Star Maa: స్టార్ మాలో సంచలనం.. 16 మంది సెలబ్రిటీలు, ఇద్దరు స్టార్ లీడర్స్‌తో కొత్త సీజన్.. బ్రహ్మముడి నుంచి ఇద్దరు!-star maa tv show kiraak boys khiladi girls season 2 tv premiere date brahmamudi serial maanas hamida anasuya sreemukhi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Star Maa: స్టార్ మాలో సంచలనం.. 16 మంది సెలబ్రిటీలు, ఇద్దరు స్టార్ లీడర్స్‌తో కొత్త సీజన్.. బ్రహ్మముడి నుంచి ఇద్దరు!

Star Maa: స్టార్ మాలో సంచలనం.. 16 మంది సెలబ్రిటీలు, ఇద్దరు స్టార్ లీడర్స్‌తో కొత్త సీజన్.. బ్రహ్మముడి నుంచి ఇద్దరు!

Sanjiv Kumar HT Telugu

Star Maa Kiraak Boys Khiladi Girls Season 2 TV Premiere: స్టార్ మా ఛానెల్‌లో సక్సెస్‌ఫుల్ టీవీ షో కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ 2 ప్రారంభం కానుంది. 16 మంది సెలబ్రిటీలతో ఆడే ఈ రియాలిటీ షోలో బ్రహ్మముడి సీరియల్ నుంచే ఇద్దరు యాక్టర్స్ పాల్గొననున్నారు. మరి ఆ పూర్తి వివరాల్లోకి వెళితే..!

స్టార్ మాలో సంచలనం.. 16 మంది సెలబ్రిటీలు, ఇద్దరు స్టార్ లీడర్స్‌తో కొత్త సీజన్.. బ్రహ్మముడి నుంచి ఇద్దరు!

Star Maa Kiraak Boys Khiladi Girls Season 2 TV Premiere: పదహారు మంది సెలెబ్రిటీలు.. ఇద్దరు స్టార్ లీడర్స్.. ఒక ఎనర్జిటిక్ ప్రేజెంటర్.. ఒక సక్సెస్‌ఫుల్ ఫార్మాట్.. గెలవాలనే పట్టుదల.. ఓటమిని గెలుపుగా మలుచుకోవాలనే తపన.. ఒకే వేదికపైన ప్రేక్షకులకు వినోదం అందించడానికి ప్రేక్షకుల ముందుకు వస్తే.. ?

మరో సంచలనం

ఆ వేదిక పేరు, ఆ వేడుక పేరు "కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్". ఇదివరకు ఈ షో ఎంతో సక్సెస్‌ఫుల్ అయింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రెండో సీజన్‌ను తీసుకురానుంది స్టార్ మా. దీంతో స్టార్ మాలో మరో సంచలనం జరగనుంది. స్టార్ మా అందిచనున్న సరికొత్త షో కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ సీజన్‌ 2లో ఇరు జట్లు హోరా హోరీగా పోటా పోటీగా తలపడబోతున్నాయి.

ఇది అమ్మాయిలకీ అబ్బాయిలకీ మధ్య ఇంటరెస్టింగ్ వైల్డ్ ఫైర్.. తగ్గేదేలే అని పోటీ పడుతున్నారు. సినిమా, టీవీ రంగాల్లో తమదైన ముద్ర వేసిన సెలెబ్రిటీలు ఈ షో లో రెండు టీమ్స్‌గా ఓ ఆట ఆడబోతున్నారు. అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు ఛాలెంజెస్‌తో ఒకరిని మించి మరొకరు సత్తా చూపించడానికి రెడీ ఆవుతున్నారు.

స్పెషల్ టాలెంట్‌తో

గెలుపు కోసం ఎత్తులు, పై ఎత్తులతో ప్రేక్షకులను అలరించడానికి అన్ని అస్త్రాలు సమకూర్చుకుంటున్నారు. ఈ షో లో పాల్గొంటున్న ప్రతి కంటెస్టెంట్ ఒక్కో స్పెషల్ టాలెంట్‌తో ఈ షోకి వస్తున్నారు. "ఎప్పటికీ.. నో కాంప్రమైజ్ " అనే యాటిట్యూడ్‌తో ప్రతిఒక్కరు ఎదురు టీమ్‌తో తలపడనున్నారు.

స్మాల్ స్క్రీన్ సంచలనం శ్రీముఖి ఎనర్జిటిక్‌గా ఈ రెండు టీముల సమరాన్ని నడిపించనుంది. ఆర్టిస్టులను, సెలబ్రిటీలను డీల్ చేయడంలో ఎంతో అద్భుతమైన సమయస్ఫూర్తి తో వ్యవహరించే శ్రీముఖి 16 మంది కంటెస్టెంట్స్‌ని, ఇద్దరు లీడర్స్‌ని బాలెన్స్ చేయనుంది. ఈ షో లో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ "కిరాక్ బాయ్స్" తరఫున లీడ్ చేస్తున్నారు.

ఎలాగైన కప్పు కొట్టాలంటూ

మరోవైపు.. ప్రెజెంటర్‌గా, నటిగా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న అనసూయ "కిలాడి గర్ల్స్"కి ప్రతినిధిగా ఉంటున్నారు. ఒకసారి గెలిచిన ఆనందంలో, దాన్ని ఈ సారి కూడా రిపీట్ చేద్దాం అనుకుంటున్న "కిరాక్ బాయ్స్" ఓ వైపు.. ఫస్ట్ సీజన్ ఓడిపోయిన అవమానంతో ఈ సీజన్ ఎలాగైనా కొట్టాలి అనే పట్టుదలతో రగిలిపోతున్న "కిలాడి గర్ల్స్" మరోవైపు పోటీ పడేందుకు రెడీగా ఉన్నారు.

ఈ ఇరు జట్ల మధ్య పోటీ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఇక కిరాక్ బాయ్స్‌గా ఈ షోలో ప్రేక్షకుల ముందుకు బ్రహ్మముడి మానస్, కాస్కో నిఖిల్, బంచిక్ బబ్లూ, పృథ్వి, శివ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, దిలీప్, సాకేత్ రానున్నారు.

బిగ్ బాస్‌తో పేరు

అలాగే, . కిలాడి గర్ల్స్‌గా పోటీ - బ్రహ్మముడి హమీదా, రోహిణి, బోల్డ్ బ్యూటి తేజస్విని మదివాడ, సుష్మిత, లాస్య, శ్రీ సత్య, దేబ్ జానీ, ఐశ్వర్య పోటీ పడనున్నారు. ఇలా 16 మంది సెలబ్రిటీలు ఒకే వేదికపై చేయబోతున్న సందడి, సంబరం మార్చి 29న ప్రారంభం కానుంది. శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో కిర్రాక్ బాయ్స్-కిలాడీ గర్ల్స్ సీజన్ 2 ప్రసారం కానుంది.

అయితే, ఈ షోకి బిగ్ బాస్ ద్వారా పేరు తెచ్చుకున్న ఇద్దరు మానస్, హమీదా బ్రహ్మముడి సీరియల్‌లో మంచి నటన కనబర్చారు. ప్రస్తుతం మానస్ ఇంకా బ్రహ్మముడిలో కొనసాగగా.. రీసెంట్‌గానే హమీదా ఖతూన్ వైదొలిగింది. ఇక డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2లో పాల్గొన్న మానస్ కూడా రీసెంట్‌గానే ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు కిర్రాక్ బాయ్స్-కిలాడీ గర్ల్స్ సీజన్ 2లో అలరించనున్నాడు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం