ఓటీటీ స్పెషల్ మూవీస్ కు ఉండే క్రేేజే వేరు. ఆయా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కిడ్నాప్ అయిన పాపను వెతుక్కుంటూ వెళ్లే బ్రదర్స్ స్టోరీతో వచ్చిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. ఉత్కం రేపే ఎలిమెంట్స్ తో ఈ మూవీ ఇప్పటికే అదరగొడుతోంది.
కిడ్నాప్ అయిన పాప ను వెతికేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన బ్రదర్స్ కథతో వచ్చిన సినిమా ‘స్టోలెన్’. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ స్పెషల్ గా ఈ మూవీ వచ్చేసింది. ఈ రోజు (జూన్ 4) నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. ఇప్పటికే ఆడియన్స్ ను అలరిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది.
క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చేసిన స్టోలెన్ మూవీ కథ మొత్తం చంపా అనే పాపను వెతకడం చుట్టూ తిరుగుతోంది. గౌతమ్, రామన్ బ్రదర్స్. రైల్వే స్టేషన్ లో రామన్ ను పిక్ చేసుకోవడానికి గౌతమ్ తెల్లవారు జామునే వెయిట్ చేస్తుంటాడు. అదే స్టేషన్ లో చంపా అనే పాపను పట్టుకుని తల్లి జుంపా నిద్రపోతుంది. కానీ లేచి చూసే సరికి తన పాప కనిపించింది. అదే సమయంలో జుంపా పక్క నుంచి రామన్ వెళ్తాడు. దీంతో రామన్ పాపను కిడ్నాప్ చేశాడనే కేసులో ఇరుక్కుంటాడు.
బ్రదర్స్ ఇద్దరు కలిసి తల్లితో పాటు పాపను వెతికేందుకు బయల్దేరుతారు. ఈ క్రమంలో బ్రదర్స్ మధ్య మనస్పర్థలు వస్తాయి. అయినా పాపను వెతికేందుకు ప్రాణాలకు తెగిస్తారు. ఈ క్రమంలో తమ ప్రాణాల వరకూ వస్తోంది. చివరకు ఈ అన్నదమ్ములు ఆ పాపను కాపాడారా? తల్లికి అప్పజెప్పారా? అన్నదే కథ.
బ్రదర్స్ గా అభిషేక్ బెనర్జీ, శుభమ్ వర్ధన్ అదరగొట్టాడు. అయితే ఎక్కువ మార్కులు మాత్రం అభిషేక్ బెనర్జీకే పడ్డాయి. ఇంటెన్సివ్ ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్ లో అతని నటన వేరే లెవల్ లో ఉంది. మొదట జుంపాకు హెల్ప్ చేయకూడదనే క్యారెక్టర్ నుంచి చివరకు ఆ పాపను అతనే వెతికేలా మారే తీరు గొప్పగా ఉంది. ఈ థ్రిల్లర్ ను కరన్ తేప్ పాల్ డైరెక్ట్ చేశారు. అనురాగ్ కశ్యప్, కిరణ్ రావు, నిఖిల్ అద్వానీ, విక్రమాదిత్య నిర్మాతలుగా ఈ మూవీకి సపోర్ట్ గా నిలిచారు.
సంబంధిత కథనం