Psychological Thriller OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Aha OTT: సుమంత్ హీరోగా నటించిన తెలుగు మూవీ ఆహం రీబూట్ థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌లో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 30 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది
Aha OTT: nelసుమంత్ హీరోగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అహం రీబూట్ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ ఆహా ఓటీటీలో జూన్ 30 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. అహం రీబూట్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆహా ఓటీటీ ఆఫీషియల్‌గా ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసింది.

ఆర్జే పాత్రలో సుమంత్...
అహం రీబూట్ మూవీలో సుమంత్ ఆర్జే నిలయ్ అనే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. సిటీలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్‌లకు గురవుతుంటారు. వారిని ఆర్జే నిలయ్ ఎలా కాపాడాడు? ఈ కిడ్నాప్‌ల వెనుక ఎవరున్నారు అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో సుమంత్ పాత్ర డిఫరెంట్‌గా ఉండనున్నట్లు సమాచారం.
2021లో మొదలు...
2021లో అహం రీబూట్ సినిమా షూటింగ్ మొదలైంది. 2022లో షూటింగ్ పూర్తయింది. అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమైంది. అందువల్లే థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అహం రీబూట్ మూవీని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు.
ఓ యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌కు థ్రిల్లింగ్‌ను పంచుతుందని మేకర్స్ చెబుతోన్నారు. అహం రీబూట్ మూవీకి శ్రీరామ్ మద్దూరి మ్యూజిక్ అందిస్తోన్నాడు. వరుణ్ అంకర్ల సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. అహం రీబూట్‌లో సుమంత్‌తో పాటు మిగిలిన ప్రధాన పాత్రలు ఎవరూ పోషించరన్నది మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు.
మళ్లీరావాతో హిట్...
జయాపజయాలకు అతీతంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తోన్నాడు సుమంత్. గోదావరి, మళ్లీరావా, గోల్కోండ హైస్కూల్ తో పాటు మరికొన్ని సినిమాలతో కమర్షియల్ హిట్స్ సొంతం చేసుకున్నాడు సుమంత్. మళ్లీరావా సక్సెస్ తర్వాత పలు సినిమాలు చేసిన అవేవీ అతడికి విజయాలను తెచ్చిపెట్టలేకపోయాయి.
సీతారామంలో నెగెటివ్ రోల్...
హీరోగానే కాకుండా అగ్ర కథానాయకుల సినిమాల్లో సుమంత్ గెస్ట్ రోల్స్ చేస్తోన్నాడు. సీతారామం సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించాడు. ధనుష్ సార్‌లో కలెక్టర్‌గా చిన్న పాత్రలో మెరిశాడు.
డివోషనల్ థ్రిల్లర్...
ప్రస్తుతం సుమంత్ మహేంద్ర గిరి వారహి పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథతో డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బ్రహ్మానందం ఓ కీలక పాత్ర చేస్తోన్నాడు. గతంలో సుమంత్, సంతోష్ జాగర్లపూడి కాంబినేషన్‌లో సుబ్రమణ్యంపురం మూవీ తెరకెక్కింది.