Star Maa TV Shows TRP Ratings: టీవీ షోలలోనూ స్టార్ మా హవా.. ఈటీవీని వెనక్కి నెట్టి.. ఆ సెలబ్రిటీ గేమ్ షోనే టాప్-star maa tv shows trp ratings ishmart jodi on top etv shows jabardast family stars sridevi drama company ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Star Maa Tv Shows Trp Ratings: టీవీ షోలలోనూ స్టార్ మా హవా.. ఈటీవీని వెనక్కి నెట్టి.. ఆ సెలబ్రిటీ గేమ్ షోనే టాప్

Star Maa TV Shows TRP Ratings: టీవీ షోలలోనూ స్టార్ మా హవా.. ఈటీవీని వెనక్కి నెట్టి.. ఆ సెలబ్రిటీ గేమ్ షోనే టాప్

Hari Prasad S HT Telugu

Star Maa TV Shows TRP Ratings: స్టార్ మాతోపాటు ఇతర తెలుగు టీవీ ఛానెల్స్ లో వచ్చే ప్రోగ్రామ్స్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఈసారి కూడా స్టార్ షోలే టాప్ లో ఉండటం విశేషం.

టీవీ షోలలోనూ స్టార్ మా హవా.. ఈటీవీని వెనక్కి నెట్టి.. ఆ సెలబ్రిటీ గేమ్ షోనే టాప్

Star Maa TV Shows TRP Ratings: స్టార్ మా అటు సీరియల్స్, ఇటు ప్రోగ్రామ్స్ లోనూ దూసుకెళ్తోంది. తాజాగా 8వ వారానికి సంబంధించి రిలీజైన రేటింగ్స్ లో ఈటీవీ షోలను వెనక్కి నెట్టి టాప్ లో స్టార్ మా షోలే ఉన్నాయి. మరి ఈ లేటెస్ట్ రేటింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

స్టార్ మా ప్రోగ్రామ్స్ టీఆర్పీ రేటింగ్స్

స్టార్ మా ఛానెల్లో వచ్చే ఇస్మార్ట్ జోడీ సెలబ్రిటీ గేమ్ షో తాజా రేటింగ్స్ లో తొలి స్థానంలో నిలవడం విశేషం. తాజాగా స్టార్ మాలో మూడో సీజన్ నడుస్తోంది. ఇప్పటికే 22 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రోగ్రామ్ తాజా రేటింగ్స్ లో అర్బన్, రూరల్ కలిపి 4.34తో తొలి స్థానంలో కొనసాగుతోంది. ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో కొన్ని సెలబ్రిటీ జోడీలను తీసుకొచ్చి వాళ్లతో సరదా గేమ్స్ ఆడిస్తుంటారు. ప్రతివారం ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి.

ఇక రెండో స్థానంలోనూ స్టార్ మాలోనే వచ్చే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఉంది. శ్రీముఖి హోస్ట్ చేసే ఈ షోకి తాజాగా 3.55 రేటింగ్ నమోదైంది. ప్రతి ఆదివారం ఉదయం ఈ షో టెలికాస్ట్ అవుతుంది. స్టార్ మా ఛానెల్ కు చెందిన సెలబ్రిటీలు ఇందులో సందడి చేస్తుంటారు.

మిగతావన్నీ ఈటీవీ షోలే

తొలి రెండు స్థానాలు వదిలేస్తే.. మిగతావాన్నీ ఈటీవీకి చెందిన షోలే ఉండటం విశేషం. మొదటి నుంచీ ప్రోగ్రామ్స్ విషయంలో ఈటీవీ దూకుడుగా ఉంటుంది. మూడోస్థానంలో శ్రీదేవి డ్రామా కంపెనీ 2.67 రేటింగ్ తో ఉంది. నాలుగో స్థానంలో ఎన్నో ఏళ్లుగా ఈటీవీలో వస్తున్న జబర్దస్త్ కామెడీ షో నిలిచింది. ఈ ప్రోగ్రామ్ కి తాజాగా 2.41 రేటింగ్ నమోదైంది.

ఐదో స్థానంలో 2.32 రేటింగ్ తో సుధీర్ హోస్ట్ చేసే ఫ్యామిలీ స్టార్స్ ప్రోగ్రామ్ ఉంది. ఈ ఛానెల్లో వచ్చే డ్యాన్స్ షో ఢీ కి 2.10 రేటింగ్ నమోదవగా.. సుమ అడ్డాకు 1.66 రేటింగ్ వచ్చింది. పాటల ప్రోగ్రాం పాడుతా తీయగా 1.64తో తర్వాతి స్థానంలో ఉంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం