Star Maa Serial TRP Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్.. టాప్ 10లోకి దూసుకొచ్చిన కొత్త సీరియల్-star maa serials trp ratings karthika deepam on top nuvvunte naa jathaga in top 10 zee telugu serial trp ratings ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Star Maa Serial Trp Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్.. టాప్ 10లోకి దూసుకొచ్చిన కొత్త సీరియల్

Star Maa Serial TRP Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్.. టాప్ 10లోకి దూసుకొచ్చిన కొత్త సీరియల్

Hari Prasad S HT Telugu
Jan 09, 2025 04:50 PM IST

Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. 53వ వారానికి సంబంధించిన ఈ రేటింగ్స్ లో టాప్ 6లో ఎలాంటి మార్పులు లేవు. అయితే కొత్త సీరియల్ మాత్రం క్రమంగా రేటింగ్స్ లో మెరుగవుతోంది.

స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్.. టాప్ 10లోకి దూసుకొచ్చిన కొత్త సీరియల్
స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్.. టాప్ 10లోకి దూసుకొచ్చిన కొత్త సీరియల్

Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ కు సంబంధించి 53వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. వీటిలో కార్తీకదీపం, ఇల్లు ఇల్లాలు పిల్లలు మాత్రం టాప్ 2లోనే కొనసాగుతున్నాయి. తాజాగా రిలీజైన ఈ టీఆర్పీల్లో పలు సీరియల్స్ రేటింగ్స్ మెరుగయ్యాయి. ముఖ్యంగా కొత్త సీరియల్ నువ్వుంటే నా జతగా క్రమంగా ఈ రేటింగ్స్ లో మెరుగవుతూ వస్తుండటం విశేషం. ఈసారి ఏకంగా టాప్ 10లోకి దూసుకెళ్లింది.

yearly horoscope entry point

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

స్టార్ మా సీరియల్స్ లో కార్తీకదీపం నంబర్ వన్ గా కొనసాగుతూ వస్తోంది. తాజాగా 53వ వారం టీఆర్పీల్లో 13.61 రేటింగ్ తో తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇల్లు ఇల్లాలు పిల్లలు 12.39తో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఒక దశలో కార్తీకదీపం సీరియల్ కు గట్టి పోటీ ఇచ్చిన ఈ సీరియల్.. గత రెండు వారాలుగా కాస్త నెమ్మదించింది. ఇక మూడో స్థానంలో ఇంటింటి రామాయణం సీరియల్ 11.69తో ఉండగా.. గుండెనిండా గుడిగంటలు 11.40, చిన్ని 10.94, మగువ ఓ మగువ 8.94 రేటింగ్స్ సాధించాయి.

మొత్తంగా టాప్ 6లో స్టార్ మా సీరియల్సే ఉన్నాయి. అంతేకాదు ఈ ఛానెల్లో గత నెలలోనే ప్రారంభమైన నువ్వుంటే నా జతగా సీరియల్ క్రమంగా టీఆర్పీలను పెంచుకుంటూ వెళ్తోంది. లేటెస్ట్ టీఆర్పీల్లో ఈ సీరియల్ 7.31 రేటింగ్ సాధించి.. టాప్ 10లోకి వచ్చింది. ప్రస్తుతం 9వ స్థానంలో ఉంది.

జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే మేఘ సందేశం హవా కొనసాగుతోంది. ఈ సీరియల్ తాజాగా 8.11 రేటింగ్ సాధించింది. ఓవరాల్ గా 7వ స్థానంలో ఉంది. ఆ తర్వాత నిండు నూరేళ్ల సావాసం 7.46, పడమటి సంధ్యారాగం 7.28, చామంతి 6.89, జగద్ధాత్రి 6.63, అమ్మాయిగారు 5.72 రేటింగ్స్ సాధించాయి.

వీటిలో చామంతి కొత్తగా ప్రారంభమైన సీరియల్. లాంచింగ్ వీక్ లోనే ఎంతో మెరుగైన 6.89 రేటింగ్ సాధించడం విశేషం. ఇక ప్రైమ్ టైమ్ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు మారిన త్రినయని సీరియల్ రేటింగ్ పడిపోయింది. తాజా టీఆర్పీల్లో ఆ సీరియల్ కు 2.49 రేటింగ్ మాత్రమే నమోదైంది.

Whats_app_banner