Star Maa Serials TRP Ratings: సర్‌ప్రైజ్.. స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ 3లోకి ఆ రెండు
Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. టాప్ 3లోకి అనూహ్యంగా రెండు సీరియల్స్ దూసుకొచ్చాయి. రెండో స్థానంలో కొనసాగుతూ వస్తున్న సీరియల్ నాలుగో స్థానానికి పడిపోయింది.

Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ కు సంబంధించి ఐదో వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. అయితే ఈ వారం రేటింగ్స్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. టాప్ 3 నుంచి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ వెళ్లిపోగా.. గుండె నిండా గుడి గంటలు, ఇంటింటి రామాయణం సీరియల్స్ వచ్చాయి. మరి ఏ సీరియల్ రేటింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ ఇలా
ఐదో వారానికి సంబంధించి స్టార్ మా సీరియల్స్ రేటింగ్స్ చూస్తే.. కార్తీకదీపం 2 టాప్ ప్లేస్ లోనే కొనసాగుతోంది. ఆ సీరియల్ కు 13.71 రేటింగ్ నమోదైంది. అయితే అర్బన్ కంటే రూరల్ ఏరియాలో ఈ సీరియల్ కు ఎక్కువ ఆదరణ లభిస్తున్నట్లు తెలుస్తోంది. అర్బన్ ఏరియాలో ఈ సీరియల్ కు కేవలం 10.23 రేటింగే వచ్చింది. ఇక రెండో స్థానంలోకి గుండె నిండా గుడి గంటలు సీరియల్ దూసుకొచ్చింది. తాజా రేటింగ్స్ లో ఈ సీరియల్ కు 13.08 రేటింగ్ నమోదైంది.
మూడో స్థానంలో ఇంటింటి రామాయణం సీరియల్ ఉంది. గుండె నిండా గుడి గంటలు సీరియల్ కు గట్టి పోటీ ఇస్తూ 13.05 రేటింగ్ సాధించింది. ఇక కొన్నాళ్లుగా రెండో స్థానంలో ఉంటూ వస్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఆ సీరియల్ కు ఐదో వారం 12.86 రేటింగే నమోదైంది. ఐదో స్థానంలో 9.99 రేటింగ్ తో చిన్ని సీరియల్ ఉండగా.. కొత్త సీరియల్ నువ్వుంటే నా జతగా 8.76 రేటింగ్ తో ఆరో స్థానంలోకి దూసుకొచ్చింది.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే.. ఆ ఛానెల్లో పెద్దగా మార్పులు లేవు. అయితే కొన్ని సీరియల్స్ రేటింగ్స్ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఐదోవారానికి చూస్తే 7.47 రేటింగ్ తో పడమటి సంధ్యారాగం ఆ ఛానెల్లో టాప్ రేటింగ్ సీరియల్ గా ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ సీరియల్ స్థానం ఏడు.
కొత్త సీరియల్ చామంతి 6.9 రేటింగ్ సాధించగా.. మేఘసందేశం 6.64, జగద్ధాత్రి 6.45 రేటింగ్స్ తో ఉన్నాయి. అమ్మాయిగారు 5.77, నిండు నూరేళ్ల సావాసం 5.53 రేటింగ్స్ సాధించాయి. ఒక దశలో జీతెలుగు టాప్ సీరియల్స్ లో ఒకటిగా ఉన్న నిండు నూరేళ్ల సావాసం క్రమంగా రేటింగ్ కోల్పోతూ వస్తోంది.
ఈటీవీ, జెమెని సీరియల్స్ రేటింగ్స్
ఈటీవీ, జెమెని సీరియల్స్ రేటింగ్స్ లోనూ పెద్దగా చెప్పుకోదగిన మార్పులేమీ కనిపించడం లేదు. ఈటీవీలో రంగులరాట్నం సీరియల్ 3.53తో టాప్ లో ఉండగా.. 2.98తో బొమ్మరిల్లు, 2.87తో ఝాన్సీ సీరియల్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
జెమిని సీరియల్స్ లో ఒక్కటి కూడా కనీసం 1 రేటింగ్ దాటలేకపోయాయి. శ్రీమద్ రామాయణం మాత్రం 0.9 రేటింగ్ తో ఉంది. భైరవి 0.75, సివంగి 0.53 రేటింగ్స్ సాధించాయి.
సంబంధిత కథనం