Prashanth Neel on Salaar: సలార్ కథ గురించి కీలక విషయాలు వెల్లడించిన ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్‍తో లింక్ అంశంపై కూడా స్పందన
Prashanth Neel on Salaar: సలార్ సినిమా గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కీలక విషయాలు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు. సలార్ మూవీ ముఖ్యమైన ఎమోషన్ ఏంటో రివీల్ చేశారు.
Prashanth Neel on Salaar: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్: పార్ట్ 1 సీజ్‍ఫైర్’ మూవీ కోసం సినీ ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 22న ఈ చిత్రం గ్రాండ్‍గా థియేటర్లలో రిలీజ్ కానుంది. డిసెంబర్ 1వ తేదీన సలార్ ట్రైలర్ రానుంది. ఈ ట్రైలర్‌కు కౌంట్‍డౌన్ మొదలైపోయంది. అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో సలార్ సినిమా గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కీలక విషయాలు వెల్లడించారు. స్టోరీ గురించి కాస్త చెప్పారు.
బద్ధ శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథే సలార్ అని డైెరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పేశారు. సలార్ సినిమాకు ఫ్రెండ్‍షిప్ ముఖ్యమైన ఎమోషన్ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “శత్రువుగా మారిన ఇద్దరు స్నేహితుల కథే సలార్. సలార్‌లో ఫ్రెండ్‍షిప్ కోర్ ఎమోషన్. సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్‌లో సగం కథే చెబుతాం. సలార్ మొత్తం కథను రెండు సినిమాలుగా చూపిస్తాం. మేం సృష్టించిన ప్రపంచాన్ని ట్రైలర్లో ప్రేక్షకులు చూస్తారు” అని ప్రశాంత్ నీల్ చెప్పారు. సలార్ ట్రైలర్ డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 7 గంటల 19 నిమిషాలకు రిలీజ్ కానుంది. అలాగే, సలార్‌తో కేజీఎఫ్‍కు లింక్ ఉందా అన్న ప్రశ్నకు కూడా ప్రశాంత్ నీల్ స్పందించారు.
కేజీఎఫ్, సలార్.. రెండు డిఫరెంట్ స్టోరీలు అని ప్రశాంత్ నీల్ స్పష్టతనిచ్చారు. సలార్‌కు కేజీఎఫ్‍తో లింక్ ఉండదన్నట్టుగా మాట్లాడారు. అలాగే, కేజీఎఫ్‍తో సలార్‌ను పోల్చకూడదని, డిఫరెంట్ ఎమోషన్స్, విభిన్నమైన స్టోరీ టెల్లింగ్ ఉంటుందని అన్నారు. తాను కేజీఎఫ్ కంటే ముందే సలార్ స్టోరీ రాసుకున్నానని ప్రశాంత్ నీల్ అన్నారు.
‘సలార్ పార్ట్-1: సీజ్‍ఫైర్’ సినిమా డిసెంబర్ 22వ తేదీన తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. షారుఖ్ ఖాన్ ‘డంకీ’, సలార్ బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి. హైవోల్టేజ్ గ్యాంగ్‍స్టర్ యాక్షన్ మూవీగా సలార్ రూపొందింది.
ఈ సినిమాలో సలార్‌గా ప్రభాస్, విలన్ వరదరాజ్ మన్నార్‌గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ కాగా.. జగపతి బాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రీయా రెడ్డి, రామచంద్ర రాజు కీలకపాత్రలు పోషించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.