Anaganaga OTT: నేరుగా ఓటీటీ రిలీజ్ కానున్న హీరో సుమంత్ మూవీ.. టీచర్‌గా అనగనగా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Sumanth Anaganaga OTT Movie First Look Release: ఓటీటీలోకి మరో సినిమాతో సుమంత్ అలరించేందుకు రెడీ అయ్యాడు. సుమంత్ నటించిన అనగనగా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఇదివరకు రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆకట్టుకోగా తాజాగా మూవీలోని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సుమంత్ బర్త్ డే సందర్భంగా ఇవాళ (ఫిబ్రవరి 9) విడుదల చేశారు.

Sumanth Anaganaga OTT Streaming: అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్లలో హీరో సుమంత్ ఒకరు. 1999లో ప్రేమకథ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన సుమంత్ ఎన్నో వైవిధ్య సినిమాల్లో నటించి అలరించాడు. ప్రేమకథ తర్వాత యువకుడు, పెళ్లి సంబంధం, రామా చిలకమ్మ, నాగార్జునతో కలిసి స్నేహమంటే ఇదేరా వంటి అనేక సినిమాలతో ఆకట్టుకున్నాడు సుమంత్.
అహం రీబూట్‌తో ఓటీటీ ఎంట్రీ
సుమంత్ నటించిన సత్యం, గౌరి, మహానంది, గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్లీ రావా వంటి హిట్స్ అందుకున్నాడు. ఇక సీతారామం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సైమా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్‌కు నామినేట్ కూడా అయ్యాడు. ఇక, అహం రీబూట్ అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు హీరో సుమంత్.
నేరుగా ఓటీటీ రిలీజ్
ఇప్పుడు తాజాగా మరో సినిమాతో నేరుగా ఓటీటీలో అలరించేందుకు సుమంత్ రెడీ అయ్యాడు. హీరో సుమంత్ నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా.. నేరుగా ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో వ్యాస్ అనే టీచర్‌గా సుమంత్ నటిస్తున్నాడు. సన్నీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా స్కూల్ నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది.
సుమంత్ బర్త్ డే సందర్భంగా
ఇదివరకు టీచర్స్ డే నాడు విడుదల చేసిన అనగనగా గ్లింప్స్ ఆకట్టుకుంది. తాజాగా ఇవాళ (ఫిబ్రవరి 9) సుమంత్ బర్త్ డే సందర్భంగా అనగనగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో సైకిల్‌పై ఒక బాబు, మహిళతో సుమంత్ కనిపించాడు. వారు వాస్ మాస్టార్ భార్య, కొడుకు అని తెలుస్తోంది. ఇక అనగనగా మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్ కానుంది.
అనగనగా ఓటీటీ రిలీజ్ డేట్
ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ "చిన్నప్పుడు మనం చాలా కథలు వినేవాళ్లం కదా? అవే కథలు మళ్లీ నెమరు వేయటానికి వస్తున్న మన వ్యాస్ సార్‌కి జన్మదిన శుభాకాంక్షలు" అని ఈటీవీ విన్ క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే, అనగనగా ఓటీటీ రిలీజ్ డేట్‌ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇకపోతే ఈటీవీ విన్‌లో నేరుగా రిలీజ్ అయ్యే ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
వినబోయే కథ ఏంటంటే?
ఇదివరకు విడుదల చేసిన అనగనగా గ్లింప్స్‌లో స్కూల్‌లో పిల్లలందరు అల్లరి చేస్తుంటే.. "అంతా రెడీనా అని వ్యాస్ మాస్టార్ అంటాడు. ఇవాళ మీరు వినబోయే కథేంటంటే.. అనగనగా.." అంటూ సినిమా గ్లింప్స్ ముగిసింది. చివరిలో ఓ ఇల్లును చూస్తూ ఓ పిల్లాడితో వ్యాస్ మాస్టర్ కనిపించాడు. ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామాగా అనగనగా సినిమా జోనర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్
ఇక ఈటీవీ విన్‌లో డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న అనగనగా మూవీలో కాజల్ రాణి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అలాగే, చైల్డ్ ఆర్టిస్ట్ విహర్ష్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
సంబంధిత కథనం
టాపిక్