Guppedantha Manasu Farewell Party: గుప్పెడంత మ‌న‌సు ఫేర్‌వెల్ పార్టీ ఎప్పుడంటే? - స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా జ‌గ‌తి-star maa shares guppedantha manasu serial farewell party promo and telecast details jyothi rai ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Farewell Party: గుప్పెడంత మ‌న‌సు ఫేర్‌వెల్ పార్టీ ఎప్పుడంటే? - స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా జ‌గ‌తి

Guppedantha Manasu Farewell Party: గుప్పెడంత మ‌న‌సు ఫేర్‌వెల్ పార్టీ ఎప్పుడంటే? - స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా జ‌గ‌తి

Nelki Naresh Kumar HT Telugu
Aug 29, 2024 02:55 PM IST

Guppedantha Manasu Farewell Party: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ మ‌రో రెండు రోజుల్లో ముగియ‌నుంది. రిషి, వ‌సుధార‌తో పాటు ఈ సీరియ‌ల్‌లోని యాక్ట‌ర్స్ అంద‌రూ క‌లిసి ఓ ఫేర్‌వెల్ పార్టీని ఏర్పాటుచేసుకున్నారు. ఈ ఫేర్‌వెల్ పార్టీ తాలూకు ప్రోమోను స్టార్ మా అభిమానుల‌తో పంచుకున్న‌ది.

గుప్పెడంత మ‌న‌సు ఫేర్‌వెల్ పార్టీ
గుప్పెడంత మ‌న‌సు ఫేర్‌వెల్ పార్టీ

Guppedantha Manasu Farewell Party: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ మ‌రో రెండు రోజుల్లో ముగియ‌నుంది. ఆగ‌స్ట్ 31 ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ లాస్ట్ డేట్ అని స‌మాచారం. శ‌నివారం నాటితో గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు మేక‌ర్స్ ఎండ్‌కార్డ్ వేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అర్థాంత‌రంగా సీరియ‌ల్‌ను ముగించ‌డం కాకుండా ఫ్యాన్స్ సాటిస్‌ఫై అయ్యేలా ఓ కన్వీన్సింగ్ క్లైమాక్స్‌తో సీరియ‌ల్‌ను ముగించే దిశ‌గా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్లాన్ చేస్తోన్నారు.

ఒక్క‌రు కాదు...ఇద్ద‌రు...

జ‌గ‌తికి ఒక్క కొడుకు కాదు...ఇద్ద‌రు అంటూ వాళ్లే...రిషి, మ‌ను అంటూ కొత్త ట్విస్ట్‌ను రివీల్ చేశారు. ఇన్నాళ్లును మ‌నును అనుప‌మ కొడుకుగా చూపిస్తూ వ‌చ్చారు. అలాగే ఎండ్‌చేస్తే మ‌హేంద్ర‌, అనుప‌మ‌కు మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉన్న‌ట్లుగా నెగెటివ్ క్లైమాక్స్‌తో సీరియ‌ల్‌ ఎండ్ అయ్యే అవ‌కాశం ఉండేది. అలా కాకుండా చిన్న ట్విస్ట్‌తో ఆడియెన్స్‌ను మేక‌ర్స్ స‌ర్‌ప్రైజ్ చేశారు.

రెండు రోజుల్లో...

మ‌ను క‌న్న త‌ల్లిదండ్రులు ఎవ‌రు, రంగా, రిషి వేర్వేరా ఒక్క‌రేనా... ఇలా చాలా మ‌లుపుల‌కు ఆన్స‌ర్ ఇస్తూ వ‌చ్చారు. త‌న లైఫ్‌లో ఉన్న విల‌న్స్ ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌టికే రిషికి తెలిసిపోయింది. వారికి స‌రైన బుద్ది చెప్ప‌డం ఒక్క‌టే బ్యాలెన్స్‌గా ఉంది. శుక్ర‌, శ‌నివారాల్లో ఆ త‌తంగాన్ని చూపించి సీరియ‌ల్‌కు శుభం కార్డు వేయడం ఖాయంగానే క‌నిపిస్తోంది.

ఫేర్‌వెల్ పార్టీ...

గుప్పెడంత మ‌న‌సు ముగుస్తున్న సంద‌ర్భంగా ఈ సీరియ‌ల్‌లో న‌టించిన యాక్ట‌ర్స్ అంద‌రూ క‌లిసి ఫేర్‌వెల్ పార్టీని ఏర్పాటుచేసుకున్నారు. ఆదివారం స్టార్‌మా ప‌రివారం స్టార్స్ వార్స్‌ ఎపిసోడ్‌లో భాగంగానే ఈ ఫేర్‌వెల్ పార్టీ జ‌రుగ‌నుంది. గుప్పెడంత మ‌న‌సు ఫేర్‌వెల్ పార్టీ తాలూకు ప్రోమోను స్టార్ మా పంచుకున్న‌ది. ఆదివారం ఉద‌యం ప‌ద‌కొండు గంట‌ల‌కు గుప్పెడంత మ‌న‌సు ఫేర్‌వెల్ పార్టీ ఎపిసోడ్ టెలికాస్ట్ కానున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

రిషిని మిస్స‌వుతున్నాం...

ఇక‌పై మిమ్మ‌ల్ని ఎంత మిస్స‌వుతాం అని యాంక‌ర్ శ్రీముఖి అడ‌గ్గానే...న‌న్ను మిస్స‌వుతారా...రిషిని మిస్స‌వుతారా అంటూ వ‌సుధార ఆమెపై సెటైర్ వేసింది. లేడీస్ అంద‌రూ రిషిని, బాయ్స్ అంద‌రూ వ‌సును మిస్స‌వుతాం అంటూ శ్రీముఖి స‌ర‌దాగా ఆన్స‌ర్ ఇచ్చింది. ఆవిడ లేకుండా ఉంటుంది వెలితి...వ‌స్తుంది జ‌గ‌తి అంటూ శ్రీముఖి అనౌన్స్ చేయ‌గానే జ‌గ‌తి స్టైజ్‌పైకి ఎంట్రీ ఇచ్చింది. ఫ్యామిలీలా అంద‌రి మ‌ధ్య మంచి బాండింగ్ ఉంద‌ని జ‌గ‌తి అన్న‌ది.

సీరియ‌ల్ జ్ఞాప‌కాల్ని..

ఈ ఫేర్‌వెల్ పార్టీలో రిషి, వ‌సుధార‌తో పాటు మిగిలియ‌న యాక్ట‌ర్స్ అంద‌రూ త‌మ ఆట‌పాట‌ల‌తో సంద‌డిచేశారు. సీరియ‌ల్ జ్ఞాప‌కాల్ని అభిమానుల‌తో పంచుకున్న‌ట్లుగా ఈ ప్రోమోలో చూపించారు.

బిగ్‌బాస్ 8 తెలుగు సెప్టెంబ‌ర్ 1 నుంచి మొద‌లుకానుంది. బిగ్‌బాస్ టైలికాస్ట్ టైమింగ్స్ కోస‌మే గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌ను మేక‌ర్స్ అర్ధాంత‌రంగా ముగుస్తున్న‌ట్లు స‌మాచారం.

ముఖేష్ గౌడ‌, ర‌క్షా గౌడ‌

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో రిషి పాత్ర‌లో ముఖేష్ గౌడ న‌టించాడు. వ‌సుధార‌గా ర‌క్షా గౌడ క‌నిపించింది. రిషిధార‌లుగా వీరిద్ద‌రు త‌మ ల‌వ్‌స్టోరీతో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నారు. సాయికిర‌ణ్‌, జ్యోతిరాయ్‌, సురేష్‌బాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ముఖేష్ గౌడ‌, ర‌క్షా గౌడ కాంబినేష‌న్‌లో మ‌రో కొత్త సీరియ‌ల్‌ను స్టార్ మా ప్లాన్ చేస్తోన్న‌ట్లు స‌మాచారం.