Suhana Khan With Boyfriend Agastya Nanda Photos: సెలబ్రిటీలు ప్రేమ, వివాహాలు, ఎఫైర్స్ ఎప్పుడూ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అందుకే వాటికి సంబంధించిన విషయాలు, ఫొటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు కిడ్స్ దొరికినట్లు ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్ బాద్‌షా, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కలిసి లండన్‌లో జరిగిన ఓ పార్టీలో కలిసి కనిపించారని సమాచారం. లండన్‌లోని ఓ నైట్ క్లబ్‌లో సుహానా ఖాన్, అగస్త్య మాట్లాడుకుంటూ కనిపించారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే, సుహానా, అగస్త్య స్నేహితుడు అయిన వేదాంత్ మహాజన్ బర్త్ డే పార్టీకి ఈ ఇద్దరు హాజరయ్యారని తెలుస్తోంది. వీరితోపాటు అజయ్ దేవగణ్, కాజోల్ కుమార్తె నైసా దేవగణ్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. అజయ్, కాజోల్, నైసా కంటే ఎక్కువగా సుహానా, అగస్త్య కనిపించడంపై అందరి ఫోకస్ పడింది. ఎందుకుంటే వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే రూమర్స్ తెగ వినిపిస్తున్నాయి.
సుహానా ఖాన్, అగస్త్య నందా డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరగడానికి కారణం వీరిద్దరు ది ఆర్చీస్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమే. జోయా అక్తర్ తెరకెక్కించిన ది ఆర్చీస్ చిత్రంలో ఈ ఇద్దరు కలిసి నటించారు. తర్వాత వీరిద్దరు కలిసి పలు సందర్భాల్లో కనిపించారు. దాంతో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని రూమర్స్ రావడం ప్రారంభం అయింది.
ఇక తాజాగా లండన్ నైట్ క్లబ్ పార్టీలో సుహానా, అగస్త్య కలిసి ఉన్న కొత్త ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో మరోసారి వారి బంధంపై అందరి దృష్టి మళ్లింది. అయితే, షారుక్ ఖాన్, గౌరీ ఖాన్‌ల కుమార్తె సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ మనవడు అగస్త్య నందా కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని పుకార్లు షికార్లు చేస్తున్న వీరిద్దరూ మాత్రం స్పందించలేదు.
కానీ, సుహానా, అగస్త్య తరచూ ఈవెంట్లు, పార్టీల్లో కలిసి కనిపిస్తుంటారు. ప్రస్తుతం విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న సుహానా తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్‌కు తన ట్రిప్‌కు సంబంధించిన అద్భుతమైన ఫోటోలతో ట్రీట్ ఇస్తోంది. గత నెలలో ఇటలీ వీధుల్లో దిగిన కొన్ని అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది సుహానా ఖాన్. కాగా మే నెలాఖరులో సుహానా తన కుటుంబంతో కలిసి అంబానీ క్రూయిజ్ పార్టీలో పాల్గొన్నారు.
ఇక సుహానా తన తండ్రి షారుక్ ఖాన్‌తో కలిసి కింగ్ అనే చిత్రంతో వెండితెరకు పరిచయం కానుంది. మరోవైపు అగస్త్య నందా కూడా త్వరలోనే వెండితెర అరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. పాపులర్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఎక్కిస్ చిత్రంలో అగస్త్య నటిస్తున్నాడు.
దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ 'ఎక్కిస్' సినిమా 1971 నాటి యుద్ధ వీరుడు అరుణ్ ఖేతర్ పాల్ బయోపిక్ అని సమాచారం. ఈ సినిమాలో సీనియర్ హీరో ధర్మేంద్ర కూడా కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. ఇక అగస్త్య తాత అమితాబ్ బచ్చన్ కల్కి 2898 ఏడీ సినిమాలో అశ్వత్థామగా అదరగొట్టిన విషయం తెలిసిందే.
టాపిక్