కోలీవుడ్ మూవీలో విల‌న్‌గా సుహాస్ - తెలుగు వెర్ష‌న్‌లో మాత్రం ట్విస్ట్‌ - మండాడి ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌-suhas to play baddie in his kollywood debut movie mandaadi first look unveiled ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కోలీవుడ్ మూవీలో విల‌న్‌గా సుహాస్ - తెలుగు వెర్ష‌న్‌లో మాత్రం ట్విస్ట్‌ - మండాడి ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

కోలీవుడ్ మూవీలో విల‌న్‌గా సుహాస్ - తెలుగు వెర్ష‌న్‌లో మాత్రం ట్విస్ట్‌ - మండాడి ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Nelki Naresh HT Telugu

టాలీవుడ్ యాక్ట‌ర్ సుహాస్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. సూరి హీరోగా న‌టిస్తోన్న అడ్వెంచ‌ర్స్ థ్రిల్ల‌ర్ మూవీలో విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడు. సుహాస్ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్‌లో మాత్రం సుహాన్ హీరోగా, సూరి విల‌న్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

సుహాస్

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. మండాడి పేరుతో రా అండ్ ర‌స్టిక్ మూవీ చేయ‌బోతున్నాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏకకాలంలో తెర‌కెక్కుతోన్న ఈ బైలింగ్వ‌ల్ మూవీలో సూరి మ‌రో ప్ర‌ధాన పాత్ర చేస్తోన్నాడు. మహిమా నంబియార్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

సునామీ రైడ‌ర్స్‌...

మండాది మూవీ నుంచి సుహాస్ ఫస్ట్ లుక్‌ను మేక‌ర్స్‌ విడుదల చేశారు. లుంగీ ధరించి, నెరిసిన జుట్టుతో, జెర్సీ వేసుకుని డిఫ‌రెంట్ లుక్‌లో సుహాస్ క‌నిపిస్తున్నాడు. సుహాస్ వేసుకున్న జెర్సీపై సునామీ రైడ‌ర్స్ అని రాసి ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. మరో పోస్టర్‌లో సూరి, సుహాస్ ఇద్దరూ స్వయంగా పడవలు నడుపుతూ ఒకరికి ఒకరు వ్యతిరేకంగా కనిపించడం సినిమాలో వారి మధ్య జరిగే గట్టి పోరును సూచిస్తోంది.

తెలుగులో హీరో...త‌మిళంలో విల‌న్‌...

మండాడి త‌మిళ వెర్ష‌న్‌లో సుహాస్ విల‌న్‌గా, సూరి హీరోగా క‌నిపించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. తెలుగులో వెర్ష‌న్‌లో సుహాస్ హీరోగా, సూరి విల‌న్ పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్‌ అధినేత ఎల్రెడ్ కుమార్ తన బ్యాన‌ర్‌లో 16వ మూవీగా మండాడిని రూపొందిస్తోన్నారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీకి మతిమారన్ పుగళేంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గ‌తంలో సెల్ఫీ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు మతిమారన్ పుగళేంది.

అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌...

మండాడి మూవీలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ వంటి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. అంత‌ర్లీనంగా క్రీడాకారుల‌ జీవన పోరాటం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాన్ని ప్ర‌తిబింబించే ఎలిమెంట్స్ ఉంటాయ‌ని అంటున్నారు.

జీవీ ప్ర‌కాష్ కుమార్‌...

మండాడి మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తోన్నారు. ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా ప‌నిచేస్తున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ పీటర్ హెయిన్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ స‌మ‌కూర్చుతున్నారు.

ప్ర‌స్తుతం హీరోగా తెలుగులో నాలుగు సినిమాలు చేస్తోన్నాడు సుహాస్‌. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థాంశంతో సుహాస్ చేసిన ఓ భామ అయ్యో రామా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో పాటు కేబుల్ చారి, ఆనంద‌రావు అడ్వెంచ‌ర్స్‌తో పాటు మ‌రో మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.