర్లు చూసిన వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రం ఎమోషనల్‍గా కదిలిస్తుందని, హృదయాన్ని హత్తుకునేలా ఉందని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. సుమంత్ కెరీర్లో ఇది ఓ క్లాసిక్‍గా నిలుస్తుందని రాసుకొస్తున్నారు. తండ్రీకొడుకుల ఎమోషనల్ టచ్ చేసిందని అంటున్నారు.
అనగనగా చిత్రంలో అంశాలు చాలా మందికి కనెక్ట్ అవుతాయని, భావోద్వేగానికి గురి చేస్తాయంటూ కామెంట్లు చేస్తున్నారు. సుమంత్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని అంటున్నారు. డైరెక్టర్ సన్నీ కుమార్ ఈ చిత్రాన్ని చూపించిన విధానం బాగుందని రాసుకొచ్చారు. మొత్తానికి ప్రీమియర్ల ద్వారా సూపర్ టాక్ తెచ్చుకుంది. రేపటి నుంచి ఈటీవీ విన్‍లో అనగనగా చిత్రాన్ని చూసేయవచ్చు. స్ట్రీమింగ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
అనగనగా సినిమాలో సుమంత్, కాజల్ చౌదరి, విహర్ష్ సహా అవసరాల శ్రీనివాస్, అనుహాసన్, రాకేశ్ రాచకొండ, కౌమిది నేమని, బీవీఎస్ రవి కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్ర మాదిరెడ్డి ప్రొడ్యూజ్ చేశారు. చందు రవి సంగీతం అందించిన ఈ చిత్రానికి పవన్ పప్పుల సినిమాటోగ్రఫీ చేశారు.
సంబంధిత కథనం