Star Maa Ugadi Special: తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చేసిది. బుధవారం (మార్చి 22) తెలుగు వాళ్లంతా శోభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. దీంతో తెలుగు టీవీ ఛానెళ్లు ఎప్పటిలాగే ఉగాది స్పెషల్ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఓవైపు థియేటర్లు, ఓటీటీల్లో కొత్త సినిమాలు రానుండగా.. టీవీ ఛానెల్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు సిద్ధమయ్యాయి.
ఇప్పటికే జీ తెలుగులో మాస్ ధమాకా అవార్డ్స్ పేరుతో ఆదివారం ఓ కార్యక్రమం ప్రసారమైంది. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ బుధవారం కూడా మరోసారి రానుంది. ఇక స్టార్ మా ఛానెల్ లో మా ఇంటి పండగ పేరుతో మరో కార్యక్రమం రానుంది. మాస్ మహారాజ రవితేజ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడు. ఈ ప్రోగ్రామ్ ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది.
తాజాగా మంగళవారం (మార్చి 21) కూడా తన అధికారిక ట్విటర్ అకౌంట్లో ఈ ప్రోగ్రామ్ గురించి ట్వీట్లు చేసింది. రవితేజ డైలాగులే కాదు.. డ్యాన్స్ కూడా ఇరగదీసాడంటూ స్టార్ మా ఈ ప్రోగ్రామ్ పై ఆసక్తిని మరింత పెంచింది. ఈ మా ఇంటి పండగ కార్యక్రమం ఉగాది నాడు (మార్చి 22) మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది.
ఈ ఇద్దరు స్టార్ హీరోలే కాదు.. ఈ మధ్యే స్వర్గస్తులైన డైరెక్టర్ కే విశ్వనాథ్ కు కూడా ఇదే కార్యక్రమం ద్వారా నివాళులర్పించనున్నారు. ఇక నటరాజ్ మాస్టర్ కాంతారా అవతారం స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది.
ఈ ఉగాదిని మా ఇంటి పండగతో మునుపెన్నడూ చేసుకోని రీతిలో జరుపుకోండి.. 12 కుటుంబాలు, ఆరు రుచులు, ఇద్దరు స్పెషల్ గెస్టులతో మా ఇంటి పండగ జరుపుకోండి.. మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని వస్తున్నారంటూ ఈ ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది.
సంబంధిత కథనం