Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ తొలి వారం టీఆర్పీ రేటింగ్స్.. దుమ్ము రేపుతున్న చిన్ని-star maa serials trp ratings karthika deepam illu illalu pillalu chinni on top zee telugu serials trp ratings ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Star Maa Serials Trp Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ తొలి వారం టీఆర్పీ రేటింగ్స్.. దుమ్ము రేపుతున్న చిన్ని

Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ తొలి వారం టీఆర్పీ రేటింగ్స్.. దుమ్ము రేపుతున్న చిన్ని

Hari Prasad S HT Telugu
Jan 17, 2025 03:21 PM IST

Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ తొలి వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. కార్తీకదీపం సీరియల్ టాప్ లో కొనసాగుతుండగా.. చిన్ని సీరియల్ కూడా దుమ్ము రేపుతోంది. మొత్తంగా టాప్ 6లో స్టార్ మా సీరియల్సే ఉన్నాయి.

స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ తొలి వారం టీఆర్పీ రేటింగ్స్.. దుమ్ము రేపుతున్న చిన్ని
స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ తొలి వారం టీఆర్పీ రేటింగ్స్.. దుమ్ము రేపుతున్న చిన్ని

Star Maa Serials TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ తాజా టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. స్టార్ మాతోపాటు జీ తెలుగు, ఈటీవీ, జెమిని సీరియల్స్ రేటింగ్స్ వచ్చేశాయి. వీటిలో ఎప్పటిలాగే స్టార్ మా సీరియల్స్ దూసుకెళ్తుండగా.. జీ తెలుగు సీరియల్స్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఈటీవీ, జెమిని సీరియల్స్ రేటింగ్స్ లో పెద్దగా మార్పులేమీ లేవు. ఈ ఏడాది తొలి వారానికి సంబంధించిన రేటింగ్స్ తాజాగా వచ్చాయి.

yearly horoscope entry point

స్టార్ మా సీరియల్స్ రేటింగ్స్

స్టార్ మా సీరియల్స్ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. తాజాగా రేటింగ్స్ లో కార్తీకదీపం 13.62 రేటింగ్ తో తొలి స్థానంలో ఉంది. అటు ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా గట్టి పోటీ ఇస్తోంది. తొలిసారి 13.03 రేటింగ్ తో రెండో స్థానంలో ఉంది. ఈ సీరియల్ 13 మార్క్ దాడటం ఇదే తొలిసారి.

ఇక మూడో స్థానంలో ఉన్న చిన్ని కూడా వారంవారం తన రేటింగ్ ను మెరుగుపరచుకుంటోంది. తాజా రేటింగ్స్ లో 11.01తో సాధించింది. నాలుగో స్థానంలో 10.72తో ఇంటింటి రామాయణం, 10.70తో గుండెనిండా గుడిగంటలు ఐదో స్థానంలో ఉన్నాయి. మగువ ఓ మగువ 8.83 రేటింగ్ తో ఆరో స్థానంలో ఉంది.

జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

అటు జీ తెలుగు సీరియల్స్ కూడా తాజా రేటింగ్స్ లో మెరుగయ్యాయి. మేఘ సందేశం సీరియల్ 8.07 రేటింగ్ తో టాప్ లో ఉంది. ఆ తర్వాత పడమటి సంధ్యారాగం 7.61, నిండు నూరేళ్ల సావాసం 7.14, చామంతి 7.11, జగద్ధాత్రి 6.96 రేటింగ్స్ సాధించాయి.

జీ తెలుగులో అనూహ్యంగా ఈ మధ్యే మొదలైన చామంతి సీరియల్ చాలా వేగంగా పైకి దూసుకొస్తోంది. ఈ సీరియల్ రేటింగ్ అప్పుడే ఏడు దాటడం విశేషం. చూస్తుంటే.. జీ తెలుగులో త్వరలోనే టాప్ లోకి దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈటీవీ, జెమిని సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

ఈటీవీ సీరియల్స్ విషయానికి వస్తే మనసంతా నువ్వే సీరియల్ 4.21తో ఆ ఛానెల్లో టాప్ లో నిలుస్తోంది. అటు రంగులరాట్నం కూడా 4.04 రేటింగ్ సాధించింది. చాలా రోజుల తర్వాత ఈటీవీలోని సీరియల్స్ రెండు 4 మార్క్ దాటాయి. ఈ రెండింటి తర్వాత బొమ్మరిల్లు 3.03, రావోయి చందమామ 2.90, శతమానంభవతి 2.18, కలిసుందాం రా 1.42 రేటింగ్స్ సాధించాయి.

ఇక జెమిని సీరియల్స్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆ ఛానెల్లో వచ్చే సీరియల్స్ లో శ్రీమద్ రామాయణం మాత్రమే 1.01 రేటింగ్ తో ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత భైరవి 0.84, కొత్తగా రెక్కలొచ్చెనా 0.82, నువ్వే కావాలి 0.66 రేటింగ్స్ తో ఉన్నాయి.

Whats_app_banner