సుహాస్ ఓ భామ అయ్యో రామ ట్రైలర్ రిలీజ్.. నవ్వించే కామెడీతోపాటు ఎడిపించే ఎమోషన్.. అతిథి పాత్రల్లో ఇద్దరు డైరెక్టర్స్!-suhas oh bhama ayyo rama trailer released and directors harish shankar maruthi guest appearance ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  సుహాస్ ఓ భామ అయ్యో రామ ట్రైలర్ రిలీజ్.. నవ్వించే కామెడీతోపాటు ఎడిపించే ఎమోషన్.. అతిథి పాత్రల్లో ఇద్దరు డైరెక్టర్స్!

సుహాస్ ఓ భామ అయ్యో రామ ట్రైలర్ రిలీజ్.. నవ్వించే కామెడీతోపాటు ఎడిపించే ఎమోషన్.. అతిథి పాత్రల్లో ఇద్దరు డైరెక్టర్స్!

Sanjiv Kumar HT Telugu

యంగ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఓ భామ అయ్యోరామ ట్రైలర్‌ రిలీజ్ అయింది. ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం నవ్వించే కామెడీతోపాటు ఏడిపించే ఎమోషనల్ సీన్లతో సాగింది. అంతేకాకుండా ఇద్దరు డైరెక్టర్స్ అతిథి పాత్రల్లో కనిపించి అట్రాక్ట్ చేశారు. ఓ భామ అయ్యో రామ ట్రైలర్ వివరాల్లోకి వెళితే..!

సుహాస్ ఓ భామ అయ్యో రామ ట్రైలర్ రిలీజ్.. నవ్వించే కామెడీతోపాటు ఎడిపించే ఎమోషన్.. అతిథి పాత్రల్లో ఇద్దరు డైరెక్టర్స్!

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న హీరో సుహాస్‌ తాజాగా నటించిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.

జులై 11న ఓ భామ అయ్యో రామ రిలీజ్

రామ్ గోధల దర్శకత్వం వహించిన ఈ సినిమాను వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల నిర్మిస్తున్నారు. జూలై 11న ఓ భామ అయ్యో రామ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. శనివారం (జులై 5) ఓ భామ అయ్యో రామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

షూర్ షాట్ విజయం

ఈ సందర్భంగా నిర్మాత హరీష్ నల్ల మాట్లాడుతూ.. "ట్రైలర్‌ విడుదలైన కొద్ది సమయంలోనే మంచి స్పందన వస్తోంది. ట్రైలర్‌ చూసిన వారు ఈచిత్రం షూర్‌ షాట్‌ విజయం అంటుంటే ఆనందంగా ఉంది. క్యూట్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రత సన్నివేశం ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తుంది" అని అన్నారు.

అత్యధిక బడ్జెట్‌తో

"హీరో సుహాస్‌, మాళవిక మధ్య వచ్చే లవ్‌ సీన్స్‌ కూడా అలరించే విధంగా ఉంటాయి. సుహాస్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం అందరికి కొత్త అనుభూతినిస్తుంది" అని హరీష్ నల్ల తెలిపారు.

మంచి సినిమాను ఇవ్వబోతున్నాం

"జూలై 11న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. పూర్తి ఎంటర్‌టైనింగ్‌గా రాబోతున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మీ హృదయాలను దోచుకుంటుంది. తప్పకుండా నిర్మాతగా ఓ మంచి సినిమాను ఇవ్వబోతున్నాం అనే నమ్మకం ఉంది" అని హరీష్ నల్ల పేర్కొన్నారు.

కామెడీ-ఎమోషనల్

ఇక ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌ను గమనిస్తే.. నవ్వించే కామెడీ సీన్లతోపాటు ఏడిపించే ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌, హీరో, హీరోయిన్స్‌ ఎనర్జీ, ఇలా ఈతరం ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారిని అలరించే ఫుల్‌ ప్యాకేజీగా ఈ చిత్రాన్ని రూపొందించారని అర్థమవుతోంది.

శ్మశానంలో హీరో హీరోయిన్

హీరోను హీరోయిన్ శ్మశానంలో కూర్చోబెట్టడం, పక్కనే చేతబడి ముగ్గు చూసి హీరో భయపడటం వంటి సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రంలో ప్రముఖ డైరెక్టర్స్ హరీష్ శంకర్, మారుతి అతిథి పాత్రలో కనిపించి అలరించారు.

కాగా, మణికందన్‌ సినిమాటోగ్రఫీని అందించిన ఓ భామ అయ్యో రామ సినిమాకు రథన్‌ సమకూర్చారు. బ్రహ్మా కడలి ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం