టీవీ సీరియళ్ల కాన్సెప్ట్‌తో హారర్ కామెడీ మూవీగా ‘శుభం’ క్యూరియాసిటీ కలిగించింది. ఈ చిత్రంతోనే స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారటంతో మరింత క్రేజ్ వచ్చింది. త్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ పతాకంపై ఈ మూవీని ఆమె ప్రొడ్యూజ్ చేశారు. హైప్‍తో గత శుక్రవారం మే 9న రిలీజైన ఈ తక్కువ బడ్జెట్ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం జోరు చూపింది. శుభం చిత్రం ఫస్ట్ వీకెండ్ మంచి వసూళ్లనే రాబట్టింది.
శుభం సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.5.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ విషయాన్ని త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. “శుభంపై ప్రేమ బలపడుతూనే ఉంది” అని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మూవీ రూ.5.25 కోట్ల గ్రాస్ దక్కించుకుందని పోస్టర్ తీసుకొచ్చింది.
ఈ లెక్కలను బట్టి చూస్తే ఫస్ట్ వీకెండ్‍లో శుభం చిత్రం బాగానే వసూళ్లను రాబట్టింది. అయితే, సోమవారమే ఈ మూవీకి అసలు పరీక్ష మొదలవుతుంది. వర్కింగ్ డే అయిన నేడు కలెక్షన్లలో బిగ్ డ్రాప్ కనిపిస్తే మూవీ జోరు కంటిన్యూ చేయడం కష్టమవుతుంది. స్టడీగా ఉంటే మంచి రన్ ఉంటుందని భావించవచ్చు. మరి మండే టెస్టును ఈ సినిమా పాస్ అవుతుందా అనేది కీలకంగా ఉంది. అలాగే, శ్రీవిష్ణు ‘సింగిల్’ మూవీ బలమైన పోటీగా ఉంది.
శుభం సినిమాను తక్కువ బడ్జెట్‍తోనే ప్రొడ్యూజ్ చేశారు సమంత. ఈ చిత్రానికి సుమారు రూ.3.5 కోట్లు ఖర్చైందని అంచనాలు ఉన్నాయి. థియేట్రికల్ బిజినెస్‍ను బట్టి చూస్తే రూ.8కోట్ల గ్రాస్ కలెక్షన్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. మరి ఆ మార్కును శుభం చేరుతుందా అనేది చూడాలి. నేడు సోమవారం ట్రెండ్‍తో ఇది తేలిపోతుంది.
శుభం చిత్రానికి సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేకుల దర్శకత్వం వహించారు. టీవీ సీరియళ్ల చూస్తూ భయానకంగా మారే మహిళల చుట్టూ ఈ సినిమా స్టోరీ ఉంటుంది. ఈ కథకు హారర్ టచ్ కూడా ఉంది. మహిళలు ఎందుకు అలా మారుతున్నారనేది మిస్టరీ ఇంట్రెస్టింగ్‍గా సాగుతుంది. కామెడీ ప్రధానంగా ఈ చిత్రాన్ని ప్రవీణ్ తెరకెక్కించారు.
శుభం సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రీయా కొంతం, చరణ్ పేరి, శ్రావణి లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. క్యామియో రోల్‍లో సమంత కనిపించారు. ఈ చిత్రంలో పాటలకు షోర్ పోలీస్ స్వరాలు అందించగా.. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు వివేక్ సాగర్. ఈ మూవీకి మృదుల్ సుజీత్ సేన్ సినిమాటోగ్రఫీ చేశారు.
సంబంధిత కథనం
టాపిక్