స్టార్ మా సీరియల్స్ దూకుడు మామూలుగా ఉండటం లేదు. ప్రతి వారం టీఆర్పీ రేటింగ్స్ లో సత్తా చాటుతూనే ఉన్నాయి. టాప్ 10లో ఏకంగా 9 సీరియల్స్ ఈ ఛానెల్ కు చెందినవే కావడం విశేషం. తాజాగా 19వ వారానికి చెందిన టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. కార్తీకదీపం సీరియల్ తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది.
కొన్నేళ్లుగా తెలుగు టీవీ సీరియల్స్ విషయంలో స్టార్ మాకు అసలు తిరుగే లేకుండా పోతోంది. వీటి ముందు ఈ ఇతర తెలుగు ఛానెల్ నిలవడం లేదు. కొన్నాళ్లు జీ తెలుగు గట్టి పోటీ ఇచ్చినా.. క్రమంగా ఆ ఛానెల్ సీరియల్స్ టాప్ 10కు దూరమవుతున్నాయి. ప్రస్తుతం టాప్ 9 సీరియల్స్ స్టార్ మాకు చెందినవే కావడం విశేషం. 19వ వారం టీఆర్పీ రేటింగ్స్ లో 12.22 రేటింగ్ తో కార్తీకదీపం సీరియల్ తొలి స్థానంలో కొనసాగుతోంది.
ఇక రెండో స్థానంలోకి మరోసారి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ దూసుకొచ్చింది. ఈ సీరియల్ కు తాజాగా 11.40 రేటింగ్ నమోదైంది. ఇంటింటి రామాయణం మూడో స్థానానికి వచ్చింది. ఆ సీరియల్ కు 10.15 రేటింగ్ వచ్చింది. నాలుగో స్థానంలో గుండె నిండా గుడి గంటలు ఉంది. తృటిలో మూడో స్థానంలో కోల్పోయిన ఈ సీరియల్.. 10.07 రేటింగ్ సాధించింది.
ఏడాదికిపైగా టీఆర్పీ రేటింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగిన బ్రహ్మముడి.. మరోసారి మెల్లగా పైకి ఎగబాకుతోంది. 19వ వారం రేటింగ్స్ లో ఆ సీరియల్ కు 7.37 రేటింగ్ నమోదైంది. ఓవరాల్ గా ఆరో స్థానంలో ఉంది. దాని కంటే ముందు చిన్ని సీరియల్ 8.00 రేటింగ్ తో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
ఇక నిన్ను కోరి సీరియల్ కూడా క్రమంగా పైకి వస్తోంది. తాజా రేటింగ్స్ లో 8.33తో ఏడో స్థానానికి దూసుకురావడం విశేషం. 6.27 రేటింగ్ తో నువ్వుంటే నా జతగా సీరియల్ 8వ స్థానంలో.. 6.10తో పలుకే బంగారమాయెనా 9వ స్థానంలో నిలిచింది.
జీ తెలుగు సీరియల్స్ రోజురోజుకూ తమ ఉనికిని కోల్పోతున్నాయి. టాప్ 10లో ఆ ఛానెల్ కు చెందిన ఒకే ఒక్క సీరియల్ మాత్రమే ఉంది. అది కూడా కేవలం 6.02 రేటింగ్ తో మేఘ సందేశం 10వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక 6.01తో చామంతి సీరియల్ ఓవరాల్ గా 11వ స్థానంలో, జీ తెలుగులో రెండో స్థానంలో ఉంది.
ఇక జగద్ధాత్రి 5.82, డమటి సంధ్యారాగం 5.76, అమ్మాయిగారు 5.24 రేటింగ్స్ సాధించాయి. ఆ ఛానెల్ సీరియల్స్ టైమింగ్స్ ను మారుస్తూ ప్రయోగాలు చేస్తున్నా.. రేటింగ్స్ విషయంలో పెద్దగా మార్పులు ఉండటం లేదు. ఒకప్పుడు టాప్ 10లో కనీసం నాలుగైదు సీరియల్స్ ఉండేవి. కానీ ప్రస్తుతానికి ఒక్కటే మిగిలింది.
సంబంధిత కథనం