సీరియల్ చూస్తూ దెయ్యాలైన భార్యలు.. మాతాజీగా మాటలు లేకుండా సమంత.. డిఫరెంట్ హారర్ కామెడీగా శుభం ట్రైలర్ రిలీజ్-subham trailer released and samantha special appearance as mataji to save husbands from wives who behaves like ghosts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  సీరియల్ చూస్తూ దెయ్యాలైన భార్యలు.. మాతాజీగా మాటలు లేకుండా సమంత.. డిఫరెంట్ హారర్ కామెడీగా శుభం ట్రైలర్ రిలీజ్

సీరియల్ చూస్తూ దెయ్యాలైన భార్యలు.. మాతాజీగా మాటలు లేకుండా సమంత.. డిఫరెంట్ హారర్ కామెడీగా శుభం ట్రైలర్ రిలీజ్

Sanjiv Kumar HT Telugu

సమంత రూత్ ప్రభు నిర్మించిన తొలి సినిమా శుభం. కామెడీ హారర్ సినిమాగా తెరకెక్కిన శుభం ట్రైలర్‌ను తాజాగా ఇవాళ రిలీజ్ చేశారు. ఇందులో భార్యలందరూ సీరియల్ చూస్తూ దెయ్యాలుగా మారిపోతారు. వారి నుంచి బయటపడటం కోసం మాత అయిన సమంత దగ్గరికి వెళ్లడం వంటి సీన్లతో డిఫరెంట్‌ కామెడీ థ్రిల్లర్‌గా శుభం ట్రైలర్ సాగింది.

శుభం ట్రైలర్ రిలీజ్

ార్ హీరోయిన్ సమంత వరుసపెట్టి సినిమాలతో అలరించింది. ఇప్పుడు నిర్మాతగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సమంత రూత్ ప్రభు నిర్మాతగా నిర్మించిన తొలి సినిమా శుభం. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై శుభం సినిమా తెరకెక్కింది.

శుభం ట్రైలర్ రిలీజ్

శుభం సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. మే 9న థియేటర్లలో శుభం మూవీ విడుదల కానుంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఆదివారం (ఏప్రిల్ 27) శుభం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

రాత్రి పూట సీరియల్ చూసి

ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా కామెడీతో శుభం ట్రైలర్‌ సాగింది. శుభం ట్రైలర్‌లోకి వెళితే.. మీ భార్యను కాఫీ ఎలా అడుగుతావ్ అని ఒకరిని మరో భర్త అడగడంతో స్టార్ట్ అవుతుంది. ఎంతో అణుకువుగా భర్త చెప్పింది చేసే భార్యలు రాత్రి పూట సీరియల్ చూస్తే విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.

దెయ్యాలుగా మారే భార్యలు

ఊర్లోని మహిళలంతా కూడా సీరియల్‌ను చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంటారు. సీరియల్ చూసి చూసి ఆఖరికి దెయ్యాలుగా మారిపోతారు. అలా దెయ్యం పట్టినట్టుగా మహిళలు ప్రవర్తిస్తుంటే.. వారి నుంచి తప్పించుకునేందుకు ఊర్లో పురుషులంతా అష్టకష్టాలు పడుతుంటారు.

మాతాజీగా సమంత

అలాంటి తరుణంలో మాతాజీగా సమంత స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ట్రైలర్‌ మీద మరింత ఇంట్రెస్ట్ కలిగించేలా చేశారు. ఏం మాట్లాడకుండా భర్తలు అడిగిన ప్రశ్నలకు సైగలతో సమాధానాలు చెబుతూ ట్రైలర్‌ను ఒక రేంజ్‌కు తీసుకెళ్లింది సమంత.

హారర్, కామెడీతో

శుభం ట్రైలర్‌ను చూస్తే ఈ చిత్రంలో హాస్యం, హారర్, ఉత్కంఠ, ఎమోషన్స్ ఇలా అన్ని రకాల అంశాల్ని జోడించినట్టుగా కనిపిస్తోంది. శుభం మే 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇక వివేక్ సాగర్ అందించిన బీజీఎమ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం ప్రధాన ఆకర్షణ కానుందని శుభం ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం