మాజీ ప్ర‌ధానితో స్టార్ పాప్ సింగ‌ర్ రొమాన్స్‌- ప‌డ‌వ‌లో హగ్‌లు, కిస్‌లు- హాట్ బ్యూటీ ఫొటోలు వైర‌ల్‌- షాక్‌లో ఫ్యాన్స్-star pop singer katy perry romance with canada ex pm justin trudeau hugs and kisses on yacht ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మాజీ ప్ర‌ధానితో స్టార్ పాప్ సింగ‌ర్ రొమాన్స్‌- ప‌డ‌వ‌లో హగ్‌లు, కిస్‌లు- హాట్ బ్యూటీ ఫొటోలు వైర‌ల్‌- షాక్‌లో ఫ్యాన్స్

మాజీ ప్ర‌ధానితో స్టార్ పాప్ సింగ‌ర్ రొమాన్స్‌- ప‌డ‌వ‌లో హగ్‌లు, కిస్‌లు- హాట్ బ్యూటీ ఫొటోలు వైర‌ల్‌- షాక్‌లో ఫ్యాన్స్

స్టార్ పాప్ సింగర్ కేటీ పెర్రీ, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో రొమాన్స్ ఫొటోలు వైరల్ గా మారాయి. పడవలో ఈ జంట హగ్, కిస్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కేటీ పెర్రీ, ట్రూడో రొమాన్స్ ఫొటోలు (x/ShadowofEzra)

షాకింగ్.. కెనడా పాప్ స్టార్ కేటీ పెర్రీ, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో రొమాన్స్ సంచలనంగా మారింది. వీరిద్దరూ ఒక పడవలో విహరిస్తూ తమ ప్రేమను చాటుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారు వెకేషన్‌కు వెళ్లినట్లు కనిపిస్తోంది. జస్టిన్ ట్రూడో, కేటీ పెర్రీల వైరల్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

కేటీ పెర్రీ రొమాన్స్

'ది డైలీ మెయిల్ యూకే' షేర్ చేసిన ఈ చిత్రాలలో 40 ఏళ్ల కేటీ పెర్రీ.. జస్టిన్ ట్రూడోను దగ్గరగా హత్తుకుని కనిపించింది. మసకగా ఉన్న ఈ చిత్రాలలో ఆమె నల్లటి స్విమ్‌సూట్‌లో ఉండగా, కెనడా 23వ ప్రధాని అయిన ట్రూడో షర్ట్‌ లేకుండా డెనిమ్ ప్యాంట్‌తో ఉన్నారు. ఒక ఫోటోలో ఇద్దరూ చాలా సన్నిహితంగా రొమాన్స్ చేస్తూ కనిపించారు. కిస్ చేసుకుంటూ ఆప్యాయంగా కనిపించారు. మరొక ఫోటోలో ట్రూడో, కేటీ పెర్రీ వైపు వంగి ఉన్నారు. ఈ ఫోటోలు సెప్టెంబర్‌లో కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా తీరంలో తీసినట్లు సమాచారం.

చీ.. ఏంటిది?

జస్టిన్ ట్రూడో, కేటీ పెర్రీ వైరల్ చిత్రాలు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. వీటిపై స్పందిస్తున్న నెటిజన్లు ఈ కొత్త జంట గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక యూజర్ వారి వైరల్ చిత్రం కామెంట్ సెక్షన్‌లో ఇలా రాశారు.. “కేటీ, జస్టిన్? మేం అస్సలు అడగని కాంబో ఇది, కానీ చూడకుండా ఉండలేకపోతున్నాం” అని పోస్టు చేశాడు. “ఛీ.. ఏంటిది” అని మరొకరు కామెంట్ చేశారు.

షర్ట్ లేకుండా

“పడవలో షర్ట్‌ లేకుండా జీన్స్ వేసుకోవడం అన్నింటికంటే ఆందోళన కలిగించే విషయం” అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. “ఆమెకు ఓర్లాండో బ్లూమ్ ఉండేవాడు. ట్రూడో చాలా పెద్ద డౌన్‌గ్రేడ్” అని మరొకరు రాశారు. ఇదిలా ఉండగా కొందరు పాప్ సింగర్‌ కేటీ పెర్రీకి మద్దతుగా నిలిచారు. ఒకరు ఏమో “కేటీ పెర్రీ, జస్టిన్ ట్రూడో జంట బాగుంది. ఎలా అని నన్ను అడగకండి” అన్నారు. మరొకరు “ఆమెను సంతోషంగా ఉండనివ్వండి. కేటీ పెర్రీ, ట్రూడో కలిసి సంతోషంగా ఉన్నారు” అని జోడించారు. ఒక నెటిజన్ కూడా “ఆమె ఓర్లాండో బ్లూమ్‌తో ఉందని నేను ఎప్పుడూ నమ్మలేకపోయాను, ఇప్పుడు ఇది.. ఆమెకు ఎప్పుడూ ఊహించని భాగస్వాములు దొరుకుతారు” అని రాశారు.

ముద్దులు పెట్టుకోవడం

ఒక ప్రత్యక్ష సాక్షి 'ది డైలీ మెయిల్'తో మాట్లాడుతూ “ఆమె తన పడవను తిమింగలాలను చూసే ఒక చిన్న పబ్లిక్ బోట్ పక్కకు తీసుకువచ్చింది. ఆ తర్వాత వారు ముద్దులు పెట్టుకోవడం ప్రారంభించారు” అని చెప్పారు. "అతని చేతిపై ఉన్న టాటూ చూసే వరకు ఆమె ఎవరితో ఉందో నేను గ్రహించలేదు. అది జస్టిన్ ట్రూడో అని వెంటనే అర్థమైంది” అని వారు తెలిపారు. ఈ చిత్రాలు, వారి డేటింగ్ ఊహాగానాలపై జస్టిన్ ట్రూడో, కేటీ పెర్రీ ఇంకా స్పందించలేదు.

జస్టిన్ ట్రూడో భార్యకు ఏమైంది?

జస్టిన్ ట్రూడో 2023లో తన భార్య సోఫీ గ్రెగోయిర్ నుండి విడిపోయారు. జూలైలో మాంట్రియల్‌లో ఒక ప్రైవేట్ డిన్నర్ డేట్‌లో కనిపించిన తర్వాత ట్రూడో, పెర్రీల ప్రేమాయణంపై పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాత వారు మౌంట్ రాయల్ పార్క్‌లో కలిసి నడిచారు. తర్వాత కెనడాలో జరిగిన పెర్రీ 'లైఫ్‌టైమ్స్' టూర్‌కు ట్రూడో హాజరయ్యారు. అయితే ఆగస్టు నాటికి వారి మధ్య ప్రేమ బంధం చల్లారిపోయిందని వార్తలు వచ్చాయి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం