కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో ఏకంగా 38 ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ థగ్ లైఫ్. ఇందులో త్రిష ఫిమేల్ లీడ్ గా కనిపిస్తోంది. తాజాగా ఆమెపై చిత్రీకరించిన షుగర్ బేబీ అనే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో త్రిష ఓ వైట్ శారీలో చాలా సెక్సీగా కనిపించింది.
థగ్ లైఫ్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ షుగర్ బేబీ సాంగ్ బుధవారం (మే 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటపై త్రిష వేసిన స్టెప్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ పాటను తెలుగులో అనంత శ్రీరామ్ రాశాడు.
అలెగ్జాండ్రా జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ ఈ సాంగ్ పాడారు. ఏం కావాలి నీకు.. కొద్ది కొద్దిగడుగు అంటూ సాగే ఈ సాంగ్ రెహమాన్ కంపోజ్ చేసిన పాటల్లో భిన్నంగా ఉందని చెప్పొచ్చు. త్రిష కృష్ణన్ మెస్మరైజింగ్ బ్యూటీతో కనువిందు చేసింది. ఆమె లుక్స్, గ్రేస్.. అన్నీ కలిసి తెరపై మ్యాజిక్ ని సృష్టించాయి.
నిజానికి ఈ పాటకు పెట్టిన పేరుపై విమర్శలు వచ్చాయి. త్రిషలాంటి నటి ఉన్న పాటకు షుగర్ బేబీ అనే పేరు పెట్టడంపై అభిమానులు మండిపడ్డారు. మణిరత్నం సినిమాలో ఇలాంటి పాటనా అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 42 ఏళ్ల త్రిష ఉన్న పాట.. ‘షుగర్ బేబీ’ అంటూ ఉండడం ఏంటి అని ప్రశ్నించారు.
స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన ‘థగ్‍లైఫ్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ గ్యాంగ్‍స్టర్ యాక్షన్ మూవీ జూన్ 5వ తేదీన విడుదల కానుంది. ఇటీవలే వచ్చిన థగ్‍లైఫ్ ట్రైలర్ ఆకట్టుకుంది.
థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్ కొడుకు పాత్ర పోషించాడు హీరో శింబు. తండ్రీకొడుకుల మధ్య పోరాటం కథాంశంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, జోజూ జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అశోక్ సెల్వన్, సాన్య మల్హోత్రా, సంజనా కృష్ణమూర్తి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించాడు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ చేశాడు. జూన్ 5న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
సంబంధిత కథనం