Worst TRP Ratings: టీవీల్లో చెత్త టీఆర్‌పీ రేటింగ్స్ తెచ్చుకున్న స్టార్ హీరో సినిమాలు.. అతి తక్కువగా ఆ హిట్ మూవీకి!-stars low trp ratings in television ram charan vinaya vidheya rama to chiranjeevi waltari veerayya worst trp ratings ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Worst Trp Ratings: టీవీల్లో చెత్త టీఆర్‌పీ రేటింగ్స్ తెచ్చుకున్న స్టార్ హీరో సినిమాలు.. అతి తక్కువగా ఆ హిట్ మూవీకి!

Worst TRP Ratings: టీవీల్లో చెత్త టీఆర్‌పీ రేటింగ్స్ తెచ్చుకున్న స్టార్ హీరో సినిమాలు.. అతి తక్కువగా ఆ హిట్ మూవీకి!

Sanjiv Kumar HT Telugu
Apr 03, 2024 01:22 PM IST

Worst TRP Ratings In Television Telugu: స్టార్ హీరోల సినిమాలు థియేటర్ల వద్ద ఎలాంటి విజయం సాధించిన టెలివిజన్‌లో మాత్రం ఫలితం మరోలా ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచిన స్టార్ హీరో మూవీ బుల్లితెరపై అతి తక్కువ టీఆర్‌పీ తెచ్చుకుని షాక్ ఇచ్చింది.

టీవీల్లో చెత్త టీఆర్‌పీ రేటింగ్స్ తెచ్చుకున్న స్టార్ హీరో సినిమాలు.. అతి తక్కువగా ఆ హిట్ మూవీకి!
టీవీల్లో చెత్త టీఆర్‌పీ రేటింగ్స్ తెచ్చుకున్న స్టార్ హీరో సినిమాలు.. అతి తక్కువగా ఆ హిట్ మూవీకి!

Stars Low TRP Ratings: అగ్ర హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ కొట్టినా, డిజాస్టర్ అయిన బుల్లితెరపై వాటి రిజల్ట్ మరోలా ఉంటుందని కొన్ని టీఆర్‌పీ రేటింగ్స్ చూస్తే అర్థం అవుతోంది. పేరుకు స్టార్ హీరోలు అయిన కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌లతో సతమతం కావాల్సిందే. అలాగే వాటి ఎఫెక్ట్ టెలివిజన్‌ విజయంపై కూడా ఉంటుంది. అయితే, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన స్టార్ హీరో సినిమా బుల్లితెరపై అతి తక్కువ టీఆర్‌పీ రేటింగ్ తెచ్చుకుంది. దాంతోపాటు చెత్త టీఆర్‌పీ రేటింగ్స్ సాధించిన స్టార్ హీరో చిత్రాలపై లుక్కేద్దాం.

yearly horoscope entry point

వినయ విధేయ రామ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇక టెలివిజన్‌లో కూడా అంతే ఎక్కువ చెత్త టీఆర్‌పీ రేటింగ్ తెచ్చుకుంది. లో వేస్ట్‌లో హయ్యెస్ట్ రేటింగ్‌ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది వినయ విధేయ రామ. ఈ సినిమా బుల్లితెరపై మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 8.1 రేటింగ్ తెచ్చుకుంది. దాంతో బాక్సాఫీస్ వద్దే కాకుండా టెలివిజన్ ఇండస్ట్రీలో కూడా ప్లాప్‌గా నిలిచింది.

బ్రహ్మోత్సవం

సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలా కాంబినేషన్‌లో రెండోసారి వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా థియేటర్లలో ప్రేక్షకులను చాలా నిరాశపరిచింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అలాగే టెలివిజన్‌లో మొదటిసారి ప్రసారం అయినప్పుడు బ్రహ్మోత్సవం సినిమాకు 7.52 రేటింగ్ వచ్చింది. అలాగే మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీకి మరింత తక్కువగా 6.7 రేటింగ్‌ వచ్చింది.

సరైనోడు

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. కానీ, టెలివిజన్‌లో మొదటి సారి ప్రసారం అయినప్పుడు సరైనోడు సినిమాకు 6.2 రేటింగ్ వచ్చింది. థియేటర్లలో ప్లాప్ సినిమాలకు తక్కువ రేటింగ్ రావడం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ, హిట్ కొట్టిన మూవీస్ సైతం చెత్త టీఆర్‌పీ రేటింగ్ తెచ్చుకోవడం షాక్‌కు గురి చేసింది.

అజ్ఞాతవాసి-సాహో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాను తొలిసారి టీవీలో వేసిప్పుడు 6.1 టీఆర్‌పీ రేటింగ్ నమోదు చేసుకుంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాల్లో సాహో ఒకటి. బాహుబలి రెండు సినిమాల తర్వాత విడుదలైన సాహో మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా నిరాశపరిచింది. కలెక్షన్స్ పరంగా బాగానే వసూలు చేసిన టాక్ పరంగా ప్లాప్ అయింది. అలాంటి సాహో మూవీ ఫస్ట్ టైమ్ టీవీలో టెలికాస్ట్ చేసినప్పుడు 5.81 టీఆర్‌పీ రేటింగ్ తెచ్చుకుంది.

వాల్తేరు వీరయ్య

వీటన్నికంటే అతి తక్కువగా టీఆర్‌పీ రేటింగ్ సాధించింది మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ. మొదటిసారి టెలివిజన్‌లో ప్రసారం చేసిన వాల్తేరు వీరయ్య సినిమాకు 5.14 రేటింగ్ మాత్రమే తెచ్చుకుంది. దీంతో లో వేస్ట్‌లో అతి తక్కువ రేటింగ్ సాధించిన సినిమాగా చిరంజీవి సినిమా నిలిచింది. అయితే బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

స్టార్ హీరోలకు హిట్టు ఫట్టు అనేది కామన్. కానీ, మంచి హిట్ సాధించిన సినిమా కూడా అతి తక్కువ టీఆర్‌పీ రేటింగ్ తెచ్చుకోవడం విచారకరం అని చెప్పాలి. కాగా డిజాస్టర్ మూవీ ఆచార్యకు 6.3 రావడం గమనార్హం.

Whats_app_banner