Sudheer Babu Elder look: మామ మశ్చీంద్ర నుంచి మరో లుక్.. ఓల్డర్ లుక్‌లో దర్శనమిచ్చిన సుధీర్ బాబు -sudheer babu stuns as elder don look in mama mascheendra movie
Telugu News  /  Entertainment  /  Sudheer Babu Stuns As Elder Don Look In Mama Mascheendra Movie
మామ మశ్చీంద్రలో ఓల్డర్ లుక్‌లో సుధీర్ బాబు
మామ మశ్చీంద్రలో ఓల్డర్ లుక్‌లో సుధీర్ బాబు

Sudheer Babu Elder look: మామ మశ్చీంద్ర నుంచి మరో లుక్.. ఓల్డర్ లుక్‌లో దర్శనమిచ్చిన సుధీర్ బాబు

04 March 2023, 14:05 ISTMaragani Govardhan
04 March 2023, 14:05 IST

Sudheer Babu Elder look: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం మామ మశ్చీంద్ర. ఈ సినిమా నుంచి ఈ హీరో సెకండ్ లుక్ విడుదలైంది. ఇప్పటికే దుర్గా అనే పాత్రలో లావుగా కనిపించిన సుధీర్ బాబు.. తాజాగా మధ్యవయసున్న డాన్ పాత్రకు సంబంధించిన లుక్‌లో దర్శనమిచ్చాడు.

Sudheer Babu Elder look: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలో చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే హంట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో.. ఇప్పుడు మరో సినిమాలో సందడి చేయనున్నాడు. అదే మామ మశ్చీంద్ర. ఈ సినిమాకు సంబంధించిన లుక్ కూడా ఇటీవలే విడుదైలంది. కొంచె బొద్దుగా ఇంతకు ముందెన్నడు సుధీర్ బాబు కనిపించని లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ లుక్‌తో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా మరో అప్డేట్‌తో ముందుకు వచ్చారు మేకర్స్. ఈ సినిమాలో సుధీర్ బాబు రెండో లుక్‌ను విడుదల చేశారు.

మామ మశ్చీంద్రలోని పరశురామ్ అనే మరో క్యారెక్టర్‌లో సుధీర్ బాబు నటిస్తున్నాడు. తాజాగా ఈ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. చూసేందుకు అదిరిపోయేలా కనిపించిన సుధీర్ బాబు ఆకట్టుకున్నారు. కాస్త మధ్య వయస్కుడిగా కనిపిస్తున్న పరశురామ్ పాత్రలో సుధీర్ బాబు స్టైలిష్‌గా కనిపించారు. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో కుర్చీలో స్టైల్‌గా కూర్చుని చేతిలో గన్‌తో అదరగొట్టాడు. చూస్తుంటే ఏదో డాన్ పాత్ర మాదిరిగా అనిపిస్తోంది.

ఈ సినిమాలు సుధీర్ బాబు మల్టీ షేడెడ్ క్యారెక్టర్‌లలో నటిస్తున్నాడు. ఇప్పటికే దుర్గ అనే పాత్ర లావుగా కనిపించాడు సుధీర్ బాబు. సుధీర్ బాబు లావుగా ఉండటమే కాకుండా డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అంతా విలక్షణంగా ఉంది. జీప్‌పై కూర్చున్న ఈ హీరో నోట్లో బంగారు గొలుసుతో ఎవరినో తీక్షణంగా చూస్తున్నట్లు కనిపించాడు. పొడవాటి జుట్టు, తేలికపాటి గడ్డంతో దర్శనమిచ్చాడు. తన లుక్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచాడు.

మామా మశ్చీంద్రా అనే ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోందీ చిత్రం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పీజీ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. సుధీర్ బాబు ఇందులో మల్టీ షేడెడ్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.

సంబంధిత కథనం

టాపిక్