Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్.. మళ్లీ రెండో స్థానం దక్కించుకున్న ఆ సీరియల్..
Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు ఛానెల్స్ లోని టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. రెండో స్థానం కోసం గట్టి పోటీ నెలకొన్ని నేపథ్యంలో ప్రతి వారం ఈ స్థానంలో మార్పులు జరుగుతూనే ఉండటం విశేషం.

Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ ఈ ఏడాది 9వ వారం రేటింగ్స్ లోనూ సత్తా చాటాయి. టాప్ 6లో అన్నీ ఆ ఛానెల్ సీరియల్సే ఉన్నాయి. అయితే ఈ వారం రెండోస్థానం కోసం హోరాహోరీ పోటీ నెలకొనగా.. మరోసారి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
స్టార్ మా ఛానెల్ సీరియల్స్ విషయానికి వస్తే.. 9వ వారంలోనూ కార్తీకదీపం 2 సీరియల్ తొలి స్థానంలోనే కొనసాగుతోంది. ఈ సీరియల్ కు తాజాగా అర్బన్, రూరల్ కలిపి 13.29 రేటింగ్ నమోదైంది. ఇక రెండో స్థానంలో గుండె నిండా గుడి గంటలు నిలిచింది. ఈ సీరియల్ కు తాజా రేటింగ్స్ లో 12.21 రేటింగ్ నమోదవగా.. మూడోస్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు 12.19తో ఉంది. అంటే కేవలం 0.02తో రెండో స్థానాన్ని కోల్పోయింది.
నాలుగో స్థానంలో ఇంటింటి రామాయణం సీరియల్ ఉంది. ఈ సీరియల్ కు 11.84 రేటింగ్ నమోదైంది. ఐదో స్థానంలో చిన్ని సీరియల్ 9.31 రేటింగ్ తో ఉంది. ఇక ఆ తర్వాత నువ్వుంటే నా జతగా 8.26తో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఇక జీ తెలుగు విషయానికి వస్తే.. ఆ ఛానెల్లో ఈ మధ్యే మొదలైన చామంతి సీరియల్ 9వ వారంలో 6.90 రేటింగ్ తో టాప్ లో, ఓవరాల్ గా ఏడోస్థానంలో ఉంది. ఆ తర్వాత మేఘ సందేశం 6.83, పడమటి సంధ్యారాగం 6.52, జగద్ధాత్రి 6.32 రేటింగ్స్ తో ఉన్నాయి.
ఈ ఛానెల్ ఈ మధ్యే కొన్ని సీరియల్స్ టైమ్ స్లాట్స్ మార్చేసింది. వాటికి తాజా రేటింగ్స్ లో దెబ్బ గట్టిగానే పడింది. కొన్నాళ్లుగా టాప్ సీరియల్స్ లో ఒకటిగా ఉంటూ వస్తున్న నిండు నూరేళ్ల సావాసం తాజాగా కేవలం 3.83కు పడిపోయింది. అదే కొత్త సీరియల్ లక్ష్మీనివాసంకు ఏకంగా 5.22 నమోదవడం విశేషం.
అర్బన్‌లో టాప్ 3 సీరియల్స్ ఇవే
కేవలం అర్బన్ రేటింగ్స్ చూస్తే మాత్రం టాప్ 3 సీరియల్స్ కాస్త ముందు, వెనుక అయ్యాయి. అర్బన్, రూరల్ కలిపితే కొన్నాళ్లుగా కార్తీకదీపం 2 టాప్ లో ఉంటూ వస్తోంది. అయితే కేవలం అర్బన్ రేటింగ్ చూస్తే.. గుండెనిండా గుడిగంటలు 10.32తో తొలి స్థానంలో ఉండటం విశేషం.
రెండోస్థానంలో కార్తీకదీపం 2 సీరియల్ 9.92 రేటింగ్ తో ఉంది. ఇక మూడో స్థానంలో ఇంటింటి రామాయణం 9.09 రేటింగ్ సాధించింది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు అర్బన్ కంటే రూరల్ లో ఎక్కువ ఆదరణ ఉండటంతో ఆ సీరియల్ ఇందులో టాప్ 3లో చోటు దక్కించుకోలేకపోయింది.
సంబంధిత కథనం
టాపిక్