Suma Adda: సుమ గొంతు పట్టుకున్న గోపీచంద్.. వైరల్ అవుతున్న వీడియో-suma adda video of gopichand holding the neck of suma going viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Suma Adda Video Of Gopichand Holding The Neck Of Suma Going Viral

Suma Adda: సుమ గొంతు పట్టుకున్న గోపీచంద్.. వైరల్ అవుతున్న వీడియో

Hari Prasad S HT Telugu
Apr 24, 2023 08:22 PM IST

Suma Adda: సుమ గొంతు పట్టుకున్నాడు గోపీచంద్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. సుమ అడ్డా కార్యక్రమానికి వచ్చిన హీరో గోపీచంద్ సడెన్‌గా ఇలా చేయడంతో అందరూ షాక్ తిన్నారు.

యాంకర్ సుమ గొంతు పట్టుకున్న గోపీచంద్
యాంకర్ సుమ గొంతు పట్టుకున్న గోపీచంద్

Suma Adda: టాలీవుడ్‌లో విలన్ గా మొదలుపెట్టి హీరోగా ఎదిగిన వ్యక్తి గోపీచంద్. మాస్ సినిమాలు, పవర్‌ఫుల్ డైలాగులు ఎక్కువగా ఉండే అతని సినిమాల్లో అప్పుడప్పుడూ లవర్ బాయ్ క్యారెక్టర్ లోనూ కనిపిస్తాడు. తాజాగా రామ బాణం మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మధ్యే ట్రైలర్ రిలీజ్ కాగా.. దానికి మిశ్రమ స్పందన వచ్చింది.

రొటీన్ గోపీచంద్ సినిమాలాగే అనిపిస్తోందన్న కామెంట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడీ రామ బాణం మూవీ టీమ్ ప్రమోషన్లలో బిజీ అయింది. ఇందులో భాగంగా ఈటీవీలో ప్రతి శనివారం వచ్చే సుమ అడ్డా కార్యక్రమానికి హీరో గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి, కమెడియన్ గెటప్ శ్రీను వచ్చారు. ఎప్పటిలాగే సుమ తనదైన రీతిలో పంచ్ లు, నవ్వులతో ప్రోగ్రామ్ నడిపినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది.

అయితే ఈ ప్రోమో చివర్లో గోపీచంద్.. సుమ గొంతు పట్టుకున్నట్లుగా చూపించారు. ఆ సీన్ తోనే ప్రోమో ముగించారు. దీంతో అసలు ఏం జరిగింది? సుమ గొంతును గోపీచంద్ ఎందుకు పట్టుకున్నాడన్నది సస్పెన్స్ గా వదిలేశారు. నిజానికి అతడు అలా సరదాగానే చేసినట్లు తెలుస్తూనే ఉంది. అయితే ఈ ఎపిసోడ్ పై ఆసక్తి పెంచడానికి ఇలా ప్రోమోను కట్ చేసి వదిలారు.

సాధారణంగా సుమా అడ్డాకు వచ్చే గెస్టులపై యాంకర్ సుమ పంచ్ లు వేస్తూ ఉంటుంది. అయితే ఈ ఎపిసోడ్ లో మాత్రం సుమపై కూడా బాగానే పంచ్ లు పడ్డాయి. సినిమాల్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కనిపించే గోపీచంద్.. ఈ షోలో సరదాగా జోకులేస్తూ కనిపించాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం